Moringa Powder: మునగాకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో బోలెడు పోషక పదార్థాలు ఉంటాయి. విటమిన్లు ఎ, బి, సి, ఐరన్, అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉండే మునగాకు, జుట్టు మూలాలను బలపరుస్తుంది. దీని పొడి తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా దీనిని తినడం వల్ల జుట్టు మందంగా ఉండటమే కాకుండా సిల్కీగా, మెరిసేలా తయారవుతుంది. మునగాకు వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు ప్రయోజనాలు, ఉపయోగాలు:
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: మునగ పొడిలో ఉండే జింక్, ఐరన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది క్రమంగా జుట్టు రాలడాన్ని తొలగిస్తుంది. ఒక టీస్పూన్ మునగ పొడిని కొబ్బరి నూనెతో కలిపి వారానికి రెండుసార్లు రాయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
తలకు పోషణనిస్తుంది: మునగ పొడిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు తలలోని మృతకణాలను తొలగించి కొత్త కణాలను ఉత్తేజ పరుస్తాయి. ఇది తలలోని చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మునగ పొడి, కలబంద జెల్ ప్యాక్ తలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది తేమను అందిస్తుంది.
మీ జుట్టుకు సహజమైన మెరుపును తెస్తుంది: మునగ పొడి మీ జుట్టులోని సహజ నూనెలను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు పొడి బారకుండా నిరోధించి అందమైన మెరుపును ఇస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మునగ పొడిని పెరుగు, తేనెతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. మీ జుట్టును మృదువుగా, సిల్కీగా ఉంచడానికి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.
Also Read: పండగ సమయంలో కాలిన గాయాలా ? ఇలా చిట్కాలు పాటించండి
కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: మునగలో లభించే అమైనో ఆమ్లాలు, విటమిన్ E కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ మునగ పొడిని కలిపి తాగడం వల్ల జుట్టు లోపలి నుంచి పోషణ లభిస్తుంది.
తెల్ల జుట్టును నివారిస్తుంది: మునగ పొడిలోని ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు సహజ రంగును కాపాడుకోవడానికి సహాయ పడతాయి. ఇది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడాన్ని నివారిస్తుంది. వారానికి ఒకసారి మునగ పొడి, ఉసిరి పొడితో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌ను అప్లై చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.