Big Stories

Pawan kalyan’s PoliTricks: కాదు కాదంటూనే కాపు ఓట్ల కోసం.. పవన్ దారి.. ఉభయ గోదావరి..!

- Advertisement -

Pawan Kalyan’s PoliTricks in AP Elections: “మాది కాపు పార్టీ కాదు.. ప్రజలందరి పార్టీ..” జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌మెంట్ ఇది. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 అసెంబ్లీ, ఒక ఎంపీ సీట్ దక్కించుకున్న జనసేన.. కంప్లీట్ కాన్‌ట్రడక్షన్ స్టేట్‌మెంట్స్‌ కదా. ఇలాంటివి చూస్తున్నప్పుడే పవన్‌ కల్యాణ్‌ చెప్పేదేంటి? చేసేదేంటి? అనే డౌట్స్‌ వస్తాయి ప్రజలకు. నిజంగా పవన్‌ ప్రజల నేతా? కాపుల నేతా? ఇంతకీ గోదారి గట్టునే పవన్‌ నమ్ముకున్నారా? పవన్ డెసిషన్‌ ఏంటీ? దాని వెనకున్న లెక్కేంటి?

- Advertisement -

ఏపీ పాలిటిక్స్‌ అంటే కుల రాజకీయాలు. సమీకరణాలు. ఎన్నికలు వచ్చాయంటే పైకి ఎన్ని సుమతీ శతకాలు చెప్పినా.. అభ్యర్థిని ఎంపిక చేయాలన్నా.. ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలన్నా.. కులానిదే కీ రోల్. మా మాట నమ్మడం లేదా..? ఎన్నికల టైమే కదా ఓ సారి నేతల స్పీచ్‌ వినండి. ఇంకా సరిపోకపోతే.. మీ చుట్టుపక్కల ఏపీ పాలిటిక్స్‌ ఇంట్రెస్ట్‌ ఉన్నవారి వాట్సాప్‌ స్టేటస్‌లు చూడండి. కులం ఎంతటి పాత్ర పోషిస్తుందో మీకే అర్థమవుతోంది. చివరికి మనం భారతీయులం. దేశమే అల్టిమేటమ్‌ అని స్పీచ్‌లు దంచే పవన్‌ కల్యాణ్‌ కూడా.. కాపులు ఏకం కావాలంటూ స్పీచ్‌లు ఇస్తున్నారు ఇప్పుడు.

నిజానికి ఏపీలో బీసీల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాపులు.. సెన్సస్ లెక్కల ప్రకారం ఆ సామాజికవర్గ ప్రజల సంఖ్య 27 శాతం. వీరు ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం అన్నట్టుగా నడుస్తోంది సీన్. అందుకే జనసేన పొత్తుకు వెంటనే తలూపారు చంద్రబాబు. ఇక పవన్‌ ఈ జిల్లాలను చూస్‌ చేసుకోవడం వెనక కూడా ఇదే రీజన్‌ కనిపిస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలు కీలకం. కానీ ఈ జిల్లాల్లోనే కాపులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందుకే పార్టీ ఏదైనా ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడతాయి. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎలక్షన్స్‌లో ఈ జిల్లాల్లో దారుణంగా దెబ్బతిన్నది టీడీపీ. కారణం జనసేన ఒంటరిగా పోటీ చేయడం.. చాలా సీట్లలో తక్కువ మార్జిన్‌తో వైసీపీ నేతలు గెలిచేశారు. ఈసారి ఇలాంటి మిస్టెక్స్‌ రీపిట్‌ కాకుండా జనసేనతో పొత్తు పెట్టేసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరి తమది కాపు పార్టీ కాదని చెప్పుకునే జనసేన కూడా కాపులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలనే చూస్‌ చేసుకుంది. వాళ్లకి వచ్చిన 21 సీట్లలో 11 సీట్లు ఈ జిల్లాల నుంచే సెలక్ట్ చేసుకుంది. ఆ 11 కూడా కాపులు అత్యంత కీలకంగా ఉండే నియోజకవర్గాలు.

Also Read: జగనన్న వదిలిన బాణం ఆయనకే ఎదురెళ్తోంది.. షర్మిల చీల్చే ఓట్లు ఇవే..

జనసేన నేతలే కాదు.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం కూడా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. వాళ్లకి దక్కిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి కాకినాడ. దీన్ని కావాలనే సెలెక్ట్ చేసుకున్నారు. బీజేపీ పెద్దలు కూడా కాకినాడ నుంచి తననే బరిలోకి దిగాలని సూచించారంటూ అప్పట్లో చెప్పారు. అంటే మొత్తం రాజకీయం కాపు కార్డ్‌ చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన కూడా ఈ మధ్య తన స్పీచ్‌ల్లో కాపుల ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తున్నారు. కాపు నిధుల గురించి మాట్లాడుతున్నారు. కాపు కార్పొరేషన్‌ వల్ల ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తట్టి లేపుతున్నారు. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌లో.. తన కులరహిత ఇమేజీ దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు.

మరి కాపు ఓటు బ్యాంక్ నిజంగా మొత్తం పవన్‌వైపే ఉందా? ఈ ప్రశ్నకు వెంటనే యస్ అని చెప్పలేం. ఎందుకంటే కాపు రిజర్వేషన్‌ పోరాట నేత ముద్రగడ ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్ ఓటమే తన లక్ష్యమని స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు ఆయన. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో కాపులను తన వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తూ.. అమలు కూడా చేసేస్తున్నారు. అటు కాపు నేత హరిరామజోగయ్య కూడా పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాపు జాతి కోసం పవన్ చేసిందేంటని నిలదీస్తున్నారు. 21 సీట్లు తీసుకొని కాపు సమాజానికి ఏం సందేశం ఇచ్చారంటున్నారు. నిజానికి కాపులకు రాజ్యాధికారం రావాలని.. కాపుకులం రాజకీయంగా ఐక్యంగా ఉండాలని.. అధికారాన్ని దక్కించుకోవాలన్నది ఆయన ఉద్దేశం. దానికి పవన్‌ ఒక్కరే సమర్థుడని బలంగా నమ్మిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇలాంటి ఇద్దరు కీలక కాపు నేతలు పార్టీకి దూరమయ్యారు.

Also Read: ఒంగోలు టిడిపి ఎంపీ టికెట్.. మాగుంటకే ఫైనల్

మరి ఈ నేతలు వచ్చే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతారు? మరి పవన్‌ను కాపులు ఆదరిస్తారా? ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు కట్టబెడతారా? అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News