E-Paper
Advertisement

Mardani 3: ఢిల్లీలో 807 మంది మిస్సింగ్.. పోలీసులు హెచ్చరిక.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

Mardani 3: ఢిల్లీలో 807 మంది మిస్సింగ్.. పోలీసులు హెచ్చరిక.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం
Advertisement

Mardani 3: సాధారణంగా సినిమాను పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. అయితే పబ్లిక్ లో చేసే సినిమా స్టంట్స్ ఎలా ఉండాలి అంటే కేవలం ప్రేక్షకులను ఆకర్షించగలగాలి.. సినిమా వైపు వారిని మరల్చగలగాలి. కానీ ఇక్కడ ఒక చిత్ర బృందం ఏకంగా కిడ్నాప్ కేసుల పేరిట ప్రజలలో భయభ్రాంతులకు గురిచేసింది అనే ఆరోపణలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగడంతో…చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

భయాందోళనలు కలిగించేలా పెయిడ్ ప్రమోషన్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ గా ‘మర్దాని 3’ సినిమాతో వెండితెర పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మూడు నెలల వ్యవధిలోనే సుమారుగా 93 మంది యువతులు రహస్యంగా అదృశ్యమైన కేసును చేదించే కథాంశంతోనే ఈ సినిమా రూపొందించింది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 3న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబడుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాలో ఢిల్లీలో భారీగా అమ్మాయిలు అదృశ్యం అంటూ తప్పుడు వార్తలు వచ్చి ప్రజలలో భయాందోళనలు సృష్టించడం పైన వివాదానికి దారి తీసింది. జనవరి మొదటి వారం రోజుల్లోనే ఢిల్లీలో 807 మంది అదృశ్యమయ్యారు అంటూ వైరల్ అయిన రిపోర్ట్ లపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.

కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిక..

Advertisement

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ.. పెయిడ్ ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి వైరల్ పోస్టులు జరుగుతున్నాయి. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన మర్దాని 3 మూవీ మేకర్స్ అలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఉంటారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చింది.

ALSO READ:Vikrant Massey: పని గంటలపై హీరో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ క్లారిటీ!

స్పందించిన చిత్ర బృందం..

Advertisement

“గత 50 ఏళ్లుగా మా సంస్థ ఎంతో నైతిక విలువలతో పనిచేస్తోంది. సినిమా ప్రమోషన్ కోసం సున్నితమైన అంశాలను వక్రీకరించి సెన్సేషన్ చేయడం లాంటివి మేము చేయలేదు. వాస్తవాలు త్వరలోనే బయటకి వస్తాయి. అధికారులపై మాకు పూర్తి నమ్మకం ఉంది” అంటూ ఫిలిం సంస్థ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే ఈ సినిమా బృందం పై పెయిడ్ ప్రమోషన్ కోసం ఇలా చేస్తోంది అంటూ వస్తున్న వార్తలకు యష్ రాజ్ ఫిలింస్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. మరి ఈ ఫేక్ వార్తలను ఎవరు సృష్టిస్తున్నారు? ఢిల్లీ ప్రజలలో భయాందోళన కలిగేలా ఎవరు చేస్తున్నారు? అనే విషయం తెలియాలి అంటే దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది . ఇక త్వరలోనే దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉన్నాయి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×