Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి లాండ్స్ పరిష్కారం దొరకాలి. జింకలు, నెమళ్లు తిరిగే ప్రాంతం. 2 వేల ఎకరాల్లో విస్తరించిన యూనివర్శిటీ. అందులోనే సౌత్ నార్త్, ఈస్ట్, వెస్ట్ క్యాంపస్‌లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లు, ఇతరత్రా. ఈ 2 వేల ఎకరాల్లోనే కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమి 400 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ లాండ్స్ చుట్టూనే తీవ్రస్థాయిలో రచ్చ, చర్చ రెండూ జరుగుతున్నాయి. మరి ఇంతటి బయోడైవర్సిటీ ఉందని చెబుతున్న ఏరియాలో అసలు ఎలాంటి వాతావరణం అవసరం?
HCU బయోడైవర్శిటీపై విస్త్రత ప్రచారాలు
ఒక్కటేమిటి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఓ బయోడైవర్సిటీ జోన్. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను ప్రభుత్వం ఎప్పటి నుంచైతే చదును చేయడం ప్రారంభించిందో.. అప్పటి నుంచి ఈ జంతు జాతుల గురించి ప్రతి ఒక్కరూ మరింత హైలెట్ చేయడం ప్రారంభించారు. HCUలో ఏయే రకాల ఫ్లోరా అండ్ ఫానా ఉందో పోస్టులు పెడుతూ వస్తున్నారు. దేశంలోనే వన్ ఆఫ్ ది గ్రీనరీ క్యాంపస్ ఇది. రైట్ HCU లాండ్స్‌లో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా కాకపోయినా ఎంతో కొంత వన్యప్రాణులైతే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయన్నది కరెక్ట్‌గా తేలాలంటే అటవీశాఖ ఆధ్వర్యంలో ఫ్లోరా అండ్ ఫానా సర్వే జరగాలి. ఇదొక యాంగిల్.
1974లో ఏర్పాటైన హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ
ఇప్పుడు హాట్ డిబేట్‌గా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి పెద్ద చరిత్రే ఉంది. సరోజిని నాయుడు కుటుంబం సెంట్రల్ యూనివర్శిటీకి ఈ స్థలాన్ని స్వచ్ఛందంగా అప్పగించడంతో… 1974లో దీన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 2 వేల ఎకరాలు ఈ HCUకి ఉంది. 2003లో ఉమ్మడి ఏపీలో ఇందులోనుంచి 400 ఎకరాలను IMG కంపెనీకి క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయాలని చెప్పి అప్పగించారు.
HCUకి మిగిలింది అక్కడ 1600 ఎకరాలు
ప్రతిగా అంతే స్థలాన్ని HCUకి నాటి రాష్ట్ర ప్రభుత్వం మరో చోట కేటాయించింది కూడా. సో ఈ 2 వేల ఎకరాల్లో ఖాళీ జాగా చాలానే ఉంది. HCUకి ఇప్పుడు అక్కడ మిగిలింది 1600 ఎకరాలు. IMG కంపెనీ 400 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయకపోవడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు దాకా వెళ్లి న్యాయపోరాటం చేసి తిరిగి దక్కించుకుంది. ఇక్కడి వరకు స్టోరీ అందరికీ తెలిసిందే.
ఆర్నెళ్లదాకా ఏమీ చేయెుద్దని సుప్రీం ఆర్డర్
400 వందల ఎకరాలను చదును చేసి అభివృద్ధి కోసం కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంది. కానీ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాలు అక్కడ ఎలాంటి అభివృద్ధి వద్దు, జంతువుల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని ఆందోళనలు తీవ్రం చేశాయి. సో మ్యాటర్ సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. రిపోర్ట్ ఇచ్చేదాకా, ఆర్నెళ్ల దాకా ఎలాంటి పనులు చేపట్టొద్దని సుప్రీం ఆదేశించింది. సో అక్కడికి మ్యాటర్ ఎండ్ అయింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. రిచ్ బయోడైవర్శిటీ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంగణంలో వన్యప్రాణులను కాపాడడం ఎలా అన్నది ఇప్పుడు తెరపైకి వస్తున్న మేజర్ క్వశ్చన్.
కుక్క కరవడంతో చనిపోయిన జింక
ఈ సీన్ చూడండి… కుక్కలు వెంటపడి కరవడంతో ఓ జింక చనిపోయింది. దాన్ని HCU స్టూడెంట్స్.. HCU సెక్యూరిటీ సహాయంతో నల్లగండ్ల వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే అది చనిపోయింది. ఇది కంచ గచ్చిబౌలిలో జేసీబీలు పెట్టి తరిమేయడంతోనే ఇలా 1600 ఎకరాల్లోకి వచ్చి కుక్కల చేతిలో చనిపోయిందంటున్నారు. అయితే ఇది ముమ్మాటికీ తప్పు అని నెటిజన్లే కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది కుక్కల దాడిలో HCU పరిధిలో 40 దాకా జింకలు మృత్యువాత పడుతూనే ఉంటాయి.
2017- 22 మధ్య 300కు పైగా జింకల మృతి
ఇది ఇప్పటి సమస్య కాదు. HCUకి బయోడైవర్శిటీ కన్జర్వేషన్ గ్రూప్ ఒకటి ఉంది. దాని పేరు వైల్డ్ లెన్స్. ఇక్కడి ఫ్లోరా, ఫానాను కాపాడే చర్యలు చేపడుతుంటారు. ఈ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 2017 నుంచి 2022 మధ్య ఏకంగా 300కు పైగా జింకలు కుక్కల దాడిలో చనిపోయినట్లు తేలింది. మరి దీనికి జవాబు ఇచ్చేదెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: జగన్ తాడేపల్లి ఆఫీస్‌కి TO LET.. నెక్ట్స్ పార్టీ క్లోజ్
HCU లాండ్స్‌లో విసిరేసినట్లుగా అకడమిక్ బ్లాక్స్
ఇక్కడ మరో సీన్ చూడండి.. ఓ జింక సింగిల్గా వచ్చింది.. HCU అకడమిక్ బ్లాక్ ముందు అటు ఇటు తిరుగుతూ.. ఆహారం తింటోంది. ఈ విజువల్స్ ను కూడా ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. ఇటు చూడండి.. నెమలి పురివిప్పిన వీడియోను కూడా చూపుతున్నారు. నిజానికి HCUలో వాకింగ్‌కు వెళ్లిన వారికి.. అక్కడి స్టూడెంట్స్‌కు జింకలు, నెమళ్లు ఎన్నో కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. నో డౌట్. ఇది వైల్డ్ జోన్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది HCU వెబ్ సైట్‌లో వర్శిటీ అకడమిక్ బిల్డిం ల గురించి పెట్టిన వీడియో.
కుక్కల దాడుల్లో వన్యజీవుల ప్రాణాలు ఖతం
IMGకి ఇవ్వక ముందు 2 వేల ఎకరాలుగా ఉన్న ఈ ల్యాండ్స్ లో విసిరేసినట్లుగా ఉన్న ఈ అకడమిక్స్ బ్లాక్స్ చూడండి. 5 వేల మంది స్టూడెంట్లు, 4 వందల మంది ఫాకల్టీ.. 120కి పైగా కోర్సులు, వీరికి తోడు విదేశీ విద్యార్థులు, క్యాంపస్ స్కూల్.. ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే.. ఇంత రిచ్ బయోడైవర్శిటీ ఏరియాలో విసిరేసినట్లుగా ఉన్న ఈ అకడమిక్ బ్లాక్స్ తో వన్యప్రాణులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే వర్శిటీ అకడమిక్ బ్లాక్స్ దగ్గరకు వస్తున్న జింకలు.. అక్కడ ఫుడ్ కోసం, నీళ్ల కోసం వస్తున్న కుక్కల దాడుల్లో వరుసగా మృత్యువాత పడుతున్నాయి.
గ్రీన్ జోన్ లంగ్ స్పేస్ కాపాడడం ఎలా?
సో ఇంత బ్రహ్మాండమైన బయోడైవర్సిటీ ఉన్న ఏరియాలో విసిరేసినట్లుగా ఉన్న HCU అకడమిక్ బ్లాక్స్‌తో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోందన్న చర్చ జరుగుతోంది. అందుకే వర్శిటీని అక్కడే ఉంచడం కరెక్టా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా పశ్చిమ హైదరాబాద్‌కు ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గ్రీన్ జోన్ లంగ్ స్పేస్‌గా ఉపయోగపడుతోందంటున్నారు.
మెుత్తం వైల్డ్ యానిమల్ కన్జర్వేషన్ జోన్‌గా మారిస్తే?
మరి వన్యప్రాణులు పెద్ద ఎత్తున తిరిగే ఈ గ్రీన్ జోన్‌లో 5 వేల మంది స్టూడెంట్స్ విద్యాభ్యాసం చేస్తున్నారు. సో జంతు జాలాలకు ఆ కాస్త ఇబ్బంది కూడా రాకుండా HCU క్యాంపస్ ను మరో చోటికి తరలించి ఈ మొత్తం 2 వేల ఎకరాలను పూర్తిస్థాయి వైల్డ్ ఎనిమల్ కన్జర్వేషన్ జోన్ గా మారిస్తే ఎలా ఉంటుందన్న డిబేట్ నడుస్తోంది.