AA22×A6 Movie : అల్లు అర్జున్ – అట్లీ కుమార్ కాంబినేషన్ లో మూవీ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఆ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో నటించబోతున్నాడు అంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో 5 గురు హీరోయిన్స్ కూడా ఉంటారట. అందులో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్‌తో పాటు దీపికా పడుకోణె కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అలాగే యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీబోర్సెతో చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా గురించి చాలా సమాచారం ఇప్పటికే బయటికి వచ్చేసింది. కానీ, ఈ మూవీకి సంబంధించి ఓపెనింగ్ పూజా ఎక్కడ జరగబోతుంది..? అనే క్లారిటీ మాత్రం రాలేదు. అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం…
పుష్ప 2 తర్వాత మరింత భారీ మూవీ చేయాలని.. అల్లు అర్జున్ ఈ AA22×A8 మూవీ చేస్తున్నాడు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, బడ్జెట్, రెమ్యునరేషన్ లెక్కల వల్ల కాస్త లేట్ అయింది. ఆలస్యం అయినా… మూవీ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే డైరెక్టర్ అట్లీ AA22×A8 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు. మొన్నటి వరకు దుబాయి లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకున్నాడు.
హైదరాబాద్‌కు వచ్చేసిన అట్లీ..
దుబాయిలో AA22×A8 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న టైంలోనే… డైరెక్టర్ అట్లీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక నుంచి హైదరాబాద్ లో ఉండే… ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటారని తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాబోతున్నాయి. ఇక ఆ వెంటనే… సెట్స్ పైకి వెళ్లడమే.
పూజా ఎక్కడా..?
ఇప్పటి వరకు అంతా బానే ఉంది. కానీ, AA22×A8 మూవీ పూజా ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రశ్న. నిజానికి ఏ సినిమాలకు అయినా… ఈ క్వశ్చన్ రాదు. కానీ, ఇప్పుడు ఈ AA22×A8 మూవీకి పూజా ఎక్కడ చేస్తారు అని క్వశ్చన్ వస్తుంది.
దీనికి కారణం… ప్రొడ్యూసర్లు. అల్లు అర్జున్ – అట్లీ మూవీని నిర్మిస్తున్న వాళ్లు… సన్ పిక్చర్స్. ఇది తమళనాడుకు చెందిన సినీ నిర్మాణ సంస్థ. ఈ నిర్మాణ సంస్థ తమిళనాడులో ఉంది కాబట్టి… వాళ్లు నిర్మించే సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా తమిళనాడులోనే జరుపుకున్నారు. అలాగే ఈ సినిమాకు డైరెక్టర్ కూడా తమిళియుడే. అలా చూస్తే AA22×A8 మూవీ పూజా తమిళనాడులో జరుగుతుందా.?? అని అనుకుంటున్నారు.
ఇక అల్లు అర్జున్… తెలుగు హీరో. ఆయన సినిమాల పూజా ఈవెంట్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. ఇలాంటి సందర్భంలో రాబోయే AA22×A8 మూవీ పూజా ఎక్కడ జరుగుతుంది..? అంటూ క్వశ్చన్ వస్తుంది. పూజా ఎక్కడ జరిగితే… అక్కడి మూవీగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి… అందరి దృష్ణి AA22×A8 పూజాపైనే ఉంది. కాగా, హైదరాబాద్‌లోనే పూజా కార్యక్రమాలు ఉంటాయని అల్లు అర్జున్ సన్నిహితులు అంటున్నట్టు సమాచారం.