BigTV English

Saudi Falcon Flight | సౌదీ రాజకుమారుడి సరదా.. 80 గద్దల కోసం ఏకంగా విమాన టికెట్లు..

Saudi Falcon Flight | గల్ఫ దేశాలలో నివసించే అరబ్బుల అభిరుచులు, అలవాట్లు, సరదాలు చాలా వింతగా ఉంటాయి. తమ సరదాల కోసం అరబ్బులు ఎంత ఖర్చైనా చేస్తారు. దాదాపు 150 ఏళ్ల ముందువరకు అరబ్బులు కటిక పేదరికంలో జీవించేవారు. గాడిద మీద ఒక ఊరు నుంచి మరో ఊరు తిరిగి అక్కడ పండే ఖర్జూరాలు అమ్ముకొని జీవనం సాగించేవారు. అలాంటిది వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి

Saudi Falcon Flight | సౌదీ రాజకుమారుడి సరదా.. 80 గద్దల కోసం ఏకంగా విమాన టికెట్లు..

Saudi Falcon Flight | గల్ఫ దేశాలలో నివసించే అరబ్బుల అభిరుచులు, అలవాట్లు, సరదాలు చాలా వింతగా ఉంటాయి. తమ సరదాల కోసం అరబ్బులు ఎంత ఖర్చైనా చేస్తారు. దాదాపు 150 ఏళ్ల ముందువరకు అరబ్బులు కటిక పేదరికంలో జీవించేవారు. గాడిద మీద ఒక ఊరు నుంచి మరో ఊరు తిరిగి అక్కడ పండే ఖర్జూరాలు అమ్ముకొని జీవనం సాగించేవారు. అలాంటిది వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారు నివసించే భూమి లో నల్లబంగారం.. అదే చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో ఆ చమురు నిక్షేపాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ విపరరీతమైన సంపదను పొందారు.


ఆ తరువాత ఇక అరబ్బులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా సౌది అరేబియా, యుఎఈ(దుబాయ్), ఖతర్, ఇరాక్, ఇరాన్, కువైత్, లాంటి దేశస్తులైన ముస్లింలు. తరతరాలు ఖర్చు చేసినా తరగని సంపద వచ్చి పడినప్పుడు వారు పనీపాట అంటూ లేకుండా రోజంతా సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా అరబ్బులు కాలక్షేపానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఒంటెల రేసింగ్, గుర్రాల రేసింగ్, కార్ల రేసింగ్, పడవల రేసింగ్ ఇలాంటివి. కానీ వీటన్నింటిలో అరుదైనది గద్దల రేసింగ్.

అవును గద్దలను అరబ్బులు చాలా ప్రేమగా పెంచుకుంటారు. వాటికి కావాల్సిన పోషణ కోసం చాలా ఖర్చుపెడతారు. గద్దల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తారు. వీటిలో గెలిచిన గద్దల యజమానులు భారీ ప్రైజ్ మనీ పొందుతారు. ముఖ్యంగా సౌదీ అరేబియా దేశం ప్రతి ఏడాది నవంబర్ చివర్లో కింగ్ అబ్దుల్ అజీజ్ ఫాల్కన్‌రి ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి గల్ఫ దేశాల నుంచి పెద పెద్ద రాజకుటుంబాలు, సంపన్నులు తమ గద్దలను తీసుకువస్తారు.


అలాగే అక్టోబర్‌లో యుఎఈ దేశం కూడా ఇలాంటి పోటీలే నిర్వహిస్తుంది. ఇవి సరిపోదంటూ ఈ ఏడాది జనవరి 30న దుబయ్ రాజు షేక్ మహమ్మద్ పేరున మరో గద్దల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 3000 గద్దలు, 700 మంది ఆ గద్దల యజమానులు పాల్గొన్నారు.

ఈ పోటీల కోసం ఆ గద్దలను చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఒక దేశం నుంచి మరో దేశం తీసుకెళ్లేందుకు వారికి రోడ్డు మార్గమున్నా.. పక్షులు అలసిపోకుడదని విమానంలో తీసుకెళతారు. గద్దలు తీసుకెళ్లడినికి విమానాలలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. వాటి కోసం కొన్ని ఎయిర్ లైన్స్ పంజరాలు ఉన్న కార్గోలు తయారుచేయించాయి. కానీ ఒక సౌదీ రాజకుమారుడు మాత్రం తన గద్దలను మరీ రాచరికంగా తీసుకుళ్లాలని భావించి ఒక్కో గద్ద కోసం ఒక సీటు బుక్ చేశాడు. ఈ సంఘటన 2017లో జరిగింది.

మరి కొంత మంది అరబ్బులైతే విమానంలోని ఫస్ట్ క్లాస్ భాగమంతా సీట్లు తీపించి గద్దలను తీసుకెళ్లేందుకు సౌకర్యాలను అమర్చారు. గద్దలను విమానంలో తీసుకెళ్లాలంటే అరబ్బు దేశాలలో ప్రతి గద్దకు ఒక పాస్ పోర్ట్ తప్పనిసరి. ఎందుకంటే ఒక్కో గద్ద మిలియన్ డాలర్ల వరకు ఖరీదు పలుకుతుంది.

సాధారణ ఎకానమి క్లాస్‌ విమాన ప్రయాణికులు ఒక గద్ద వరకు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. అదే బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, లగ్జరీ క్లాస్‌ని బట్టి 6 నుంచి 20 గద్దలకు విమానంలో ఉచిత ప్రయాణం ఉంటుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×