BigTV English

Stock Market : 2023లో ఆర్థిక వ్యవస్థ భేష్.. భవిష్యత్తు ఇలాగే ఉంటుందా..?

Stock Market : యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వాతావరణ మార్పులు… ఇవన్నీ ఉన్నా 2023 కాస్త అటుఇటుగా గడిచిపోయింది. మరి 2024లో పరిస్థితి ఎలా ఉండనుంది? మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? కొత్త ఏడాదిలోనైనా పసిడి పరుగులు ఆగుతాయా? మాంద్యం ముప్పు పొంచి ఉందా? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? జ్యోతిష్యుల మాటేంటి?

Stock Market : 2023లో ఆర్థిక వ్యవస్థ భేష్..  భవిష్యత్తు ఇలాగే ఉంటుందా..?

Stock Market : యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వాతావరణ మార్పులు… ఇవన్నీ ఉన్నా 2023 కాస్త అటుఇటుగా గడిచిపోయింది. మరి 2024లో పరిస్థితి ఎలా ఉండనుంది? మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? కొత్త ఏడాదిలోనైనా పసిడి పరుగులు ఆగుతాయా? మాంద్యం ముప్పు పొంచి ఉందా? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? జ్యోతిష్యుల మాటేంటి?


2023 సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వారికి గుర్తుండిపోయే సంవత్సరమని చెప్పాలి. 2023లో 20 శాతం కంటే ఎక్కువ రాబడులు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఇన్వెస్టర్ల కళ్ళు 2024 సంవత్సరంపై పడ్డాయి. కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్ దిశ.. వడ్డీ రేట్లు, లోక్‌సభ ఎన్నికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికా, భారత్‌లలో వడ్డీ రేట్ల గమనం, ద్రవ్యోల్బణం పోకడలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు స్టాక్ మార్కెట్‌కు ప్రధాన అంశాలు కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ పెరుగుదల కొనసాగుతుందని, ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రాబోయే 3 నుంచి 6 నెలల్లో 7 శాతం పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

2023లో దేశ ఆర్థిక వ్యవస్థ వండర్స్ సృష్టించింది. వివిధ అంతర్జాతీయ సంస్థలు సైతం భారత వృద్ధిని ప్రశంసించాయి. అయితే ఇదే జోరు 2024లోనూ కొనసాగాలని ఆశిస్తున్న వేళ మాంద్యం ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో మాంద్యం హెచ్చరికలు జారీ చేసింది. దేశీయంగానూ దిగుమతుల్లో పెరుగుదల, ఎగుమతుల్లో తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్రం ఇప్పటికే తెలిపింది. మాంద్యం ముంచుకొస్తున్న వేళ అతిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదంటున్నారు. ఎమర్జెన్సీ ఫండ్, ఖర్చుల్లో కోతలు, అదనపు ఆదాయ మార్గాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.


దేశంలో గత 3 ఏళ్లుగా రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరల జోరు, 2024లోనూ కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక మందగమనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదల 2024లోనూ కొనసాగవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారుగా 65 వేలు ఉండగా.. 2024లో పసిడి ధర 70 వేల నుంచి 90 వేల వరకు పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నోస్ట్రడామస్ గురించి తెలియని వారు ఉండరు. అతను భవిష్యత్తును చాలా వాస్తవికంగా అంచనా వేయగలడని ప్రజలు నమ్ముతారు. 16వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రసిద్ధ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు ది ప్రొఫెసీస్‌ అనే బుక్‌లో జరగబోయే విషయాలను అంచనా వేస్తూ రాశాడు. ఈ బుక్‌పై అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ హిట్లర్ ఆవిర్భావం, జాన్ కెన్నెడీ హత్య, 9/11 బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి మొదలైన అనేక చారిత్రక సంఘటనలను అతను సరిగ్గా అంచనా వేశారు. అయితే చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, అది కూడా ప్రత్యేకించి నేవీ వార్‌ అని ఆయన అంచాన వేశారు. అంతేకాదు 2024 సంవత్సరంలో తీవ్రమైన వాతావరణ విపత్తులు, కరువులు, కార్చిచ్చులు, విపరీతమైన ఉష్ణోగ్రతలు చూస్తారని రాశారు. మరి 2024లో ఇవన్ని జరుగుతాయా? లేదా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే ఆయన ఊహించిన కొన్ని ఘటనలు జరిగినా.. చాలా సంఘటనలు అస్సలు జరగకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.

ఇప్పటికే సినిమాల విషయంలో మొత్తం దేశాన్ని శాసిస్తోంది సౌత్‌ ఇండియా మూవీ ఇండస్ట్రీ. బాహుబలితో మొదలైన ఈ ఖ్యాతీ లెటెస్ట్ సలార్‌ వరకు కొనసాగింది. 2024లో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సలార్‌ పార్ట్‌ టూ, కల్కీతో పాటు కార్తికేయ 2, కాంతారా పార్ట్‌ 2 కూడా ప్రేక్షకుల మందుకు రానున్నాయి. జనవరిలోనే ఓజీ, గుంటూరు కారం రానున్నాయి. ఈ రెండూ నార్త్ సంగతేమో కాని సౌత్ మొత్తం సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇక ఏప్రిల్ 5 కి ఎన్టీఆర్ దేవర రాబోతోంది.దసరాకు రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ రావొచ్చని తెలుస్తోంది. నార్త్‌లో సెన్సెషన్‌ క్రియేట్ చేసిన పుష్ప 2 కూడా తగ్గేదేలే అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×