Yog Raj on Yuvraj Singh: 2000 సంవత్సరంలో భారత క్రికెట్ లోకి అడుగుపెట్టిన టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి భారత క్రికెట్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత జట్టు 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలుపొందడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు ప్రపంచ కప్ లలో యువరాజ్ తన బ్యాట్, బౌలింగ్ తోను అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా యూవీ బ్యాటింగ్ లో పరుగుల సునామీ సృష్టించాడు.
Also Read: Punjab kings Captains: ఇదేం కర్మ రా.. 17 మంది కెప్టెన్స్ మారారు..కానీ తలరాత మారలేదు ?
అయితే ఇది జరిగి కేవలం మూడు సంవత్సరాల తర్వాత జరిగిన టి-20 ప్రపంచ కప్ లో స్లో బ్యాటింగ్ కారణంగా జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. క్రికెట్ అభిమానులు అతడి ఇంటిపై రాళ్లు రువ్వారు. నిజానికి యూవీని క్రికెట్ ప్రపంచంలో సిక్సర్ల కింగ్ అని పిలుస్తారు. ఒకే ఓవర్ లోని ఆరు బంతులలో ఆరు సిక్సులు కొట్టి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేని లోటును ఇప్పటివరకు మరే ఆటగాడు కూడా పూడ్చలేదు. అయితే 2011 వన్డే ప్రపంచ కప్ లో భారత్ గెలుపొందిన తర్వాత యూవి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఓవైపు రక్తం కక్కుకుంటూనే మరోవైపు భారత జట్టును గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడని తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తెలిపారు.
యువరాజ్ తండ్రి మాట్లాడుతూ.. ” క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న నా కుమారుడు యువరాజ్ ని చూసి నేనెంతో చలించిపోయాను. మన దేశానికి ప్రపంచ కప్ సాధించే క్రమంలో నా కుమారుడు యువరాజ్ సింగ్ క్యాన్సర్ కారణంగా మరణించినా నేను ఓ తండ్రిగా గర్వపడే వాడిని. నా కొడుకు పట్ల నేను ఇప్పటికీ గర్వంగానే ఉన్నాను. నా కుమారుడు గ్రౌండ్ లో రక్తం కక్కుకున్నప్పటికీ క్రికెట్ ఆడాలనే కోరుకున్నాను. ఈ విషయాన్ని ఆ సమయంలోనే తనకి ఫోన్ చేసి కూడా చెప్పాను.
చనిపోతానని భయపడవద్దని.. ఇండియా కోసం ఈ వరల్డ్ కప్ గెలిపించు.. నీకేం కాదు” అని నా కుమారుడికి చెప్పానని పేర్కొన్నారు. అయితే ఈ టోర్నీలో యూవీ 90 కి పైగా సగటుతో 362 పరుగులు చేశాడు. 86 స్ట్రైక్ రేటుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో నాలుగు హఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సాధించాడు యూవీ. అంతేకాదు బౌలింగ్ లోను 15 వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండవ బౌలర్ గా నిలిచాడు.
ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక క్యాన్సర్ నుండి కోలుకున్న యువరాజ్ తిరిగి జట్టులోకి వచ్చినా అంతకు ముందులా రాణించలేకపోయాడు. చివరికి 2019లో అతడు అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యువరాజ్ సింగ్ ప్రతిభను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.