BigTV English

Tirupati Assembly Seat : తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేనాని ట్విస్ట్.. ఆయన నాన్ లోకల్ అంటున్న నేతలు

Tirupati Assembly Seat : తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేనాని ట్విస్ట్.. ఆయన నాన్ లోకల్ అంటున్న నేతలు


Janasena Tirupati Assembly Candidate(AP election news today telugu): తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును బరిలో దింపడాన్ని తిరుపతి టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేయాలి. లేకపోతే స్థానిక నేతకు అవకాశమివ్వాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆరణి గో బ్యాక్ అంటూ సిటీలో ప్లేక్సీలు వెలుస్తున్నాయి. మరోవైపు డీకే ఆదికేశవుల నాయుడు సన్నిహిత బంధువు అయిన గంటా నరహరి సైతం జనసేన కండువా కప్పుకుని టికెట్ తనదేనంటూ ప్రచారం షురూ చేస్తుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

తిరుపతి అసెంబ్లీ సీటును పోత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనసేనకు కేటాయించారు … మదనపల్లి, చిత్తూరు స్థానాలను జనసేన కోరినప్పటికీ కీలకమైన తిరుపతి స్థానాన్ని టీడీపీ త్యాగం చేసింది .. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని గెలిపించిన స్థానం కావడంతో పవన్‌కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే అయన ఈ సారి గోదావరి జిల్లా నుంచి పోటీకి ఫిక్స్ అయ్యారు. దాంతో తిరుపతి జనసేన టికెట్ కోసం పోటీ మొదలైంది.. స్థానిక నేతలు డాక్టర్ హారిప్రసాద్ , కిరణ్‌రాయల్‌లు జనసేనానిని ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నించారు.. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌ లెక్కలతో పాటు సర్వే ఫలితాలు వారికి నెగిటివ్‌గా రావడంతో టికెట్ దక్కలేదంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి ఉకా విజయ్ కూమార్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు సైతం జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే జనసేనాని ఎవరూ ఉహించని ట్విస్ట్ ఇచ్చారు.


Also Read : నేడే వైసీపీ తుది జాబితా.. నెట్టింట చక్కర్లు కొడుతున్న లిస్ట్ ఇదే..

రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఒక్కరే బలిజ సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. అయితే క్యాస్ట్ ఈక్వేషన్లు పట్టించుకోకుండా ఆయన్ని పక్కన పెట్టిన వైసీపీ విజయానందరెడ్డికి చిత్తూరు టికెట్ కేటాయించింది. ఆరణిని రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదు. దాంతో ఆరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పంచకు చేరారు. అరణీ శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో చిత్తూరు అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు.. అప్పట్లో చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నాలున్నర సంవత్సరాలు పనిచేసారు. అయితే 2014లో ఆయనకు చిత్తూరు టీడీపీ టికెట్ దక్కలేదు. డీకే సత్యప్రభ టీడీపీ టికెట్ దక్కించుకోవడంతో .. వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్‌తో పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. తర్వాత 2019 లో వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్చేగా విజయం సాధించారు.

అరణీ శ్రీనివాసులకు తిరుపతి టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రస్తుతం జనసేనలో ఉన్న ప్రజారాజ్యం నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో పెద్దగా ఇబ్బంది ఉండదని భావించిన జనసేన అధ్యక్షుడు పవన్ ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారంటున్నారు. అయితే ఇదే సమయంలో రాజంపేట పార్లమెంటు సెంగ్మెంట్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా చేసిన గంటా నరహారి జనసేనలో చేరారు. ఆయన వెనుక తానా మాజీచైర్మన్ వేమన సతీష్ ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ఆరణికి తిరుపతి జనసేన టికెట్ కన్‌ఫర్మ్ అయినా గంటా ఇంకా ఆశతోనే కనిపిస్తున్నారు.

Also Read : పిఠాపురం సెంటిమెంట్.. పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనా..!

ఇదే సమయంలో టీడీపీ, జనసేన లోకల్ లీడర్లు తాము నాన్ లోకల్ కు సహాకరించబోమని సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు. దీంతో పాటు అరణీ గోబ్యాక్ అనే ప్లేక్సీలు తిరుపతి నగరంలో వెలిసాయి. జనసేన, టిడిపి ఉమ్మడి సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ హరి ప్రసాద్, కిరణ్ రాయల్ టీడీపీ నుంచి ఉకా విజయ్ కూమార్, జెబి శ్రీనివాసులు, మబ్బురామిరెడ్డిలతో పాటు స్థానిక నాయకులు వందమంది వరకు పాల్గొన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వాలని తీర్మానం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కుటుంబం అన్నాక అభిప్రాయభేదాలు ఉంటాయని.. అందర్నీ కలుపుకుని పోవడానికి త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నారు ఆరణి శ్రీనివాసులు.

ఇదే సమయంలో టీడీపీ బాస్ అసంతృప్తి నేతలకు చెక్ పెట్టడానికి .. ద్వీతీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో డివిజన్ల వారీగా యాక్టివ్‌గా ఉన్న ద్వీతియ శ్రేణి నాయకుల సమాచారం ఇప్పటికే సేకరించినట్లు చెప్తున్నారు. సీనియర్లు పనిచేయక పోతే జూనియర్లకు అవకాశం కల్పించి వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారంట. అన్ని సామాజిక వర్గాలలోని యువనేతలతో ముందుకు పోవాలని.. సీనియర్లు పనిచేస్తే ఓకే లేక పోతే వారిని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారంట. మరి చూడాలి తిరుపతిలో పొత్తు ధర్మం ఎంతవరకు పనిచేస్తుందో.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×