Allu Arjun : మన టాలీవుడ్ హీరోలు దీపం ఉండగానే ఇంటిని చక్కపెట్టుకుంటున్నారు. ఒక వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ లలో కనిపిస్తున్నారు. అలాగే సొంతంగా వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ చేసారు. కూల్ డ్రింక్ థమ్సప్ కు అల్లు అర్జున్ స్పెషల్ యాడ్ చేసారు. ఇప్పటివరకు మన తెలుగు నుంచి చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ తో పలువురు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ప్రముఖ బ్రాండ్స్ కు మాత్రమే ప్రమోషన్స్ చెయ్యడం చూసాము. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మరో యాడ్ లో నటించారు. ఆ యాడ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ వేయించుకోనేల అల్లు అర్జున్ ఏం యాడ్ చేశారో ఒకసారి తెలుసుకుందాం..
అల్లు అర్జున్ యాడ్స్..
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఖాతాలో హిట్ సినిమా పడటంతో పాటుగా పలు బ్రాండ్స్ కూడా తన అకౌంట్ పడ్డాయి. ఇటీవల మనమే ఆ థండర్.. అంటూ థమ్సప్ యాడ్ లో కనిపించాడు. ఒక్కొ బ్రాండ్ యాడ్‌లో నటించేందుకు అల్లు అర్జున్ ప్రస్తుతం రూ.7.5 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అయితే తమ బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు లిక్కర్, గుట్కా బ్రాండ్ కంపెనీలు రూ.10 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రజలకు ఇబ్బంది కలిగే వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదంటూ బన్నీ ఈ యాడ్స్‌ను రిజెక్ట్ చేశాడట.. అది నెట్టింట వైరల్ అవ్వడంతో ఆయన పై ప్రశంసలు కురిపించారు.. తాజాగా మరో యాడ్ విషయంలో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. కండోమ్ యాడ్ లో నటించాడని తెలుస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఆ యాడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : వారి మాయలో పడుతున్న స్టార్ హీరోలు..న్యూ లుక్ పై ఫ్యాన్స్ నిరాశ..
కండోమ్ యాడ్ నిజమేనా..?
బన్నీ యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. జాతీయ స్థాయిలో పలు సంస్థలు అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు క్యూ కడుతున్నాయి.. ఈ క్రమంలో ఓ కండోమ్ యాడ్ చేసినట్లు తెలుస్తుంది. డ్యూరెక్స్ కంపెనీ యాడ్ లో నటించినట్లు ఓ పిక్ బయటకు వచ్చింది. అయితే అది ఏఐ క్రియేట్ చేసిన పిక్ అని తెలుస్తుంది. కానీ అది చూడ్డానికి నిజంగానే అల్లు అర్జున్ ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆ యాడ్ పిక్ ఒకటి నెట్ వైరల్ అవుతుంది. అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగానే అలాంటి యాడ్ చేశారా..? లేదా ఇదంతా గ్రాఫిక్స్ నా అనేది తెలియలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
Poni veedi la condom Ad cheyamantava… https://t.co/49eX3Z6smk pic.twitter.com/DWqiWaADCL
— 𝙍₇🧢 (@Rebel____7) April 13, 2025