BigTV English

Thalapathy Vijay Remuneration: విజయ్ చివరి మూవీ రెమ్యూనరేషన్‌తో మరో బాహుబలి 3 తీయొచ్చు.. ఎన్ని కోట్లో తెలుసా..?

Thalapathy Vijay Remuneration: విజయ్ చివరి మూవీ రెమ్యూనరేషన్‌తో మరో బాహుబలి 3 తీయొచ్చు.. ఎన్ని కోట్లో తెలుసా..?
Thalapathy Vijay
Thalapathy Vijay remuneration

Thalapathy Vijay Remuneration for Last Movie: కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లల వద్ద ఫ్లెక్సీలు, పటాకీలతో ఫుల్ హంగామా చేస్తుంటారు. ఇటీవలే ఆయన లియో మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది.


ఈ మూవీ తర్వాత విజయ్ మరో సినిమా చేస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ హైప్ ఏర్పడింది. అయితే ఇంతక ముందు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫస్ట్ లుక్ గ్లింప్‌కి కాస్త నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లింప్స్‌లో విజయ్ ఏఐ బొమ్మలా ఉన్నాడంటూ కామెంట్లు వినిపించాయి.

ఇక మరికొందరు మాత్రం విజయ్ లుక్ అద్భుతంగా ఉందని.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఈ మూవీ తర్వాత తాను మరొక్క సినిమా చేసి.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి వెళ్తానని దళపతి విజయ్ ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రియుల్లో కంగారు మొదలైంది. ‘ది గోట్’ మూవీ తర్వాత విజయ్ ఎలాంటి డైరెక్టర్‌తో సినిమా చేస్తారు.


Also Read: చరణ్ కోసం మెగాస్టార్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా.. ?

తన చివరి మూవీ ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కెరీర్‌లో 69వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. విజయ్ చివరి చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అయితే ఈ చివరి సినిమా కోసం విజయ్ రెమ్యూనరేషన్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.250 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజన్లు బిత్తరపోతున్నారు. ఈ రెమ్యూనరేషన్‌తో మరొక బాహుబలి మూవీ తీయొచ్చు బాసూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదే గనుక నిజమైతే విజయ్ కెరీర్‌లోనే అత్యధికం అవుతుంది.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×