Pemmasani declared assets: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. గుంటూరు నుంచి టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు.
సింపుల్‌గా చెప్పాలంటే దేశంలో అత్యంత రిచెస్ట్ రాజకీయ నేతల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అక్షరాలా 5,705 కోట్ల రూపాయలు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన పెమ్మసాని, ఆస్తులతోపాటు అప్పులను కూడా ప్రస్తావించారు. అప్పులు 1,038 కోట్ల రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో అంచెలంచెలుగా ఎదిగారాయన. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో స్థిర, చరాస్తులను ఏ అభ్యర్థి చూపించకపోవడం గమనార్హం.
పెమ్మసాని వ్యక్తిగత ఆస్తులను పరిశీలిస్తే.. ఇతర నేతల కంటే తక్కువే. చంద్రశేఖర్ పేరుతో 2,316 కోట్లు, ఆయన వైఫ్ శ్రీరత్న పేరిట 2,289 కోట్లుు, పిల్లల పేరిట 992 కోట్ల స్థిరాస్తులున్నాయి. ముఖ్యంగా బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా, ఫార్య్చూనర్ వంటి కార్లు ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా దాదాపు ఆరు కోట్ల పైమాటే. కుమారుడు అభినవ్ పేరిట 495 కోట్లు, కూతురు సహస్ర పేరిట 495 కోట్లు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
రెండు దశాబ్దాల కిందట వైద్య విద్యలో హైయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లారు పెమ్మసాని చంద్రశేఖర్. అక్కడే వైద్య వృత్తికి సంబంధించిన ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సుతో బిజినెస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వైద్య, విద్య, నర్సింగ్, హైస్కూలు, గ్రాడ్యుయేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ రంగాల్లో తన సేవలను విస్తరించారు.
ALSO READ: ఆస్తుల చిట్టా, 41శాతం పెరుగుదల.. రిలయన్స్, జియోలో పెట్టుబడులు, 26 పైగానే
అత్యంత సంపన్నుల రాజకీయ నేతల్లో మరికొందర్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ 5,300 కోట్ల రూపాయలు. బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,568 కోట్ల రూపాయలు. బీహార్ ఎంపీ మహేంద్ర ప్రసాద్ ఆస్తుల విలువ 4,078 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఏపీకి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి 2020లో ఫ్యామిలీ ఆస్తుల విలువ అక్షరాలా 2,577 కోట్లు రూపాయలు.