E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి.. ప్రేమానురాగాల దారంతో పుట్టింటి బాట పడుతున్న ఆడబిడ్డలు!

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి.. ప్రేమానురాగాల దారంతో పుట్టింటి బాట పడుతున్న ఆడబిడ్డలు!
Advertisement

Rakhi Purnima: రాఖీ పౌర్ణమి రాగానే.. ప్రతి ఇంటిలో స్పెషల్ వెస్టివల్ వైబ్‌ వస్తోంది. ఆడబిడ్డలు కొండంత వెలుగును మూటగట్టుకొని నవ్వుతూ పుట్టింట్లో అడుగుపెడతారు. తమ ఇంటి ఆడపడుచుల రాక కోసం ప్రతి ఇంటి గడప ఆనందంతో ఎదురుచూస్తోంది. పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయిన ఆడబిడ్డ కోసం తల్లి ఎదురుచూస్తుంది. తండ్రి దారివైపు చూస్తున్నాడు. ఆడబిడ్డ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ ఇళ్లు సందడిగా మారిపోతుంది. రాఖీ కట్టే ఆ ఒక్క క్షణంలో.. చిన్ననాటి అనుబంధం మళ్లీ కళ్లముందు కదలాడుతుంది.

కొత్త కొత్త డిజైన్లతో..

మార్కెట్లు రంగురంగుల రాఖీలు కొత్త కొత్త డిజైన్లతో మెరిసిపోతుంటే.. స్వీట్ షాపులు ఘుమఘుమలతో నోరూరిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తమను ఆటపట్టించిన అన్నయ్యకి, తమను గారాబంగా చూసుకున్న తమ్ముడి చేతికి ఏ రాఖీ కడితే బాగుంటుందోనంటూ.. అక్కాచెల్లెళ్లు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. అన్నయ్యకు రాఖీ కట్టి.. నుదుట తిలకం పెట్టి.. తీపి తినిపించి.. జీవితాంతం తోడుగా ఉండాలంటూ ఆశీర్వదించే ఆ క్షణం కోసం ప్రతి ఫ్యామిలీ సిద్ధమవుతోంది.

Advertisement

Also read: ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

పుట్టిల్లు చేరాల్సిందే..

ఎంత దూరంలో ఉన్నా.. రక్షాబంధన్ నాటికి పుట్టిల్లు చేరాల్సిందే. చేతిలో ప్రేమానురాగాల రాఖీలు పట్టుకుని ఆడబిడ్డలు పుట్టింటి బాట పడుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రయాణం ఎంత కష్టమైనా.. తోడబుట్టినవారిని చూసే ఆత్రుత ముందు ఆ అలసట అంతా పటాపంచలైపోతోంది. రాఖీ.. ఓ చిన్న దారం కావచ్చు.. కానీ దాని వెనుక దాగున్న అప్యాయత మాత్రం జీవితాంతం విడిపోని ప్రేమామృత తీరం. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో రాఖీ మహా సంబురాన్ని తెస్తోంది.

Advertisement

Also read: ఢిల్లీలో మళ్లీ మొదలైన డీలిమిటేషన్ రగడ.. బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..?

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×