BigTV English

Ktr comments: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

Ktr comments: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

KTR react to heroine's phone tapping issue


KTR comments on phone tapping issue(Breaking news in telangana): ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై నోరు విప్పేందుకు నేతలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్. ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ రాజకీయ నేత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.తనకు ఏ హీరోయిన్‌తోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు కేటీఆర్. తన క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.


హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి దిక్కుమాలిన పనులు తానెందుకు చేస్తానని ఎదురు ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలకు భయపడే ప్రసక్తిలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని తాను కోరుతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.

 

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×