Poonam Kaur :’మాయాజాలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూనమ్ కౌర్(Poonam Kaur) గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కి వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇంత చేస్తున్నా.. తనకు మాత్రం న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు.. కానీ నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ను మాత్రం వదలను అంటూ చాలా స్ట్రాంగ్ గా ఇంస్టాగ్రామ్ లో రెండు పోస్ట్లు పెట్టింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
త్రివిక్రమ్ ను పొలిటిషన్ కాపాడుతున్నాడు.. మరో సంచలన పోస్ట్..
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ పై పూనమ్ వరుసగా పోస్ట్లు పెడుతోంది. దీనిపై అటు త్రివిక్రమ్ స్పందించడం లేదు. ఇప్పుడు ఏకంగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు.. అయినా సరే నేను త్రివిక్రమ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ముందే చెప్పాను.. మళ్లీ కూడా చెబుతున్నాను.. ఈ – మెయిల్ లో నా సమస్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను. ఝాన్సీ తో మాట్లాడాను. మీటింగ్ పెడదామని చెప్పింది. కానీ అంతలోనే నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది. నేను ఎవరి పేరు చెప్పలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను అంటూ చాలా గట్టిగానే చెబుతోంది. అంతేకదా ఝాన్సీ తో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా ఈమె తాజాగా షేర్ చేసింది. దీనితో గత కొంతకాలంగా రహస్యంగా ఉన్న ఈ గొడవ ఒక్కసారిగా తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు.
ఆధారాలతో సహా బయట పెడతానంటున్న పూనమ్..
ఇదిలా ఉండగా గత కొన్ని నెలల క్రితం మలయాళ మీటూ గొడవతోపాటు.. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోఎక్స్ లో త్రివిక్రమ్ పై పోస్టులు చేసి ఆయనను విచారణ చేయబట్టాలి అని మా(MAA )అసోసియేషన్ కి ఫిర్యాదు చేసింది. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కుదరదు స్వయంగా ఫిర్యాదు చేయాలి అని తెలపడంతో పూనమ్ ఇలా ఈ – మెయిల్ ద్వారా కమిటీకి విషయం తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసి ఎంతో కాలమైంది కానీ ‘మా’ నుంచి నాకు ఎటువంటి స్పందన రాలేదు. నా జీవితం నాశనం చేసి,నా ఆరోగ్యాన్ని.. ఆనందాన్ని కోల్పోయేలా చేసిన త్రివిక్రమ్ పై ‘మా’ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఆయన విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండేలా ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందుతోంది అంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. అంతలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు త్రివిక్రమ్ తో సమస్య తీరిపోయిందని, అందుకే పవన్ భాగస్వామి అయిన కూటమి సీఎంను పూనమ్ కలిసిందని ఇకపై ఎటువంటి ఫిర్యాదులు ఉండవని కూడా నెటిజన్స్ అనుకున్నారు. కానీ అంతలోనే ఒక పొలిటిషన్ తనను కాపాడుతున్నాడు అని, మళ్లీ ఈమె పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. మొత్తానికి అయితే ఇంస్టాగ్రామ్ స్టోరీలో పూనం పెట్టిన స్టోరీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ వెనుక పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు ఉన్నారా అనడానికి కూడా ఆధారాలు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ని కూడా ఇండైరెక్టుగా ఈమె కామెంట్లు చేసిందా అనే కోణంలో నెటిజన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మరి ఇప్పటికైనా త్రివిక్రమ్ దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.
ALSO READ:HBD Aditi Govitrikar: మోడల్ గా.. డాక్టర్ గా ఉన్నత శిఖరం.. వైవాహిక జీవితంలో నరకం చూసిన పవన్ బ్యూటీ..!