BigTV English

Sri Reddy Tweet: పవన్ బావ.. లోకేష్ అన్న.. శ్రీ రెడ్డి సంచలన ట్వీట్

Sri Reddy Tweet: పవన్ బావ.. లోకేష్ అన్న.. శ్రీ రెడ్డి సంచలన ట్వీట్

Sri Reddy Tweet: మొన్నటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభో అంటూ విన్నపాలు. లోకేషన్నా సారీ.. పవన్ అన్నా సారీ.. నేను ఇక రాజకీయాల జోలికి రాను. నాకు అవసరం లేదు. నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు.. కన్నీళ్లు. నేడు మాత్రం నేను మళ్లీ వచ్చేశా అనే రేంజ్ లో ఓ ట్వీట్. ఆ ట్వీట్ తో కూటమిలో లుకలుకలు పెట్టేందుకే ప్రయత్నిస్తోందని తెగ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.. శ్రీరెడ్డి. సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి, ఇప్పుడు ఒక్క ట్వీట్ తో కాక లేపారనే చెప్పొచ్చు. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏమిటంటే?


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుల పర్వం సాగుతున్న క్రమంలో నటి, వైసీపీ సానుభూతి పరురాలుగా గుర్తింపు పొందిన శ్రీ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలే టార్గెట్ గా ఆమె విమర్శలపర్వం సాగింది. అంతేకాదు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు కూడ చేసింది.

కూటమి అధికారంలోకి రాగానే అందరికీ సారీ చెబుతూ శ్రీరెడ్డి వీడియోను విడుదల చేశారు. అలాగే తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరెడ్డి. తాను ఇక రాజకీయాల గురించి మాట్లాడనని, సోషల్ మీడియాలో కూడా రాజకీయాల ఊసెత్తనని చెప్పేశారు. ఇక శ్రీ రెడ్డి సైలెంట్ గా ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు శ్రీరెడ్డి.


ఓ లోకేష్ అన్నో.. నువ్వు సీఎం అవుతావేమోనని పవన్ బావలో ఆల్రెడీ ఇన్ సెక్యూరిటీ స్టార్ట్ అయిందయ్యో.. మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు జాగ్రత్త అయ్యో టీడీపీ అంటూ శ్రీ రెడ్డి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, జనసేన కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సారీలు చెబుతూ రాజకీయాల జోలికి రానన్న శ్రీరెడ్డి, కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న ప్రచారాన్ని సాగించేందుకు ట్వీట్ చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read: Sankranti Special: సంక్రాంతికి అందరూ స్వగ్రామాల వైపు.. కానీ ఆ గ్రామస్థులు మాత్రం..?

అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పవన్ బావ అంటూ ట్వీట్ చేయడంతో జనసేన లీడర్స్ గుర్రుమంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమిని విడదీసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి సాగవని క్లారిటీ ఇచ్చారు. అలాగే లోకేష్ కూడ ఆ మాటే తెగేసి చెప్పారు. ఇలాంటి సమయంలో శ్రిరెడ్డి చేసిన ట్వీట్ మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×