
YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఈ గొడవలలో వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇన్నోవా కారుని సొంత పార్టీ నేతలే తగలబెట్టారు. దాంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ దాడిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వాహనాలు ధ్వంసమైనా ఇసుక రీచ్ వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇరు వర్గాలు వైసీపీకి చెందిన వారే కావడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక అగ్రనేత ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎటువంటి ఫిర్యాదులు, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు ఆ అగ్రనేత అల్టిమేటం ఇచ్చారని తెలుస్తోంది.
Rahul Gandhi : దేశానికి ఎక్స్ రే అవసరం.. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అదే చేస్తాం..