Tirupati SP: సమర్థవంతమైన అధికారి .. వచ్చిన అరు నెలలలో అస్తవ్యవస్థంగా ఉన్న వ్యవస్థను చక్కదిక్కాడు.. కిందిస్థాయి పోలీసు అధికారులను లైన్ లో పెట్టాడు. దీంతో పాటు గంజాయి బ్యాచ్ లను అరికట్టాడు.. సోషియల్ మీడియా పేరుతో అడ్డదిడ్డమైన వార్తలు పెట్టే వారితో పాటు …అనసరంగా అబద్దాలను నిజాలుగా వక్రీకరించాలను కొనే నాయకులకు సైతం చెక్ పెట్టాడు .. కూటమి ప్రభుత్వంపై దుష్ట్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు .. వ్యవస్థను గాడిలో పెడుతున్న తరుణంలో డివిజనల్ అధికారి నిర్లక్ష్యానికి పాపం అయన బలయ్యాడు … ఇంతకీ ఎవరా అధికారి?
టెంపుల్ సిటీ తిరుపతి…. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు … జీవితంలో ఒక్కసారైనా తిరుమలలో అడుగు పెట్టాలి అన్నది ప్రతి ఒక్క హిందువు కోరుకుంటారు … ఇక భక్తులకే కాకుండా రాజకీయ నాయకులకు సైతం తిరుపతి అంటే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్… సొంత పార్టీ పెట్టాలన్న రాజకీయ సమావేశాలు సభలు ప్రారంభించాలన్న తొలిత స్వామివారి పాదాల చెంతనే చేసేవారు… నందమూరి తారక రామారావు సైతం తెలుగుదేశం పార్టీని తిరుపతిలోనే ప్రారంభించారు అటు తర్వాత చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోని మొదలుపెట్టారు.
ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎన్నికల ముందు వారి ప్రయాణం తిరుపతి నుంచే మొదలవుతుంది… అధికారులకు సైతం తిరుపతిలో పని చేయడం ఒక కల అనే చెప్పాలి… స్వామివారి పాదాల చెంత పనిచేయడానికి ఆయా ప్రభుత్వాల్లో ఉన్నటు వంటి నేతలను ప్రసన్నం చేసుకుని మరీ అక్కడ పోస్టింగులు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు … ఇక తిరుపతిలో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ ల నుండి కిందిస్థాయి ఉద్యోగుల వరకు కొండపై ఏ రేంజ్‌లో పలుకుబడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. వీవీఐపీలు, ప్రభుత్వ పెద్దలతో నేరుగా సంబంధాలు ఉండే అవకాశం తిరుపతిలో పని చేసేటువంటి అది ప్రతి ఒక్క అధికారికి లభిస్తుంది.
అందుకే అక్కడ పోస్టింగుల కోసం అన్ని ప్రభుత్వ శాఖల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది … అయితే అదంతా గతం గత:లా మారిందా? అంటే అవును అనే సమాధానమే ఇప్పుడు ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోను నగరవాసుల్లోనూ వినిపిస్తుంది … ఒకప్పుడు తిరుపతిలో పని చేయడానికి ఉత్సాహం చూపిన ఐఏఎస్, ఐపీఎస్ సహా ఇతర అధికారులు ఇప్పుడు తిరుపతి అంటేనే వామ్మో అనే పరిస్థితికి వచ్చారంటున్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన అనేక ఘటనలే దానికి ఉదాహరణగా చెబుతున్నారు.
2019 నుంచి తిరుపతి పరిధిలో పనిచేస్తున్న రెవిన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా ఇతర అధికారులు తరచూ అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ చర్యలకు గురువుతున్నారు …. కొందరు ఎలాంటి ఆరోపణలూ ఎదుర్కోకపోయినా బదిలీలకు గురయ్యారు. 2019లో వైసీపీ పెద్దలు డిప్యూటేషన్ పై రమేశ్ రెడ్డిని తీసుకువచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన వ్యవహారించిన తీరుతో ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. తర్వత వచ్చిన అప్పల నాయుడు పార్లమెంటు ఉప ఎన్నికలలో సహాకరించక పోవడంతో అయనను బదిలీ చేసారు. తర్వాత పరమేశ్వర్ రెడ్డి వచ్చారు. అయన వైసీపీకి అనుకూలంగా పనిచేసాడనే అరోపణలు రావడంతో అయనను ఎన్నికల కమిషన్ 2024 మొదట్లో బదిలీ చేసింది.
గతేడాది ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్‌గా వచ్చిన లక్ష్మీశ అప్పటి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి శాలువాలు కప్పారు. దాంతో పాటు ఎన్నికల జాబితాపై అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదు. కోట్ల రూపాయల వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టుబడినప్పటికి దీనిపై సరిగ్గా రియాక్ట్ కాక పోవడంతో ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇక ఎస్పీ పరమేశ్వరన్ రెడ్డి బదిలీతో అ స్థానంలో వచ్చిన మల్లికా గార్గె పై ఆరోపణలు లేకపోయినా ముక్కుసూటితనంతో వ్యవహరించడం వల్ల 20 రోజులకే రాజకీయ బదిలీకి గురయ్యారు. ఆమె తర్వాత ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన హత్యాయత్నం ఘటనతో ఈసీ బదిలీ వేటు వేసింది.ఆ ఘటనకు సంబందించే చంద్రగిరి డిఎస్సీ, స్పెషల్ బ్రాంచి డిఎస్పీలు సైతం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన హర్షవర్ధన్ రాజు రెండు నెలల్లోపే కడవ జిల్లాకు బదిలీ అయ్యారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొంత కాలానికే తెలంగాణ క్యాడర్ నుంచి ఎస్పీ సుబ్బరా యుడు ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడుకు భద్రతా అధికారిగా పనిచేసిన అనుభవంతో కీలకమైన తిరుపతి జిల్లా ఎస్పీగా కొలువుదీరారు. చంద్రబాబు సైతం సుబ్బరాయుడు కోసం రాష్ట వ్యాప్తంగా నెల రోజుల పాటు ఎస్పీల బదిలీలు కూడా అపారంటే సుబ్బరాయుడికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. సుబ్బరాయుడు వచ్చీ రాగానే అవినీతి.. అక్రమాలకు పాల్పడే పోలీసుల పై కొరడా ఝుళిపించారు. 15 మందిని సస్పెండ్ చేయడమే కాకుండా వందల సంఖ్యలో ఛార్జ్ మెమోలు ఇచ్చారు. గంజాయి, అక్రమ మద్యం, బియ్యం రవాణాలపై నిఘా పెట్టారు.
లైంగిక వేధింపుల కేసులో బాధిత కుటుంబ ప్రతిష్ఠ దిగజార్చారని వైసీపీకి చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టారు. ఇక టెంపుల్ సీటీలో గంజాయి లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని, ప్రత్యేక టీమ్‌తో వరుసగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో అరెస్టు చేశారు… అంతర్గత విచారణలో తమశాఖ వారే అలక్ష్యంగా వ్యవహరించి, గంజాయి బ్యాచ్‌కి సహకరించారని తెలుసుకుని చార్జ్ తీసుకున్న ఇరవై రోజుల్లో లంచాలు తీసుకున్నవారిపై, పనిలో అలసత్వం ప్రదర్శించిన వారిపై వేటు వేశారు… గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలోనూ ఒక్కరు కూడా గాయపడకుండా.. తొలిసారి తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయని ఎస్పీ సుబ్బరాయుడుకి నగరవాసులందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఇలా పోలీసు శాఖను సక్రమంగా నడుపుతున్నారనుకుంటున్న తరుణంలో భక్తుల తొక్కిసలాట ఘటన ఆయన కొంపముంచింది… తప్పు చేసింది ఆ సమయంలో ఉన్నటువంటి డీఎస్పీ రమణ కుమార్ అయినప్పటికీ..శాంతిభద్రతల పరంగా విఫలమయ్యారన్న ఆరోపణలతో ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది .. అయితే ఎస్పీని బదిలీ చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు సహా తిరుపతి వాసుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట … ఎస్పీని బదిలీని ఆపాలంటూ తిరుపతి వాసులు ప్రెస్ మీట్ లు పెట్టడం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.. సోషల్ మీడియాలోనూ ఎస్పీకి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: MLA Kaushik Reddy: BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు
ఆ క్రమంలో తప్పు ఉన్నా లేకపోయినా తిరుపతిలో ఎస్పీ గా పనిచేయాలంటే మాత్రం భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారంట …. ఇక్కడ పనిచేసే అధికారులు ప్రతినిత్యం విమర్శలు ఎదుర్కోవాల్సింది పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు . తాజా ఘటనలో టిటిడి ఈవో చుట్టూ విమర్శలు వస్తున్నాయి… ఇలా తిరుపతి తిరుమలలో ఎక్కడ పని చేయాలన్నా అధికారులకు ఒకప్పుడు ఎంత ఆసక్తితో ఉండే వాళ్ళు… ఇప్పుడు మాత్రం భయపడుతున్నారంట. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సెంటర్ మాకొద్దు అనే పరిస్థితికి వచ్చారంటున్నారు. తిరుపతిలో పేరేడ్ గ్రౌండ్‌లో ఎసీకి బంగళా కట్టారు. దానికి ఉన్న వాస్తు లోపాల వల్లే వరుసగా ఎస్పీలు బదిలీలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది.