BigTV English

SSMB 29 Shooting Update: ఏపీలో షూటింగ్.. ఈ లోకేషన్‌ను ఫిక్స్ చేసిన జక్కన్న

SSMB 29 Shooting Update: ఏపీలో షూటింగ్.. ఈ లోకేషన్‌ను ఫిక్స్ చేసిన జక్కన్న

SSMB 29 Shooting Update: కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించుకోకపోయినా కేవలం అనౌన్స్‌మెంట్‌తోనే హైప్ క్రియేట్ చేస్తాయి. రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ కూడా అలాంటిదే. ప్రస్తుతం రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మరుమోగిపోతుండడంతో తన తరువాతి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొన్నాళ్ల పాటు పక్కాగా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి. ఇటీవల అదంతా పూర్తయ్యి షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మరొక వార్త బయటికొచ్చింది.


షూటింగ్ ఎప్పుడంటే

మహేశ్ బాబుతో చేసే సినిమా ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అంటూ ప్రపంచాలు చుట్టేస్తూ లొకేషన్స్‌ను సెలక్ట్ చేసుకున్నారు రాజమౌళి. అంతా చూసిన తర్వాత ఈ సినిమాకు ఆంధ్రప్రదేశే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఏపీలోని బొర్రా కేవ్స్‌ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే బొర్రా కేవ్స్‌లో ఎస్ఎస్ఎమ్‌బీ 29 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు మేకర్స్. ఇప్పటికీ షూటింగే ప్రారంభం కాకపోతే ఇక ఈ సినిమా మొదలయ్యి థియేటర్లలో సందడి చేసేది ఎప్పుడు అని మహేశ్ బాబు ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.


Also Read: బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్, అప్పుడే ప్రెగ్నెన్సీ.. ఈ వండర్ ఉమెన్ జీవితంలో ఇంత విషాదమా.?

బొర్రా ఫిక్స్

2025 సంక్రాంతికి ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ (SSMB 29) షూటింగ్ ప్రారంభం కానుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ నిజం కాదని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే తన సినిమా కోసం బొర్రా కేవ్స్‌ను ఎంచుకున్న రాజమౌళి.. 2025 నుండి దీని షూటింగ్ ప్రారభించాలని సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సినిమాలోని చాలావరకు టాకీ పార్ట్‌ను బొర్రా కేవ్స్‌లోనే పూర్తిచేసేలా ప్తాన్ చేస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి ఆఫ్రికన్ అడవుల్లో కూడా ఈ మూవీ షూటింగ్ జరగనుందట. ఇప్పటికే ఆఫ్రికన్ అడవులను చుట్టేసి తన సినిమా కోసం లొకేషన్ ఫిక్స్ అయిన రాజమౌళి.. బొర్రా కేవ్స్‌ను కూడా సందర్శించినట్టు సమాచారం.

అలాంటి ఇంపాక్ట్

‘బాహుబలి’తో తన పేరుకు నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ వాల్యూ వచ్చేలా చేసుకున్నారు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని మార్చిన సినిమా అనగానే అందరికి ముందుగా ‘బాహుబలి’ గుర్తొచ్చేలా చేశారు. ఆ మూవీ క్రియేట్ ఇంపాక్ట్ అలాంటిది. ఆ తర్వాత తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే రేంజ్‌లో విజయం సాధించింది. అంతే కాకుండా ఇండియాకు ఆస్కార్ వచ్చేలా చేసింది. దీంతో రాజమౌళి ఒక సినిమా తెరకెక్కించాడంటే అది పక్కా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఆయన ఒక సినిమా తెరకెక్కించడం కోసం కనీసం మూడేళ్లు తీసుకుంటున్నా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విడుదల కావడానికి దాదాపు రెండేళ్లు పడుతుందని తెలిసినా ప్రేక్షకులు అంచనాలు సైతం తగ్గడం లేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×