Big Stories

Political Heat In Eluru: ఏ నిమిషానికి ఏమి జరుగునో!

- Advertisement -

Political Heat In Eluru: ఏలూరు జిల్లా లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.. ఊహించని ట్విస్ట్ లు , తెగని సీట్ల పంచాయతి తో ఏ క్షణం ఎవరికి సీటు ఉంటుందో పోతుందో తెలియక అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. ఏమో గుర్రం ఎగరావచ్చు టైపులో ఆశావహలు విక్రమార్క ప్రయత్నాలతో దినమొక గండంలా ఫీలవుతున్నారంట అల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు. అధినేతల సర్వేలు, ఆర్ధిక స్థితిగతులపై ఆరాలు, ప్రజాభిప్రాయ సేకరణలు .. ఇన్ని తతంగాల మధ్య ఆశించిన స్ధానాల్లో టికెట్లు దక్కించుకున్నారు ప్రధాన పార్టీల అభ్యర్ధులు.. అంత కష్టపడి సీటు సంపాదించుకుంటే ఇప్పుడు అసమ్మతి పోరు అభ్యర్థులను వెంటాడుతుంది. అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ నామినేషన్ల నాటికి తమ సీటు ఉంటుందో లేదో అన్న భయం కొందరు అభ్యర్ధుల్లో వ్యక్తమవుతుంది.

- Advertisement -

ఎన్నికలకు చాలా గడువు ఉండటంతో అభ్యర్ధులు ఖర్చులకు వెనుకాడి ప్రచారాన్ని మందకొడిగా కొనసాగిస్తున్నారు .. దాన్నిఅలుసుగా తీసుకొని సీటు ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అధిష్టానాలకి కంప్లైంట్లు చేస్తున్నారంట. సదరు అభ్యర్ధి ఖర్చుకు వెనుకాడుతున్నారని.. అలాగైతే పార్టీ గెలవడం కష్టమని ఫిర్యాదులు చేస్తున్నారంట.. దాంతో పార్టీల పెద్దలు కూడా పునరాలోచనలో పడుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల విషయంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే కైకలూరు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు.

Also Read: పెన్షన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ.. ఈనెల 6లోగా పూర్తి చేయాలని ఆదేశం..

ఇక్కడ నుండి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. నియోజవర్గం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం లో జనసేన నుంచి పోటీ చేసిన బి.వి. రావు తానే అభ్యర్ధినని ప్రచారం చేసుకుంటున్నారు. కైకలూరు జనసేన నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొంతమంది కామినేని శ్రీనివాస్‌కు , మిగిలిన వారు బీవీరావుకు మద్దతు పలుకుతున్నారు.

బి.వి.రావు కైకలూరు టికెట్ తనకే దక్కుతుందని చెప్తుండటంతో మిత్రపక్షాల శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక నూజీవీడు టీడీపీ ఇన్చార్జ్‌గా పార్టీ బలోపేతానికి పాటుపడ్డ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ దక్కలేదు .. టీడీపీలోకి వచ్చిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని నూజివీడు అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. ముద్రబోయిన వైసీపీ కోవర్ట్ అన్న అనుమానంతోనే పక్కనపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో ముద్రబోయిన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతానంటున్నారు. వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఆఫర్ చేసినా వద్దన్న ముద్రబోయిన నూజివీడు నుంచి టీడీపీ రెబల్‌గానే పోటీలో ఉంటానంటూ పార్థసారథికి తలనొప్పిగా మారారు

ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం పోలవరం నుంచి జనసేన అభ్యర్ధిగా చిర్రి బాలరాజు పోటీ లో ఉన్నారు. ఏజెన్సీ లో పట్టు ఉన్న కాపు నేత కరాటం రాంబాబు మద్దతుతో బాలరాజు టికెట్ తెచ్చుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు .. అయితే బాలరాజు అభ్యర్థిత్వాన్ని మార్చాలని టీడీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో బాలరాజు ఆశించినంత ఎఫెక్ట్ చూపించడం లేదని.. పోలవరంలో ఆయన గెలవడం అసాధ్యమని అక్కడి టీడీపీ నేతలు వాదిస్తున్నారు .. అటు టీడీపీలో చూస్తే మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు , టీడీపీ టికెట్ ఆశించిన బొరగం శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. అందుకే టీడీపీ అధిష్టానం ఆ సీటు జనసేనకు కేటాయించి గెలిపించే బాధ్యతను టీడీపీ నేతలపై పెట్టిందంటున్నారు.

Also Read: టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర .. షెడ్యూల్‌ ఖరారు.. 

మరోపక్క వైసిపి నుండి పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో జటీచర్‌గా పని చేస్తున్న బాలరాజు భార్య తీలం రాజ్యలక్ష్మిని బరిలోకి దింపింది వైసీపీ .. అయితే రాజ్యలక్ష్మి కులంపై వివాదం రాజుకోవడంతో తాను గిరిజన బిడ్డనేనని ఆమె వివరణ ఇచ్చినా … గిరిజనసంఘాల నాయకులూ కోర్టును ఆశ్రయించడం తో అక్కడ వైసీపీ నాయకులూ ఇదేమి తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారు .. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చి నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న జెట్టి గుర్నాధం నియోజకవర్గంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు వైసీపీ అధిష్టానానికి చేర వేస్తున్నారట . . ఆ క్రమంలోతెల్లం రాజ్యలక్ష్మి తో పటు డమ్మీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సైతం నామినేషన్ వేస్తారని… ఒకవేళ కోర్టు తీర్పు తెల్లం రాజ్యలక్ష్మికి అనుకూలంగా లేకపోతే బాలరాజు రంగం లోకి దిగుతారాని చెప్పుకుంటున్నారు.

ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థిపై సైతం కూటమిలో అసమ్మతి కొనసాగుతోంది. అక్కడ టికెట్ ఆశించిన బిజెపి నాయకుడు, తపన ఫౌండేషన్ చైర్మెన్ గారపాటి సీతారామాంజనేయచౌదరి ఇంకా మౌనం వీడకపోవడంతో.. అయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బిజెపి శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం టికెట్ దక్కలేదని అలక పాన్పు ఎక్కారు. అయితే అవేమీ పట్టించుకోకుండా టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రచారంలో బిజీ అవుతున్నారు. వైసీపీ తనపై చేస్తున్న నాన్ లోకల్ అనే ప్రచారాన్ని తిప్పి కొడుతూ భారతీయుడ్ని అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి పార్టీల పెద్దలు మాగంటి బాబుతో పాటు తపనచౌదరిలను ఎలా బుజ్జగించి దారిలోకి తెస్తారో చూడాలి.

.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News