Big Stories

Happy Days Re Release Update: కుర్రాళ్ల జీవితాలను నాశనం చేసిన సినిమా.. మళ్లీ వస్తుంది మావా..!

- Advertisement -

‘Happy Days’ Movie Re Release Update: సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో అనేది అందరికి తెల్సిన క్షణం. కాలేజ్ డేస్ అంటే ఇలాగే ఉంటాయని కుర్రాళ్లను నమ్మించిన సినిమా అది. ఇంట్లో తల్లిదండ్రులను బెదిరించి, భయపెట్టి.. ఇంజినీరింగ్ లో చేరిన సమయం. ఆ సినిమా చూసి.. జీవితమంతా హ్యాపీ డేస్ అని పాడుకున్న రోజులు అవి. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక.. ఏం సినిమారా అది అని అడిగే పనే ఉండదు. అవును.. మీరు అనుకున్నది కరక్టే.. ఇప్పుడు మనం  మాట్లాడుకుటుంది హ్యాపీ డేస్ సినిమా గురించే. ఈ మధ్యకాలంలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల సినిమాలు హిట్, ప్లాప్ అనేది పక్కన పెట్టి.. టైమ్ చూసి రీరిలీజ్ చేసి దిమ్పేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు హ్యాపీ డేస్ వంతు అన్నమాట. ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది.

- Advertisement -

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ఒక అద్భుతమైన సినిమా హ్యాపీ డేస్. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ లాంటి యాక్టర్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా.. రీరిలీజ్ కు సిద్దమవుతుంది. ఏప్రిల్ 12 న హ్యాపీ డేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. సరే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని కథ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బంధువులను దేవుడు ఇస్తాడు.. స్నేహితులను మనమే వెతుక్కోవాలి అనేది ఏదో సినిమాలో డైలాగ్. కానీ, అది అక్షర సత్యం.

చిన్నతనం నుంచి మనం పెరిగిన వాతావరణం వేరు.. స్కూల్, కాలేజ్ లో ఉండే మనుషులు వేరు. ఇంటి దగ్గర ఎవరు ఎలా ఉన్నా.. కాలేజ్ లో అందరం ఒకటే. అప్పుడు పరిచయమైన ఫ్రెండ్స్ యే లైఫ్ మొత్తం ఉంటారు.  బాధ, సంతోషం, కోపం, అలక అన్ని ఫ్రెండ్స్ తోనే అని చూపించిన సినిమా హ్యాపీ డేస్. మనం కాలేజ్ లో నేర్చుకున్నదే జీవితం. కాలేజ్ లో పరిచయమైన నలుగురు స్నేహితులు.. చదువు, ప్రేమ, గొడవలు.. ఇలా ఎలా వారు చదువు అయ్యాక పైకి వచ్చారు. కాలేజ్ వారికి ఏం నేర్పించింది.

Also Read: Update on Dasara 2 : బాంచత్.. ధరణి గాడు మళ్లొస్తున్నాడు..!

ఫ్రెండ్స్ తో వారికున్న అనుబంధం ఏంటి.. ? ఇవన్నీ హ్యాపీ డేస్ సినిమాలో చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా చూసి అప్పట్లో ఇంటర్ కుర్రాళ్లందరూ బిటెక్ జాయిన్ అయ్యారు.  కానీ, జీవితం సినిమా కాదుకదా.. సినిమాలో చూపించినట్లు కాలేజ్ లేకపోయేసరికి శేఖర్ కమ్ముల మమ్మల్ని మోసం చేశాడు రా అనుకోని రియాలిటీకి అలవాటు పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా రీరిలీజ్ అని తెలియడంతో కుర్రాళ్లు అబ్బా మా జీవితాన్ని నాశనం చేసింది ఈ సినిమానేరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఇవన్నీ పక్కన పెడితే.. ఆ కల్మషం లేని స్నేహం, సాంగ్స్ వింటూ.. పాత రోజులను తలుచుకుంటూ ఎంజాయ్ చేయడానికి అయినా గ్యాంగ్ తో సినిమాకు వెళ్లొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News