E-Paper
Advertisement

BJP-Janasena Alliance: తెలంగాణ బీజేపీలో ‘జన’గణం.. పవన్ ఫ్యాక్టర్ వెనుక అసలు కథ ఇదేనా?

BJP-Janasena Alliance: తెలంగాణ బీజేపీలో ‘జన’గణం.. పవన్ ఫ్యాక్టర్ వెనుక అసలు కథ ఇదేనా?
Advertisement

BJP-Janasena Alliance: తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి… అవి ఏ ఎన్నికలైనా కాషాయ పార్టీ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచ సర్పంచ్ ఎన్నికల వరకు ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీకి గౌరవనీయ సీట్లు లభించాయి. అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరే అని గంభీరంగా ప్రకటించారు కాషాయ నేతలు. మరి తెలంగాణ బీజేపీలో రాత్రికి రాత్రే ఈక్వేషన్లు మారిపోయాయి.. నిన్నటివరకూ పొత్తులు లేవు, పొత్తు పొడుపుల్లేవన్న ఆ పార్టీ, ఎందుకు ఉన్నఫలంగా రూట్ మార్చింది..? అర్ధరాత్రి వేళ పవన్ కళ్యాణ్ ఇంటి తలుపులు తట్టాల్సిన అవసరం పరివార్ పార్టీకి ఏమొచ్చింది..? ఇది రాజకీయ వ్యూహమా…? లేక తమ అసలు సత్తా ఏంటో తెలిసొచ్చింది

కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న కమలం!

భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. వికసిత భారత్ వైపుకు దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అంటూ చెప్పుకుంటున్న పార్టీ,.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి 3-Oపాలన అందిస్తున్న అతిపెద్ద పార్టీ. కాని తెలంగాణలో మాత్రం అందుకు భిన్నగా కుడితిలో పడ్డ ఎలుకలా ఎందుకు కొట్టుకుంటుంది అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.. నిన్నటిదాకా బీజేపీ చెప్పింది ఏంటి..? ఇవాళ చేస్తున్నదేంటి..? అన్న ప్రశ్నలు కమలం పార్టీ కేడర్‌ను తీవ్రగందరగోళంలోకి నెడుతున్నాయి. తెలంగాణలో అడ్రస్ లేని పార్టీలు, ఆంధ్ర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే తెలంగాణలో పార్టీ డ్యామేజ్ అవుతుందన్న అంచనాల్లో ఉన్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేస్తానని ప్రకటించింది.

అర్ధరాత్రి పవన్ ఇంటి తలుపు తట్టిన తెలంగాణ బీజేపీ

Advertisement

తెలంగాణ బీజేపీ రాజకీయాలు తెలంగాణ నేతల చేతుల్లోనే ఉండాలన్న సంకల్పంతో ఉన్న ఆ పార్టీ, ఉన్నఫలంగా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటి తలుపులు తట్టడం తెలంగాణ రాజకీయాలతో పాటు, ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి దాకా రాజీ లేదు, రాయభారం లేదు ఒంటరి పోరే తమ లక్ష్యమన్న నేతల మాటలు, ఇవాళ ఎక్కడికి పోయాయి..? అర్ధరాత్రి వేళ పవన్ కళ్యాణ్ ఇంటి తలుపు తట్టడం, జనసేన శరణు జొచ్చడం బీజేపీ లక్ష్యానికి రాజకీయ సమాధి కట్టడమేనా..? అన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయట..

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీని పక్కన పెట్టీ, తెలంగాణలో ఉనికే ప్రశ్నార్థకమైన జనసేన పార్టీతో జతకట్టి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఒకే స్టేజ్ మీదకి వస్తామనడం, బీజేపీ రాజకీయ వ్యూహం కాదు, వైఫల్యానికి చిహ్నం అన్న విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు అది రాష్ట్ర బీజేపీ నేతల పరస్పర బలహీనతలను బహిర్గతం చేస్తుందన్న టాక్ సైతం నడుస్తోంది. తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకే, జనసేన పార్టీ లాంటి ఇతర పార్టీల మద్దతు కోరడం ఏం చెబుతోంది..? ఏం సంకేతాలిస్తుందన్న చర్చ జరుగుతోంది.

సొంత శక్తే చాలదా..? లేక కొత్త ప్రయోగమా..? బీజేపీ నిర్ణయంపై చర్చ

Advertisement

రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు కాక వ్యూహాలను రచించే కీలక వ్యూహకర్తలున్నారని, గ్రౌండ్ లెవల్లో పెద్ద క్యాడర్ ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. మరి అటువంటప్పుడు పక్క రాష్ట్రం డీప్యూటీ సీఎం అవసరం ఎందుకు వచ్చింది..? ఇది వ్యూహమా..? లేక సొంత బలంపై నమ్మకం కోల్పోవడమా…? తెలంగాణలోనూ జనసేనానీ బలోపేతం చేయడంలో భాగమా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ముందు పవన్ ఫాక్టర్… బీజేపీకి ఎందుకు అవసరం?

ఉన్న ఫలంగా పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వేళ పొత్తులు, మద్దతులపై మంతనాలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని కోరారు. అదే తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. సొంత బలం మీద నమ్మకం ఉంటే, బయట పార్టీ నాయకుడి తలుపు ఎందుకు తట్టాలి..? తెలంగాణలో క్యాడర్ ఉందంటూ చెప్పుకునే బీజేపీ, ప్రచారానికి పవన్ కళ్యాణ్ అవసరం ఎందుకొచ్చింది..? అన్న అసంతృప్తితో కూడిన సందేహాలు ఆ పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.

జనసేన పొత్తులపై తెలంగాణ బీజేపీలో మంటలు…

జనసేనా పార్టీతో పొత్తులపై, తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంధన్న టాక్ నడుస్తుందట. అంతేకాదు మేమంతా ఎందుకు..? మా పోరాటం ఎందుకు బయట పార్టీ నాయకుడే అవసరమైతే మేమెందుకు..? ఆ నిర్ణయంతో కేడర్ ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొడుతున్నారని ఆ పార్టీ శ్రేణుల మండిపడుతున్నాయి.. ఇప్పటికే పార్టీలో కొత్త పాత పంచాయతీలు నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో రచ్చ రేపుతున్నాయి. కొత్త నేతలకు వ్యతిరేకంగా పాత నేతలంతా కూటమి కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జనసేన అవసరం బీజేపీకి సంకేతమా? తొందరపాటు నిర్ణయాలా?

ఈ పంచాయితీలతోనే కమలం పార్టీ సతమతం అవుతున్న నేపద్యంలో జనసేన మద్దతు కోరడం బీజేపీకి బలమా..? బలహీనత అవుతుందా అన్న చర్చ మొదలైంది. అటు జనసేనాని కూడా తెలంగాణలో రెండు రోజులు బీజేపీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. అది తెలంగాణలో జనసేన విస్తరణకు దోహదం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రాష్ట్రంలో ఉనికే లేని పార్టీగా ఉన్న జనసేన, ఇప్పుడు బీజేపీ ఎన్నికల రాజకీయానికి అవసరమైంది. ఆ క్రమంలో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకోవడం ఒక రకంగా గెలిచే మున్సిపాలిటీ ఫలితాలపై కూడా ఈ ప్రభావం నెగిటివ్‌గా రిఫ్లెక్ట్ అవుతుందేమో అని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయంట.

Also Read:  పార్టీ మారినా అలవాట్లు మారలేదా? వైసీపీ నుంచి వచ్చిన నేతలపై మంత్రి నారాయణ సీరియస్.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×