E-Paper
Advertisement

డిసెంబర్ 2న హోండా సంచలనం.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ!

డిసెంబర్ 2న హోండా సంచలనం.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ!
Advertisement

Honda Alpha EV: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమవుతోంది. భారత మార్కెట్ కోసం కంపెనీ తీసుకొస్తున్న తొలి ఎలక్ట్రిక్ SUVకి హోండా ఆల్ఫా (Honda Alpha) అని పేరు పెట్టింది. ఈ కొత్త SUVని డిసెంబర్ 2న భారత్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది. దీంతో హోండా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణం భారత్ నుంచే కీలకంగా ప్రారంభం కానుంది.

0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా కొత్త SUV

హోండా ఈ ఎలక్ట్రిక్ SUVకి సంబంధించిన కాన్సెప్ట్‌ను 2025 అక్టోబర్‌లో 0 ఆల్ఫా (0 Alpha) పేరుతో పరిచయం చేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఆధారంగా ప్రొడక్షన్ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. మిడ్‌సైజ్ SUV విభాగంలోకి రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్లు, పనితీరుపై ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఈ SUVకి సంబంధించిన పూర్తి వివరాలను హోండా వెల్లడించలేదు. డిసెంబర్ 2న జరిగే ఆవిష్కరణ సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లు.. LFP టెక్నాలజీ

Advertisement

హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ SUVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నట్లు కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఈ రెండు బ్యాటరీలు కూడా LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీతో రూపొందనున్నాయి. వీటి సామర్థ్యం 65kWh నుంచి 75kWh మధ్య ఉండవచ్చని అంచనా. అయితే, కచ్చితమైన బ్యాటరీ సామర్థ్యాలు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? ఛార్జింగ్ సమయం ఎంత? లాంటి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రారంభంలో ఈ SUV సింగిల్ మోటార్‌తో పాటు ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. మోటార్ పవర్, టార్క్ వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది.

భారత్‌లోనే తయారీ..  

హోండా ఆల్ఫా SUVని భారత్‌లోనే తయారు చేయనున్నారు. రాజస్థాన్‌లోని కంపెనీ తపుకారా ప్లాంట్ ఈ వెహికల్ కి  ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా పనిచేయనుందని భావిస్తున్నారు. అంటే భారత్‌లో తయారైన ఈ SUVని విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.

కొత్త H లోగోతో హోండా

Advertisement

ఈ SUV పేరును ప్రకటించిన సందర్భంగా హోండా ఇండియా తొలిసారిగా తన కొత్త ‘H’ గుర్తును ఉపయోగించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ కొత్త లోగోను హోండా తీసుకుంది. ఇప్పుడు భారత మార్కెట్‌లోనూ దీని వినియోగం ప్రారంభమైంది. హోండా ఆల్ఫా భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో కంపెనీకి కీలకమైన మోడల్ కానుంది. దీని ధర, రేంజ్, ఫీచర్లు, విడుదల తేదీ వంటి వివరాలపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Read Also: ఇన్నోవా క్రిస్టా ధరలు పెరిగాయి.. ఏ వేరియంట్‌పై ఎంతంటే?

Tags

Related News

మారుతి డిజైర్‌కు అదిరిపోయే క్రేజ్.. 35 లక్షల యూనిట్ల తయారీ పూర్తి!

హోండా రెంబల్ 300 బుక్ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?

ఇన్నోవా క్రిస్టా ధరలు పెరిగాయి.. ఏ వేరియంట్‌పై ఎంతంటే?

హ్యుందాయ్ నవంబర్ ఆఫర్లు వచ్చేశాయ్.. క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల డిస్కౌంట్!

నార్టన్ కొత్త రోడ్‌స్టర్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

BYD సంచలనం.. ఈ కారు రోడ్లపైనే కాదు.. నీళ్లలోనూ దూసుకెళ్తుంది!

సఫారీ EV To అవిన్య X.. టాటా నుంచి రాబోతున్న 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

Big Stories

Advertisement
×