BigTV English

USA: రాహుల్, మోదీ.. అమెరికాకు పోటాపోటీ.. ఇదీ సంగతి?

USA: రాహుల్, మోదీ.. అమెరికాకు పోటాపోటీ.. ఇదీ సంగతి?
modi rahul

USA: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ అమెరికా పర్యటనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. పొలిటికల్ వార్ ఫేర్ కు కారణమవుతున్నాయి. జూన్ 22న మోదీ యూఎస్ టూర్ కంటే ముందే ఈనెల 31న రాహుల్ పర్యటన ప్రాధాన్యంగా మారుతోంది. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ లో NRIల భారీ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు. అలాగే స్టాన్ ఫోర్డ్ వర్శిటీ విద్యార్థులతోనూ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అటు వచ్చే నెలలో మోదీకి వైట్ హౌస్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.


కర్ణాటకలో భారీ విజయం తర్వాత రాహుల్ గాంధీ స్పీడ్ పెంచుతున్నారు. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల నేపథ్యంతో లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం, బంగ్లా ఖాళీ చేయడం ఇవన్నీ ప్రజల్లో ఒకరకంగా సానుభూతి పెంచాయి. మరోవైపు దేనికైనా రెడీ అంటూ దూసుకెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కీలక స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు రాహుల్. అక్కడ జూన్ 4న 5 వేల మంది NRIలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలో పాల్గొంటారు రాహుల్.

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కీలకంగా మారుతోంది. ఎందుకంటే జూన్ 22న ప్రధాని మోదీ USA టూర్ ఉంది. అంతకు ముందే రాహుల్ షెడ్యూల్ డిసైడ్ అవడం చర్చనీయాంశమైంది. NRIల విషయంలో తమ స్టాండ్ ను చెప్పేందుకు ఈ టూర్లను అటు రాహుల్, ఇటు మోదీ ఉపయోగించుకోనున్నారు. దీంతో భారత్ బయట పొలిటికల్ వార్ ఫేర్ నడవనుంది.


రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్, కాలిఫోర్నియాలోనూ పర్యటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. రాహుల్ యూఎస్ టూర్ లో అక్కడి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో మీటింగ్ లలో పాల్గొననున్నారు.

భారత్ జోడో యాత్రతో రాహుల్ గ్రాఫ్ పెరిగిందని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చాయి. మరోవైపు కర్ణాటకలో భారీ విజయం తర్వాత అమెరికా పర్యటనకు వెళ్తుండడం ఆసక్తికర పరిణామంగా మారింది. గతంలో లండన్ పర్యటన తర్వాత భారత్ వచ్చిన రాహుల్ ను బీజేపీ కార్నర్ చేసింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయంటూ కామెంట్ చేశారు. రాహుల్ బయటి దేశాలకు వెళ్లి భారత్ ప్రతిష్ఠ తగ్గించేలా మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. అయితే తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదంటూ రాహుల్ గాంధీ కౌంటర్లు ఇచ్చారు.

మరోవైపు ప్రధాని మోదీ జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. జో బైడెన్ US అధ్యక్షుడు అయ్యాక.. తొలిసారి ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. మోదీ రాకతో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయంటూ ఇప్పటికే వైట్ హౌజ్ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. రక్షణ, క్లీన్ ఎనర్జీ, అంతరిక్షం, ఆరోగ్య భద్రత, పర్యావరణం వంటి అంశాలపై రెండు దేశాల నేతలు చర్చలు జరుపుతారన్నారు. భారత్ – అమెరికా ప్రజల మధ్య సంబంధాలు మరింత పెంచేలా పర్యటన ఉంటుందన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఏడాదిలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల అమెరికా పర్యటనలు భారత్ లో రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. పోటా పోటీ పర్యటనలతో అక్కడ ఏం జరుగుతుందన్నది కీలకంగా మారుతోంది. ఇంటా బయట రెండు చోట్ల కూడా సత్తా చాటేలా అటు మోదీ, ఇటు రాహుల్ ప్రణాళికలు వేసుకుంటున్నారు. అమెరికాలో పొలిటికల్ హీట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×