BigTV English
Advertisement

Pawan Kalyan : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ

Pawan Kalyan : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ


Pawan Kalyan : కాలి చెప్పు తీసి చూపించారు.. వైసీపీ నా కొడుకులను చెప్పు తీసుకొని కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో దవడ పళ్లు రాలగొడతానంటూ జనసైనికుల సమక్షంలో వైసీపీ నేతలకు దిమ్మతిరిగే హెచ్చరిక చేశారు. పవన్ నుంచి ఆ తరహా మాటలు అనూహ్యమే. అందుకే, పీకే డైలాగ్స్ ఇప్పుడు ఏపీలో కాక రేపుతున్నాయి. స్వయంగా సీఎం జగనే ఆయనకు రివర్స్ కౌంటర్ ఇచ్చారంటే.. పవన్ వార్నింగ్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో తెలుస్తోంది.


అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్. పవన్ మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో.. ఆయన చెప్పులపై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ వేసుకున్న చెప్పులు ఏ బ్రాండ్ అంటూ నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ చెప్పులపై పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ ధరించే చెప్పుల ఖరీదు ఎంత ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపించారు. ఆ చెప్పు ఫోటోను గూగుల్ లెన్స్ వేసి మరీ వెతికి పట్టుకుంటున్నారు. ఇంతకీ, పవన్ చెప్పులు ఏ బ్రాండో తెలుసా?

                                   ఫిట్ఫ్లాప్. పేరు కొత్తగా ఉంది కదూ. అవును, ఇండియన్ కంపెనీ కాదు. యూకే బ్రాండ్. సెలబ్రెటీస్, రిచ్ పీపుల్ వాడుతుంటారు. పవన్.. చాలా ఏళ్లుగా ఫిట్ఫ్లాప్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారని తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలోనూ పవన్ వేసుకునే చెప్పులు ఇవేనట. లేటెస్ట్ గా వైసీపీ నేతలను హెచ్చరిస్తూ.. పీకే చూపించిన చెప్పు సైతం ఫిట్ఫ్లాప్ కంపెనీదేనని తేల్చేశారు నెటిజన్స్. ఇంకేం, ఆయన అభిమానులు పోలోమంటూ అలాంటి చెప్పులే కొనేందుకు ఆన్ లైన్లో తెగ ఆర్డర్లు పెడుతున్నారట. దీంతో ఫిట్ఫ్లాప్ చెప్పులకు ఒక్కసారిగా భారీ డిమాండ్.

         ఫిట్ఫ్లాప్ చెప్పుల ధర ఎంతంటే.. మోడల్ ని బట్టి వేరు వేరు ధరలు ఉన్నాయి. పవన్ వేసుకున్న మోడల్ చెప్పులు.. 63 డాలర్లు అని తెలుస్తోంది. అంటే.. సుమారు రూ.5వేలు. అయితే, అదేమంత ఖరీదు కాదంటున్నారు ఆయన ఫ్యాన్స్. సినిమా వాళ్లు ఇంతకంటే కాస్ట్లీ చెప్పులే వాడుతుంటారని.. పవన్ మాత్రం సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారని చెబుతున్నారు. ఆ చెప్పులు యూకే బ్రాండే అయినా.. అందులో తక్కువ ధర ఉన్న చెప్పులే వేసుకున్నారని అంటున్నారు. ఇలా.. పీకే చెప్పల్స్ పై సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున చర్చ..రచ్చ నడుస్తోంది. పవనా.. మజాకా!

Tags

Related News

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Big Stories

×