
Aurangzeb : మనం చిన్నప్పటి నుంచి వినే ఔరంగజేబు అనేది… మొఘల్ చక్రవర్తి అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు ముజఫర్ మొహియొద్దీన్ అలంఘీర్! మరి ఆయన అసలు పేరేంటి? అసలు పేరుండగా.. మరి ఈ ఔరంగజేబు అనే పేరు ఎలా వచ్చింది? అనేది తెలుసుకోవాలంటే.. మనం చరిత్రలోకి వెళ్లాలి.
దక్కన్ దండయాత్రకు తరలి వచ్చిన మొఘలు చక్రవర్తి.. అప్పట్లో నేటి ఔరంగాబాద్‌లో ఉండేవాడు. చక్రవర్తి నివసించే మహల్.. అక్కడి షాహీ మసీదు పక్కనే ఉండేది. రోజూ భవనం మీద కాసేపు చల్లగాలికి తిరిగే చక్రవర్తికి.. కొంత దూరంలో పొగలు పైకి లేస్తూ కనబడేవి. అదేమిటని వాకబు చేయగా.. కొందరు అక్కడ వంట చేసుకుంటున్నారని భటులు తెలిపారు. అయితే.. ఆ వరుసలోనే కొన్ని ఇళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి పొగరాదేంటి? వాళ్లు వంట చేసుకోరా? అని విచారించాడు.
‘ఆ పొగరాని చోట.. ఓ చిన్న గుడి ఉంది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు నివసిస్తుంటారు. వారు రోజూ పట్టణంలో భిక్షాటన చేసి జీవిస్తుంటారు. కనుక వారు వంట చేసుకోరు’ అని భటులు వివరం చెప్పారు. ఈ సంగతి తెలిసి చక్రవర్తి మనసు చివుక్కుమంది. నాకు కూతవేటు దూరంలోనే ఇంత దారిద్ర్యం ఉందా? అనుకుని వారందరికీ ఓ భోజనశాల ఏర్పాటు చేయించి.. వారే ఆహారం తయారు చేసుకునే ఏర్పాటు చేయించాడు.
దీంతో అక్కడి బ్రాహ్మణ వర్గమంతా సంతోషించింది. పొగ రాకపోవటాన్ని బట్టి తమ బాధను కనుక్కున్న చక్రవర్తి ఔదార్యానికి వారికి ఆయన పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. భిక్షాటన, పౌరోహిత్యంతో తాము ఆర్జించే సంపదనంతా పోగుచేసి ఆయనకో బహుమతిని ఇవ్వాలని నిర్ణయించారు.
ఆయన కూర్చునేందుకు చక్రవర్తి హోదాకు తగిన ఓ సింహాసనాన్ని చేయించాలని నిర్ణయించారు. చివరకు ఒక గద్దె (సింహాసనం) తయారు చేయించారు. దాని నిండా రంగు రంగుల మెరిసే రాళ్ళు పొదిగారు. తిరంగ్ అంటే 3, నవ్‌రంగ్ అంటే 9.. ఇలా.. లెక్కుకు మించిన రాళ్లు పొదిగితే దానిని ‘ఔరంగ్’ అంటారు. జేబ్ అంటే.. పొందినవాడు అని అర్థం. దీంతో ఆయన పేరు ‘ఔరంగజేబ్’ అయింది.
తన తర్వాత ఈ గద్దె మీద కూర్చుని ఎవరు రాజ్యమేలినా వారు ఔరంగజేబ్ అని పిలవబడతారని చక్రవర్తి (అలంఘీర్) ప్రకటించాడు. ఇక్కడ ఓ సారూప్యత కూడా ఉంది. ఏ ప్రాంతపు బ్రాహ్మణులు ఆ బహుమతిని అందించారో ఆ ప్రాంతం పేరు ఔరంగపూర్. అందువల్ల ఆ బహుమతికి ఆ బహుమతి స్వీకరించిన చక్రవర్తికీ ఆ పేరు మరింతగా సరిపోయింది.
Telangana : టార్గెట్ రేవంత్.. ఈటల, బండి మళ్లీ విమర్శలు.. బీజేపీ వ్యూహం ఇదేనా..?