BigTV English

EX MLA Dasari Manohar: దాసరి మనోహర్ మిస్సింగ్?

EX MLA Dasari Manohar: దాసరి మనోహర్ మిస్సింగ్?

EX MLA Dasari Manohar: పదవి ఉన్నప్పుడు ఆయనకు అదుపు లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన దూకుడే వేరు. కానీ.. కాలం కలిసిరాక పోగా రాజకీయమేంటో తెలిసొచ్చింది. అప్పుడంతా.. సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఇప్పుడేమో మౌన వ్రతం. జనం బీఆర్ఎస్‌ని పవర్‌లో నుంచి దించేయడంతో.. సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించట్లేదు. అసలు.. ఆ మాజీ ఎమ్మెల్యే మౌనం వెనుక రీజనేంటి?


కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తరచుగా మాటల యుద్ధం

అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై నిత్యం విమర్శలు చేసేవారు. గత ప్రభుత్వంలో.. పెద్దపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తరచుగా మాటల యుద్ధం నడిచేది. ఆరోపణలు, సవాళ్లతో.. రాజకీయం రసవత్తరంగా నడిచేది. కానీ.. గత ఎన్నికల్లో పెద్దపల్లిలో రిజల్ట్ మారింది. దాంతో.. రాజకీయమే కాదు.. అక్కడి నేతల పంథా కూడా మారిపోయింది. మునుపటి దూకుడు ఇప్పుడు లేదు. అప్పటి మాటలు ఇప్పుడు లేవు. బీఆర్ఎస్ అధికారానికి దూరమవగానే.. ఆ పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. పైగా.. ఇప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయినట్లనిపిస్తోందని.. పెద్దపల్లిలో పెద్ద చర్చే నడుస్తోంది.


మనోహర్ రెడ్డి, విజయ రమణారావు మధ్య పొలిటికల్ వార్

దాసరి మనోహర్ రెడ్డి.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. కానీ.. ఇప్పుడు పెద్దపల్లిపై కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. 2018 నుంచి 2023 వరకు.. మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నేత విజయ రమణారావు మధ్య నిత్యం రాజకీయ యుద్ధం నడిచేది. ఏదో ఒక అంశంతో.. ఇద్దరూ జనంలో ఉండేవారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకునేవారు. చివరికి.. దేవుడిపై ప్రమాణాలు కూడా చేసే స్థాయికి వెళ్లింది వీళ్లిద్దరి మధ్య రాజకీయ పోరు! అయితే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతే.. ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఒకప్పటి దూకుడు ఆయనలో కనిపించట్లేదు. చివరికి.. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనట్లేదు.

దాసరి మనోహర్ రెడ్డి పార్టీకి సమయం ఇవ్వట్లేదనే టాక్

ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత.. పార్టీ కోసం దాసరి మనోహర్ రెడ్డి పెద్దగా సమయం ఇవ్వట్లేదని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అటు.. అధికార కాంగ్రెస్ పార్టీపైనా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే విజయ రమణారావు.. ప్రతిపక్షంలో ఉండగా.. మనోహర్ రెడ్డిపై తరచుగా విమర్శలతో విరుచుకుపడేవారు. దానికి.. మనోహర్ రెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. కానీ.. ఈయన ప్రతిపక్షంలోకి వచ్చాక.. ఎలాంటి విమర్శలు చేయకపోవడం, దూకుడు తగ్గించడంతో.. అసలు మనోహర్ రెడ్డికి ఏమైంది? అనే చర్చ మొదలైంది.

ప్రజా సమస్యలపై ఉద్యమించాలంటున్న బీఆర్ఎస్

ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు సైలెంట్ అయిపోవడంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఓ పక్కేమో.. బీఆర్ఎస్ అధిష్టానం.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలంతా ప్రజా సమస్యలపై ఉద్యమించాలని చెబుతోంది. పెద్దపల్లిలో మాత్రం.. పార్టీ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయ్. గడిచిన 15 నెలల్లో.. పెద్దపల్లిలో చెప్పుకునే విధంగా పెద్దగా చేసిందేమీ లేదు.

Also Read: అమల్లోకి భూ భారతి చట్టం.. పోర్టల్‌లో ఉండే సేవలు ఇవే..

మనోహర్ రెడ్డే సైలెంట్ అవడంతో మౌనంగా క్యాడర్

పెద్దపల్లి బీఆర్ఎస్‌కి ఫేస్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డే సైలెంట్ అయిపోవడంతో.. క్యాడర్ కూడా మౌనంగా ఉంటోంది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలతో నాయకులు దూసుకెళ్తుంటే.. ఇక్కడ మాత్రం.. నామ్ కే వాస్తే అన్నట్లుగా సాగుతున్నాయ్. రాష్ట్రం మొత్తం నియోజకవర్గ ఇంచార్జ్‌లు.. స్థానిక అంశాలపై ఉద్యమాలు చేస్తున్నారు. పెద్దపల్లి సెగ్మెంట్‌లో మాత్రం.. ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగడం లేదు. దాంతో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారనే చర్చ సాగుతోంది.

స్థానిక ఎమ్మెల్యేకు సమయం ఇచ్చామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు

అయితే.. తాజా రాజకీయ పరిస్థితులని బీఆర్ఎస్ కొంత కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ నాయకుడులో దూకుడు తగ్గలేదని.. స్థానిక ఎమ్మెల్యేకు కాస్త సమయం ఇచ్చామని.. పార్టీ నేతలు చెబుతున్నారు. ఇకపై.. ప్రజా సమస్యలపై దూకుడుగా స్పందిస్తామని.. క్యాడర్ చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధంగానే ఉన్నామని చెబుతున్నా.. మనోహర్ రెడ్డి ఎందుకు పెద్దగా జనంలోకి రావట్లేదనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×