Tamballapalle Politics: నకిలీ మద్యం తయారీలో కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కొత్త ఇన్చార్జ్ నియామకం పార్టీకి తలనొప్పిగా మారిందట. అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో అధిపత్యం కోసం తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంగా జిల్లా టీడీపీ నేతలు పావులు కదుపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందంట.. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఓ వర్గంగా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి మరోవర్గంగా తంబళ్లపల్లె టీడీపీలో రాజకీయ పోరాటం నడుస్తోందంట .. దాంతో అసలు మా నియోజకవర్గంలో మీపెత్తనం ఏటంటూ తంబళ్లపల్లె టీడీపీ క్యాడర్ చికాకు పడుతుండటంతో… కొత్త ఇన్చార్జ్ నియామకంపై టీడీపీ అధిష్టానం ఎటూ నిర్ణయించుకోలేక పోతుందంటున్నారు…
రాయలసీమ అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజక వర్గం పోరాటల గడ్డ.. అనంతపురం జిల్లా సరిహద్దున ఉండటంతో కొంత విప్లవభావాలు ఉన్న జిల్లా…ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నక్స్ ల్ కదలికలు, సానుభూతి పరులు అప్పట్లో ఎక్కువుగా ఉండేవి..అలాంటి నియోజకవర్గం ఇప్పుడు పెత్తం దార్లు, పక్క నియోజకవర్గాల నేతల గుప్పిట్లో ఉంది .. వైసీపీ నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డిది పుంగనూరు .
ప్రస్తుతం పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2009లో అక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత జగన్ కోటరీ మెంబర్ అయ్యారు. ఆ క్రమంలో తంబళ్లపల్లెలో 2009లో టీడీపీ నుంచి గెలిచిన అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తంబళ్లపల్లె వైసీపీలో వర్గపోరుతో విసిగిపోయిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి .. ఆ పార్టీకే కాదు అసలు రాజకీయాలకే దూరంగా ఉండిపోయారు. అది అదనుగా చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబం తంబల్లపల్లిలో కూడా పాగా వేసి, తిరుగులేని అధిపత్యం కొనసాగిస్తుంది.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మొదటి సారి గెలిచారు. 2024లో సైతం ఆయన విజయం సాధించడానికి, టీడీపీ స్వయంకృతమే అన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చి తన విజయావకాశాలను తానే దెబ్బతీసుకుందంటారు. టీడీపీలోని కొందరు రాష్ట్ర స్థాయి నేతల ప్రోద్బలంతో అక్కడ జయచంద్రారెడ్డికి టికెట్ వచ్చిందంట. అయితే జయచంద్రారెడ్డి తన వెంట కొంతమంది వైసీసీ శ్రేణులకు కూడా పసుపు కండువా కప్పించి, వారిచేత ఎన్నికల తతంగం నడిపించారు.
ఎన్నికలప్పుడు తంబళ్లపల్లె క్యాడర్ ను దగ్గరకు రానివ్వకుండా, జయచంద్రారెడ్డి తెలివిగా స్వామి భక్తితో ద్వారకానాథ్‌రెడ్డి విజయానికి సహాకరించాడని అంటారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత రాష్ట వ్యాప్తంగా సంచలనం రేపిన మలకల చెర్వు నకిలి మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తెలడంతో అయనను పార్టీనుంచి బహిష్కరించారు.. తర్వాత టీడీపీ ఇన్ చార్జ్ పదవి విషయంలో హడావుడి నడుస్తూనే ఉంది.
జయచంద్రారెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత అయన భార్య ను తెరమీదకు తీసుకు రావడానికి జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..అయితే అది ఆదిలోనే బెడసి కొట్టడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్చార్జ్ పదవి కోసం జిల్లా పార్టీ పెద్దలు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారంట.. అయితే బయటవారు తమకు వద్దని, త్రీమెన్ కమిటీ వేయాలని స్థానిక నేతలు కోరుతున్నారంట. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లే సమర్ధుడైన ఇన్చార్జి తమకు కావాలని కోరుతున్నారంట. అయితే టీడీపీలోని రాష్ట స్థాయి నేతలు కొందరు మాత్రం తమ మనిషిని పెట్టుకోవాలని చూస్తున్నారంట..
ముఖ్యంగా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మంత్రి అనగాని ప్రసాద్‌తో ఉన్న సంబంధాలతో ఇన్చార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. స్థానిక నాయకత్వం మాత్రం ముందు ఓ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితి సరిదిద్దాలని కోరుతోందంట..అనంతపురం జిల్లా శింగనమలతో పాటు చాల నియోజకవర్గాలలో టీడీపీ.. కమిటీలు నియమించి ప్రయోగాలు చేసింది.. ఆ క్రమంలోనే తంబళ్లపల్లెలో త్రీమ్యాన్ కమిటిని ఏర్పాటు చేయాలని తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి సీరియస్‌గా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు పోయారంట.
తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జీ పదవి కోసం పక్క నియోజక వర్గాల వారు సైతం ప్రయత్నిస్తుండటం స్థానిక తమ్ముళ్లకు మింగుడుపడటం లేదంటున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఓ గ్రూపుగా అన్నమయ్య జిల్లాలో ఉన్నారు. మరోవైపు పార్టీ పార్టమెంటరీ పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌తో పాటు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఓ జట్టు కట్టారు..ఈ రెండు గ్రూపులు తంబల్లపల్లి లో తమ వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయంట.
అయితే స్థానిక క్యాడర్ మాత్రం సమర్థవంతమైన నాయకుడిని రంగంలోకి దింపాలని అంటోంది.. ఎవరి మాట కాదనలేని, పార్టీ అధిష్టానం మాత్రం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ ఇన్చార్జ్ ని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కు ముందే పార్టీ ఓ నిర్ణయం తీసుకోవాలని తంబళ్లపల్లె టీడీపీ నేతలు కొరుకుంటున్నారు.. తెలుగుయువత రాష్ట అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తో పాటు మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ్ సైతం తంబళ్లపల్లె ఇన్ చార్జ్ రేసులో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవాకు చెక్ పెట్టడానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: ‘నా దుడ్లు నేను ఖర్చు పెడితే నీకేంటి?’.. జగన్ విమర్శలకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్!
Story by: Apparao, Big Tv