Global Summit 2025: సిటి శివార్లకు దూరంగా ఉన్న ఓ ప్రాంతం.. హైదరాబాద్‌తో సంబంధం లేదన్నట్లుగా కనిపించే ప్రదేశం.. కానీ.. ఇప్పుడు ఆ ప్రాంతం ఒక్కసారిగా గ్లోబల్ మ్యాప్‌లో సెంటర్ పాయింట్‌గా మారింది. అందరి అటెన్షన్.. ఆ ఏరియా మీదే. అదే.. భారత్ ఫ్యూచర్ సిటీ. వచ్చే వారం ఇక్కడ జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌తో.. తెలంగాణ దశ మారనుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. హైదరాబాద్ ఫ్యూచర్ మొత్తం.. మీర్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలోనే కనిపిస్తోంది.
భారత్ ఫ్యూచర్ సిటీ.. రాబోయే టెక్నాలజీకి, ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ సహకారాన్ని సూచించే ఓ మహానగరానికి ఇప్పుడిదో ఆనవాలు. ఇక్కడ జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల.. హైదరాబాద్ భవిష్యత్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం దశ కూడా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పుడు.. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్.. ఇండియాలో రీసౌండ్‌లో వినిపిస్తోంది. దేశ, విదేశాల ఫోకస్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలు తప్ప ఏమీలేని ప్రాంతం.. ఇప్పుడు ఈ ప్రపంచం నలుమూలల్లోని..ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులను పట్టుకొచ్చే కోటగా మారింది. అదే ప్రాంతం.. భవిష్యత్ తరాలకు భరోసాగా నిలవబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కారణంగా.. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారాయ్. ఈ సదస్సు జరిగిన తర్వాత.. తెలంగాణ కథే మారబోతోంది. ఎందుకంటే.. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ దశని మార్చే ఓ గ్లోబల్ రెవల్యూషన్‌గా కనిపిస్తోందిప్పుడు! అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రాబోయే అత్యాధునిక టెక్నాలజీ హబ్‌లతో.. ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ.. ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి కేంద్రం కాబోతోంది. ఇక్కడ రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ దిగ్గజాలు.. ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌తో.. తెలంగాణ ఊహించని స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందుకోబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ ఆర్థిక సదస్సులో పాల్గొనే మల్టీ నేషనల్ కంపెనీలు.. తమ కార్యకలాపాలు విస్తరించడానికి, కొత్తగా స్థాపించడానికి వేల కోట్ల రూపాయలు.. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్లే.. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి వెన్నుగా నిలుస్తాయ్. భారీ పెట్టుబడులతో.. రాబోయే కొన్నేళ్లలో.. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు.. ప్యూచర్ సిటీలో గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఈ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత.. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఇక్కడ ఏర్పాటైతే.. ఐటీ, స్టార్టప్ రంగాల్లో.. భారత్‌లోని ఇతర మెట్రో నగరాలకు.. హైదరాబాద్ గట్టి పోటీనిస్తుంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో.. 5జీ, 6జీ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లాంటి సౌకర్యాలు రాబోతున్నాయ్. ఇక.. పూర్తిగా సోలార్ ఎనర్జీ సప్లై, వ్యర్థాల నిర్వహణకు అధునాతన పద్ధతులు, జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ లాంటివి.. హైలైట్‌గా నిలుస్తున్నాయ్. కొత్త స్టార్టప్‌లని ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫీసులు కూడా వస్తాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో.. గ్లోబల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది.
భారత్ ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్.. కేవలం ఐటీ సెక్టార్‌కే పరిమితం కాదు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీర్‌పేట, ముచ్చర్ల, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో.. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టే విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయ్. విదేశీ ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో.. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు.. ఈ రంగంలో కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయ్. ఈ ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా.. యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కూడా వస్తాయ్. ఇప్పటికే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణని 2047 నాటికి.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో.. ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌కు తుదిమెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల లిస్ట్ కూడా రెడీ అయింది. తెలంగాణ సర్కార్ కమిట్‌మెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు, పటిష్టమైన ప్రణాళికతో.. భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు ఓ గేమ్ ఛేంజర్ కాబోతోంది. మీర్‌పేటలోని ఈ మారుమూల ప్రాంతం… ఇప్పుడు యావత్ భారతదేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి తెలంగాణ శక్తిని చాటిచెప్పే వేదికగా మారనుంది.
హైదరాబాద్ ఫ్యూచర్ అంతా.. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలోనే బిల్డ్ అవుతోంది. ఒకప్పుడు చరిత్ర, సంస్కృతికి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు టెక్నాలజీ, అభివృద్ధికి మారుపేరుగా మారుతోంది. ఈ మార్పుకు కేంద్ర బిందువుగా.. భారత్ ఫ్యూచర్ సిటీ నిలబడనుంది. కేవలం.. భౌగోళిక ప్రాంతంగా కాకుండా.. సరికొత్త పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి వాటితో.. ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. నిజంగా తెలంగాణ కథ మారబోతోంది.
వన్ అండ్ ఓన్లీ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఈ ఒక్క సదస్సుతో తెలంగాణ కథ మారబోతోందా? భారీ పెట్టుబడులతో గ్లోబల్ సిటీ రేంజ్ ఖాయమా? ఇప్పుడిదే చర్చ స్టేట్ మొత్తం వినిపిస్తోంది. ఈ సదస్సుకు.. దేశ, విదేశాల నుంచి 1686 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. యూఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ లాంటి దేశాల నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి. ఈ నెల 8న గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో.. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో పాటు బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ ముజుందార్ షా, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచత, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్ గెస్టులుగా పాల్గొననున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బగ్గా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈవో వర్చువల్‌గా.. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల్లో దాదాపు 200 మంది ఐటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన వారే. ప్రతినిధుల్లో ప్రభుత్వాధికారులు, ఎంబసీల ప్రతినిధులు, హెల్త్, ఫార్మా రంగాలకు చెందిన వారు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, వ్యవసాయం, ఆహార భద్రతా రంగాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. గుగూల్, అమెజాన్ సహా అనేక జీసీసీల ప్రతినిధులు ఇందులో ఉన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఆర్థిక వృద్ధి సహా వివిధ అంశాలపై.. 26 మీటింగ్స్ ఉండనున్నాయి. పొల్యూషన్ ఫ్రీ ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, టెక్ తెలంగాణ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టాలెంట్ మొబిలిటీ, గిగ్ ఎకానమీ, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటకం, మూసీ పునరుద్ధరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, వ్యవసాయం లాంటి అంశాలపై.. గ్లోబల్ నిపుణులతో ఇంటరాక్టివ్ చర్చలుంటాయ్. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడాతో వ్యూహాత్మక సంబంధాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సెమీకండక్టర్ల రంగంలో భాగస్వామ్యాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల విస్తరణ, ఇండో–పసిఫిక్ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్–జీరో లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ప్రాజెక్టుల వేగవంతం లాంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడుల ఒప్పందాలు.. గ్లోబల్ సమ్మిట్ వేదికగా జరగనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా.. ఈ సమ్మిట్‌లో ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగుతాయి. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చర్చావేదికలు నిర్వహిస్తారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తును రూపొందించే ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అంటే.. భారీ బిల్డింగులు, కంపెనీలతో నిర్మించబోయే ఓ భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర విధానాల సమాహారం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. కార్పొరేట్ పాలన, Ease of Doing Business), అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో.. సరికొత్త పాలసీలు, సులభతర అనుమతులు, ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలతో.. ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, మల్టీ నేషనల్ కంపెనీలకు.. బెస్ట్ ఛాయిస్‌గా మారబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , బ్లాక్‌చెయిన్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలు.. ఇందులో భాగం కానున్నాయ్. స్మార్ట్ మొబిలిటీ, ఆటోమేటెడ్ గవర్నెన్స్ లాంటి అంశాలు.. పౌరులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించనున్నాయి. ఇంతటి అద్భుతమైన ప్రణాళికలకు ఊతమివ్వడానికి.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇది కేవలం.. ఓ సదస్సు మాత్రమే కాదు. ప్రపంచ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు.. తెలంగాణ కెపాసిటీ ఏమిటో చూపే ఓ వేదిక. తెలంగాణలో ఉన్న రాజకీయ స్థిరత్వం, మానవ వనరుల లభ్యత, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే.. గ్లోబల్ సమ్మిట్ మేజర్ టార్గెట్. ఈ సమ్మిట్ ద్వారా ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో.. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఈ పెట్టుబడులు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి, తెలంగాణ అభివృద్ధికి సాయపడతాయ్.
Also Read: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు
ఇప్పటికే.. సైబరాబాద్ తో హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ లాంటి వాటికి.. రెండో అతిపెద్ద స్థావరంగా ఉన్న హైదరాబాద్.. భారత్ ఫ్యూచర్ సిటీతో తన ఖ్యాతిని మరింత పెంచుకోనుంది. దీనివల్ల.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయ్. ఈ ఫ్యూచర్ సిటీనే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలంగా మారుతుంది. ఈ మార్పు.. కేవలం హైదరాబాద్‌కు మాత్రమే కాదు.. తెలంగాణ నలుమూలలా విస్తరించి సమగ్ర అభివృద్ధికి దారితీస్తుంది.
తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడానికి.. గ్లోబల్ సమ్మిట్ బలమైన అడుగు. చారిత్రక నగరంగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తుని రూపొందించే నగరంగా మారుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ఈ గ్లోబల్ సమ్మిట్.. హైదరాబాద్ భవిష్యత్తును మాత్రమే కాదు దేశంలోనే తెలంగాణని డెవలప్‌మెంట్ మోడల్‌గా నిలబెట్టనుంది.
Story By Anup, Bigtv