BigTV English

YS Sharmila In Trouble: షర్మిలపై తిరుగుబాటు.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?

YS Sharmila In Trouble: షర్మిలపై తిరుగుబాటు.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?

YS Sharmila In Trouble: ఏపీలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అధోగతి పాలైన కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోంది? ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల నాయకత్వంపై నాయకులు అసంతృప్తితో ఉన్నారా? విశాఖలో 26 జిల్లాల అధ్యక్షులు సమావేశం కావడానికి రీజన్ ఏంటి? పార్టీలో సీనియర్ నాయకులకు అధ్యక్షురాలికి మధ్య గ్యాప్ ఉందా? షర్మిలను మార్చాలనే డిమాండ్‌ నేతలు ఎందుకు ఎత్తుకున్నారు? జిల్లాల నాయకులు షర్మిలపై చేస్తున్న ఫిర్యాదులు ఏంటి?


కిల్లి కృపారాణికి షర్మిలపై ఫిర్యాదు చేసిన నేతలు

ఏపీ కాంగ్రెస్‌లో అసమ్మతి రాగం మొదలైంది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నేతల తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విశాఖలో 26 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై, . ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి నేతలు తమ ఫిర్యాదుల చిట్టాను అందజేశారు. షర్మిల నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని…పార్టీ కార్యకలాపాల విషయంలో జిల్లా నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ను మార్చాలనే నినాదాన్ని ఈ సమావేశంలో నేతల వ్యక్తపరచడం ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.


షర్మిల బాధ్యతల స్వీకరించిన వెంటనే ఏపీలో ఎన్నికలు హడావుడి మొదలైంది. పార్టీకి పూర్వవైభవం తీసుకోచ్చేందుకు తన వంత కృషి చేస్తానని అమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ…వైఎస్‌ను బ్రాండ్‌గా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేశారు. పీసీసీ చీఫ్‌గా ఉంటూనే తాను కూడా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని, వివేకా కుమార్తె సునీతను వెంటేసుకుని ఆడ్డబిడ్డకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రచారం చేసినా..చివరి ఓటమి తప్పలేదు.

షర్మిల ఏకపక్ష వైఖరి వల్లే పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదని విమర్శలు

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇది షర్మిల నాయకత్వ వైఫల్యంగా నేతలు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల సమయంలోను నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే పార్టీ ఓట్ బ్యాంక్‌ పెంచుకోలేకపోయిందని చెబుతున్నారట. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని.. నిధుల దుర్వినియోగం జరిగిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ బహిరంగానే విమర్శలు చేశారు.

సీనియర్ నేతలను పక్కనపెడుతున్నారని ఆవేదన

పార్టీలో సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వడంలేదని…రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడంలేదని విమర్శులు గుప్పిస్తున్నారు నేతలు. ఇంతకాలం పార్టీ జెండాను మోసిన సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకుండా…వారి కష్టాన్ని పట్టించుకోకుండా షర్మిల వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. సీనియర్ల విషయంలో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తుండడంతో పలువురు పార్టీని వీడిపోతున్నారని అంటున్నారట. పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల విఫలమయ్యారని నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల పార్టీని కార్పొరేట్ శైలిలో నడుపుతున్నారని.. గ్రాస్‌రూట్ కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసే ఆలోచన అధ్యక్షురాలికు లేదని విమర్శలు చేస్తున్నారట.

Also Read: బలోచ్ బాంబ్ దెబ్బ.. పిట్టల్లా రాలుతున్న పాక్ ఆర్మీ..

షర్మిల నాయకత్వం కేంద్రీకృతంగా కొనసాగుతోందని నేతలు ఫైర్ అవుతున్నారు. ఆమె తనకు అనుకూలమైన నేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని…ఇతర సీనియర్ నేతలను పక్కనపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను పీసీసీ అధ్యక్ష పదవిస్వీకరించడంపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆమె నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. విశాఖ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కూడా షర్మిలపై విమర్శలు చేశారు.

విశాఖలో అమరణ దీక్షకు సిద్ధమైన వైఎస్ షర్మిల

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలి అంటే కచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కృపారాణి చేప్పారు. నాయకుల అభిప్రాయాలను పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎవర్ని మార్చాలనేది మా ఉద్దేశం కాదు అంటూనే …కాంగ్రెస్ పార్టీ ఏపీలో బ్రతకాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు చాలా అవసరమని నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు. విశాఖలో అమరణ దీక్షకు సిద్ధమవుతున్న రష్మిలకు వ్యతిరేకంగా విశాఖలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి అసమ్మతి రాగం వినిపించడం ఇప్పుడు చర్చినీయంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తొలగించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌తో షర్మిల దీక్షకు సన్నద్దమవుతున్నారు.

షర్మిలకు టైమ్ ఇవ్వాలని కొందరు నేతలు

ఇలాంటి తరుణంలో రష్మిలకు వ్యతిరేకంగా నాయకులు మీటింగ్‌ పెట్టుకోవడం… వ్యతిరేకంగా హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం ఆమెకుఇబ్బందిగా మారిందనే టాక్‌ నడుస్తోందట. అయితే పీసీసీ అధ్యక్షురాలికి వ్యతిరేకంగా నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కొందరు నాయకులు తప్పుబడుతున్నారట. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ అయ్యాయని…ఆమె నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు… ప్రజల సమస్యలపై పోరాటాలను గుర్తు చేస్తున్నారట కొందరు నాయకులు. షర్మిల నాయకత్వంపై అసంతృప్తి, విమర్శలు ఉన్నప్పటికీ…ఆమె పార్టీని బలోపేతం చేయడానికి సమయం ఇవ్వాలని వాదిస్తున్నారట. చూడాలి మరి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో?

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×