BigTV English

Perni Nani: కాళ్ల బేరానికి పేర్ని నాని? కారణం ఇదేనా..?

Perni Nani: కాళ్ల బేరానికి పేర్ని నాని? కారణం ఇదేనా..?

Perni Nani: అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెప్తున్నారు. రాజకీయ కక్షలతో ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు పెడ్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల వ్యవహార తీరిది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దుపొద్దు లేకుండా చెలరేగిపోయిన మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడు బిక్కముఖం పెట్టుకుని బేలగా మాట్లాడుతుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.. తన భార్యపై కేసు పెట్టి క్షోభకు గురి చేశారని దాదాపు ఏడ్చినంత పని చేస్తున్న పేర్ని నానిపై కూటమి నేతలు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. కోట్ల రూపాయల రేషన్ బియ్యం మాయం కేసులో ఇరుక్కుని, ఇప్పుడు భార్య నెపంతో ఆయన కాళ్ల బేరానికి వచ్చినట్లు మాట్లాడటంపై కూటమి శ్రేణులు తెగ సెటైర్లు విసురుతున్నాయి.


చనిపోయిన అమ్మ మీద ఒట్టేసి తానేమీ తప్పు చేయలేదని బిక్కముఖం పెట్టి చెప్తున్నారు. అమాయకురాలైన తన భార్యపై అన్యాయంగా కేసు పెట్టి వేధిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అప్పట్లో ఇదే మాజీ మంత్రిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మాత్రం నైతిక విలువలు, మహిళలు అంటూ తెగ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయిన పేర్ని నాని ఇలా బేలగా మాట్లాడుతూ కూటమి నేతలకు టార్గెట్ అవుతున్నారు . తమ మీద కేసులు పెట్టినప్పుడు తమ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయారా అని.. పేర్ని నానిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫైరయ్యారు. ఇవాళ మహిళల గురించి మాట్లాడటానికి పేర్ని నానికి అర్హత లేదన్నారు. చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేస్తే సభ్యత గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పవన్ గురించి ఎన్నో మాటలు మాట్లాడారని.. ఆయన మంచోడు కాబట్టి ఊరికే ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మంచి తనంతో తమ చేతులు కట్టేశారని లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు తమని బయటికి రానివ్వలేదని, చంద్రబాబు దేవుడు కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్లు బయటికి వస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్లారని.. పేర్ని నాని మాత్రం దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని యద్దేవా చేశారు.


పేర్ని నాని సతీమణి జయసుధ పేరుపై ఉన్న గోడౌన్‌లోని రేషన్ బియ్యం స్టాక్ లో తేడాలున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించిపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గోడౌన్ యాజమాని అయిన పేర్ని నాని సతీమణి పైన, మరొకరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పేర్ని నాని, ఆయన కుమారుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే, రెండు రోజుల క్రితం పేర్ని నాని మీడియా సమవేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై కావాలనే రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏటంటే ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూనే.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మాత్రం కాక పట్టేస్తున్నారు.

మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్‌లో మాయమైన రేషన్‌ బియ్యం బస్తాల లెక్క తేలింది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైందన్నారు .. తర్వాత పది రోజులకు 4,840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచే సరికి ఆ లెక్క ఏకంగా 7,577 బస్తాలుగా తేలి, అధికారులకే షాక్ ఇచ్చింది. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏస్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతుంది.

తమ గోడౌన్‌లో ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయని మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీనే సివిల్ సప్లైస్ అధికారులకు లేఖ రాసింది. మాయమైన బియ్యం ఎంతో సరిగ్గా లెక్క గట్టడానికి అధికారులకు నెలరోజులు టైమ్ పట్టింది. ఈ నెల 10న పోలీసులు కేసు నమోదు చేస్తే ఇంత వరకు ఆ కేసులో ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. పేర్ని నాని కుటుంబ సభ్యులు బెయిల్ కోసం పిటీషన్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పేర్ని నాని మధ్యమధ్యలో బయటకొచ్చి గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి వెళ్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలపాలవుతుంది. ఆ క్రమంలో ఆయన సతీమణికి ముందస్తు బెయిల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: పవన్ వార్నింగ్.. పరారీలో 10 మంది వైసీపీ నేతలు

తమ గోడౌన్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబసభ్యులు గత నెల 26న లేఖ రాస్తే.. ఆ తగ్గిన బియ్యం లెక్కలు తేల్చడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటనపై పోలీసులు ఈ నెల 10న కేసు పెట్టారు. అంటే రెండున్నర వారాలు గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదు. పైగా పోలీసు అధికారులే పేర్ని నాని కుటుంబం పారిపోయే అవకాశం ఇచ్చింది. ఎక్కడున్నారో తెలియని పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు, భార్య జయసుధలు ఎంచక్కా కోర్టుల్లో పిటీషన్లు వేస్తూ బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన మాజీ పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా.. మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపైనా కూటమి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన ఘటన మరిచిపోక ముందే తమ గోడౌన్‌లో 187 టన్నుల బియ్యం తగ్గాయని.. అందుకు సంబంధించిన లెక్కలు ఎంతో చెప్తే చెల్లిస్తామని గోడౌన్ యజమాని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జెసి గీతాంజలి శర్మకు లేఖ రాసి, పెనాల్టీ చెల్లించారు. రెండు విడతలుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించిన పేర్ని నాని కుటుంబం చేసిన తప్పును ఒప్పుకున్నట్లైంది. అయినా వారిపై చర్యలు లేవు. మచిలీపట్నంలో పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది లేదని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

పోలీసుల నోటీసులపై పేర్ని నాని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తానెక్కడికీ పారిపోలేదని, తన భార్యపై కేసు పెట్టడం అన్యాయమని వాపోతున్నారు. పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటినప్పుడే పేర్ని నాని తన నివాసంలో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయడంతో ఇక కేసు నుంచి బయట పడవచ్చన్న ధీమాతోనే ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పేర్ని నానిని వదిలి పెట్టమంటున్న మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి కూడా ఆయన బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయించకపోవడం విమర్శల పాలవుతుంది.

అదలా ఉంటే మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ చెల్లించాలని గోడౌన్ యజమానురాలు జయసుధకు నోటీసులు ఇచ్చారు. తొలుత 185 టన్నుల బియ్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద రూ.1.70 కోట్లు ఫైన్ వేశారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నులు షార్టేజీ వచ్చినట్టు నిర్ధారించారు. షార్టేజీ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా రూ.3.37కోట్లు ఫైన్ విధించారు. గతంలో పేర్ని నాని కుటుంబం చెల్లించిన కోటి 70 లక్షలు మినహాయించి మిగిలిన రూ.1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గోడౌన్ యజమానురాలు పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు.

గోదాంలో తగ్గిన రేషన్ బియ్యానికి రూ. 1.78కోట్లు కట్టాలని సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ డబ్బును చెల్లించాం. అయినా నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పేర్ని నాని తాజాగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసుని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంట్లో ఆడవాళ్ల జోలికెందుకు వస్తారు. రాజకీయ కక్ష ఉంటే నన్ను, నా కొడుకును అరెస్టు చేయండి అంటున్న పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. బియ్యం మాయమైంది నిజమే కదా.. డబ్బులు కట్టాం.. కేసులు ఎందుకు పెట్టారు అంటే ఎలా కుదురుతుంది అంటూ పవన్ కౌంటర్ ఇచ్చారు.

పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో మరో కీలక అప్డేట్ ఏటంటే కాకినాడ పోర్టు బియ్యం బ్రోకర్ల నుంచి 94 లక్షలు A2 మానస తేజ బ్యాంక్ ఎకౌంట్ కు వచ్చినట్టు తెలిసింది. మాననతేజ అంటే పేర్ని నాని భార్య జయసుధ అసిస్టెంటే.. ఆ సొమ్ము మానస తేజ ఎకౌంట్ నుండి జయసుధ ఎకౌంట్ కు బదలీ అయిందంట. మరి దీనిమీద పేర్ని నాని ఏం వివరణ ఇస్తారో చూడాలి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×