Bitcoin Security: బిట్ కాయిన్‌ను సృష్టించిన సతోషి నకామోటో ఇది వంద శాతం పర్ఫెక్ట్ అని ఎప్పుడూ చెప్పలేదు. నెట్వర్క్ వేగంగా పెరిగితే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు అని ఆయన ముందే సూచించారు. కాలక్రమేణా ప్రభుత్వాలు, బ్యాంకులతో సంబంధం లేని వికేంద్రీకృత కరెన్సీ కావడంతో ఇది హ్యాక్ చేయడం అసాధ్యమనే నమ్మకం అందరిలో బలపడింది.
రూ. 59 వేల కోట్ల డిజిటల్ కొల్లగొట్టుడు
కానీ అక్టోబర్ 29న ప్రపంచంలోనే నంబర్ వన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్.. హ్యాక్‌కు గురైంది. కేవలం 20 నిమిషాల్లో 6.3 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 59 వేల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ అసెట్స్ చోరీకి గురయ్యాయి. ఈ దాడి వెనుక నార్త్ కొరియాకు చెందిన లజారస్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఉన్నట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. గతంలో 2025లో బైబిట్ ఎక్స్ఛేంజ్ పై జరిగిన 1.5 బిలియన్ డాలర్ల దాడి వెనుక కూడా ఇదే గ్రూప్ ఉంది.
టెక్నాలజీ గొప్పదే, లోపం ఎక్కడ జరిగింది?
నిజానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ చాలా పటిష్టంగా ఉంటుంది. క్రిప్టోగ్రఫీని లేదా ఎన్క్రిప్షన్ను నేరుగా హ్యాకర్లు బ్రేక్ చేయలేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ బ్లాక్‌చెయిన్ కోడ్‌ను టచ్ చేయడం ప్రస్తుత సూపర్ కంప్యూటర్లకు కూడా అసాధ్యం. అయితే అసలు సమస్య టెక్నాలజీలో కాదు, దాని చుట్టూ ఉండే ఎకోసిస్టమ్‌లో ఉంది.
Also Read: పండుగల వేళ మెరిసిపోయే ముఖం కావాలా? ఈ సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
ఇంజనీర్ ల్యాప్‌టాప్ హ్యాక్ కావడమే దీనికి కారణం
బినాన్స్ హ్యాకింగ్‌లో హ్యాకర్లు ఎలాంటి ఎన్క్రిప్షన్ను క్రాక్ చేయలేదు. కంపెనీకి చెందిన ఒక డెవ్ఆప్స్ ఇంజనీర్ ల్యాప్‌టాప్ హ్యాక్ కావడమే దీనికి కారణం. ఆ ఒక్క ఓపెన్ డోర్ ద్వారా దాడి చేసిన వ్యక్తి పది వేర్వేరు బ్లాక్‌చెయిన్‌ల ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశాడు. మొత్తానికి టెక్నాలజీ పరంగా క్రిప్టో ఎంతో బలంగా ఉన్నప్పటికీ, దాన్ని ఆపరేట్ చేసే మనుషుల వద్దే బలహీనతలు ఉంటున్నాయి. ఎక్స్ఛేంజ్లు కేవలం మ్యాథ్స్ అండ్ కోడింగ్ మీదనే కాకుండా, తమ సిబ్బంది వాడే ల్యాప్‌టాప్‌లు, అంతర్గత భద్రతపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.