E-Paper
Advertisement

Pawan Kalyan: స్టైల్ మార్చిన పవన్.. ప్లాన్ ఇదేనా?

Pawan Kalyan: స్టైల్ మార్చిన పవన్.. ప్లాన్ ఇదేనా?
Advertisement

Pawan Kalyan:  ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కొత్త పంథా గురించే చర్చ జరుగుతోంది. సినిమా గ్లామర్ హంగులు పక్కన పెట్టి.. ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన పరిపాలకుడిగా మారుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్ర స్థాయి నేతలతో వ్యవహరిస్తున్న తీరు జనసైనికులను ఆనందంలో ముంచెత్తుతోంది. నెల రోజుల క్రితం ఎదుర్కొన్న విమర్శలను పక్కన పెట్టి.. ఆయన కూటమి నేతలు, కార్యకర్తలతో మనస్ఫూర్తిగా మమేకం కావడం పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ నింపుతోంది. మరి ఇంతకీ పవన్ కల్యాణ్ రాజకీయ పరిణితి ఎలా మారింది? క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుసరిస్తున్న వ్యూహమేంటి? స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆయన తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?

సినిమా గ్లామర్ వదిలి క్షేత్రస్థాయిలో ఆలోచన

ఎస్.. జనసేనాని రాజకీయ వ్యూహం మారింది. తమ బాస్ పరిణితి చెందుతున్నాడు అంటూ జనసైనికులు సంతోష పడుతున్నారు. సినిమా గ్లామర్ వదిలేసి క్షేత్ర స్థాయిలో అలోచన చేస్తున్నాడని అంటున్నారు నేతలు. మంత్రిగా తన శాఖలపై ఆయన పూర్తి స్థాయి అధ్యయనం చేశారట. మొదట్లో అటవీ శాఖ అధికారుల్లోని గ్రూపుల పంచాయితీతో వేగం అందుకోలేకపోయినా.. పంచాయితీ రాజ్ విభాగంలో మాత్రం విప్లవాత్మక మార్పులు తెచ్చారట. ముఖ్యంగా, సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణకు డీడీఓ కార్యాలయాలకు పవర్ ఇచ్చి, ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 78 డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు ప్రారంభించారు. ముఖ్యంగా, పంచాయితీ రాజ్ శాఖలో ఆయన చేపట్టిన సంస్కరణలు విప్లవాత్మకంగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది.

తాజా చిత్తూరు టూర్‌లో వ్యవహరించిన తీరుతో ఖుష్

Advertisement

నవంబర్ నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెండు రోజులు పర్యటించారు. ఆయన అటవీశాఖ తరపున రివ్యూలు చేశారు. కుంకి ఏనుగుల క్యాంప్ ను ప్రారంభించారు. అయితే రివ్యూలో సైతం స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించలేదట. దీంతో పాటు క్యాడర్ ను కూడా దూరంగా ఉంచారట. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు సైతం ఎదుర్కున్నారు. ముఖ్యంగా MLAలను సైతం మాట్లాడనీయలేదని విమర్శలు వచ్చాయి. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కొంత అసంతృప్తికి గురయ్యారట. అయితే రీసెంట్ గా పవన్.. డివిజన్ డెవలప్ మెంటు కార్యాలయం ప్రారంభోత్సవం కోసం చిత్తూరుకు వెళ్లారు. ఈ సందర్బంగా అయన వ్యవహారించిన తీరు క్యాడర్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలను ఆకట్టుకుందట. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోని సీనియర్ ఎమ్మెల్యేలు పవన్ టూర్ కు దూరంగా ఉన్నారట. అయితే వచ్చిన వారు మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది. తమ అభిప్రాయాలను పవన్ విన్నాడని సంతోషపడుతున్నారట.

కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని హామీ

చిత్తూరు పర్యటనలో అయన వర్షంలో సైతం తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికిన కూటమి ఎమ్మెల్యేలతో పాటు జనసైనికులతో ముచ్చటించారు. తర్వాత చిత్తూరులో కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత 25 నిమిషాలు కూటమి ఎమ్మెల్యేలతో క్యాడర్ తో ముచ్చటించారు. పదవుల పంపిణీ గురించి మాట్లాడారట. కష్టపడిన ప్రతి క్యారకర్తకు గుర్తింపు ఇస్తానన్నారట. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారట. అదే సమయంలో కూటమి 15 సంవత్సరాలు పాటు అధికారంలో ఉండేలా క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలని అటు జనసైనికులతో పాటు కూటమి క్యాడర్ కు పవన్ పిలుపునిచ్చారు.

పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలో కమిటీలు

Advertisement

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, కమిటీల గురించి మొదటి సారిగా చిత్తూరు పర్యటనలో క్యాడర్ తో పవన్ కల్యాణ్ మాట్లాడరట. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖ తాను తీసుకోవడానికి కూడా కారణమే అదే అన్నట్లు క్యాడర్ తో చెప్పినట్లు సమాచారం. చాలామంది గ్రామస్థాయిలో సర్పంచ్ లు ,స్థానిక సంస్థల ప్రతినిధులు గత ప్రభుత్వంలో ఎకగ్రీవంగా ఎంపికైనా వారు అధికారాన్ని అనుభవించింది శూన్యం..ఇలాంటి వారంతా గేటు దాటడానికి సిద్దంగా ఉన్నారట. అయితే టీడీపీ ఎలా రానివ్వదు..ఇలాంటి సమయంలో బీజేపీలోకి వెళ్లినా లాభం లేదు. అందుకే జనసేన అయితే కొంత ఉనికి ఉంటుందని అనుకుంటున్నారట. ఇలాంటి వారికి కూడా ప్రస్తుతం గేట్లు తీసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా వివాదాలు లేని వారిని ముందుగా తీసుకుంటారంట. వీరిని అయితే అటు మిత్ర పక్షం అభ్యంతరం చెప్పదని అంటున్నారు..మొత్తం మీదా స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమ నాయకుడి తీరు మారిందని తెగ హ్యాపీగా పీలవుతున్నారంట జనసైనికులు.

Story by Venkatesh, Big Tv 

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×