Hero Nithiin : జయం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. తేజ కి కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత నితిన్ కి సరైన హిట్ సినిమా కొన్ని ఏళ్ల వరకు పడలేదు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో నితిన్ మళ్లీ మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఇష్క్ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పుడే నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని బయటపడింది. ఆ తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు నితిన్ కి అభిమానులుగా మారిపోయారు. నితిన్ సినిమాలు విడుదలయితే ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
గుండెజారి గల్లంతయిందే
ఇష్క్ సినిమా తర్వాత నితిన్ చేసిన సినిమా గుండెజారి గల్లంతయిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక పాటలో లిరిక్ తీసుకొని టైటిల్ గా పెట్టడం మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ పాత సినిమాలోని ఒక పాటను కూడా దీనిలో రీమేక్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ని కూడా ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. నితిన్ 25వ సినిమాగా వచ్చిన చల్ మోహన్ రంగ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించారు. అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత పనిచేసిన ఏకైక మిడ్ రేంజ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నితిన్ మాత్రమే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి, నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అప్పట్లో వసూలు చేసింది.
డైరెక్టర్ వశిష్ట కు హ్యాండ్
బింబిసారా సినిమాతో దర్శకుడు పరిచయమైన వశిష్ట మొదట నితిన్ తో సినిమా చేయాల్సి ఉందట. వశిష్ట ఫాదర్ సత్యనారాయణ రెడ్డి ను, సుధాకర్ రెడ్డి వశిష్ట గురించి అడిగారట, ఆ తరుణంలో ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, మనం ఉన్నాం కదా చేద్దామంటూ చెప్పుకోచ్చారట. అయితే మొత్తానికి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి నితిన్ కి 75 లక్షల అడ్వాన్స్ కూడా పంపించారు. సినిమాటోగ్రాఫర్ గా చోటా కే నాయుడుని ఫిక్స్ చేశారు. అయితే అ ఆ సినిమా హిట్ అవడంతో మావాడు ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో పనిచేయడం కరెక్ట్ కాదు. మా వాడి రేంజ్ మారిపోయింది అంటూ వశిష్ట చేయవలసిన ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసేసారు. అప్పుడు నితిన్ తో ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయినా కూడా ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు దర్శకుడు వశిష్ట.
Also Read : Arjun SonOf Vyjayanthi : అందరూ ఆ 20 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు, దేవర రిపీట్ అవుతుందా.?