Telangana Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న ఫైట్ ఒక రణరంగాన్నే తలపిస్తుంది..హుందాగా ఉండాల్సిన నేతలు కాస్తా రోజురోజుకి దిగజారి ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ దిగజారుడు రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రచ్చ రేపుతున్న కవ్యంపల్లి, రసమయి మాటల యుద్దం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల మాటలు యుద్దం సోషల్ మీడియాలో రచ్చరచ్చ రేపుతుంది. ఎంతలా అంటే అమ్మ. అబ్బ, అంటూ దిగజారి పోయి ఒకరిపై ఒకరూ బూతుపురాణం అందుకుంటున్నారు. వారిద్దరి ఆధిపత్యపోరు ఏమో కాని.. ఇవేం బూతులురా అంటూ మానకొండూర్ నియోజకవర్గం ప్రజలు అసహ్యించుకునేలా అ బూతుపురాణం కొనసాగుతోంది.
ఒకరు స్వహాగా డాక్టర్.. ఇంకొకరు పీహెచ్‌డీ డాక్టర్
మానకొండూర్ నియోజకవర్గం లో ప్రతి మండలం , గ్రామాల్లోని వాట్సప్ గ్రూపుల్లో చూసినా రసమయు, కవ్వంపల్లి ల ఆడియోలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ డాక్టర్ల కి ఇదేం బుద్దిరా అని జనం తలలు పట్టుకోవాల్సి వస్తోందంట. ఒక డాక్టరేమో స్వతహాగా స్టెతస్కోప్ పట్టే డాక్టర్. మరోకయనేమో పిహెచ్డీ చేసిన డాక్టర్. అలాంటి నేతలు బజారు మనుషుల్లో తిట్టు కుంటుండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని హెచ్చరించి ఆడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేయగా ఇప్పుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడిన ఆడియో రాజకీయాలలో సంచలనంగా మారి చర్చలకి దారితీస్తోంది.
మీడియా ప్రతినిధులకు క్లాస్ పీకుతున్న కవ్యంపల్లి
ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా ప్రతినిధులను వదిలిపెట్టడం లేదు. మీడియా ప్రతినిధులు అంటే అంటే గౌరవంగా వ్యవహరించాలని.. మీరు వాడు ఏది చెబితే అది రాస్తారా.. మీరేమైనా పొస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నారా.. అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి మానకొండూర్ రిపోర్టర్ లని ఘాటు వ్యాఖ్యలతో ప్రశ్నించారు..
Also Read: చెల్లెళ్ల వారసత్వ రాజకీయం.. కుటుంబ సభ్యుల మధ్య పోటీ..
పోస్టింగుల కోసం రసమయి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ
ఖబడ్దార్ రసమయి పొలీసుల పోస్టింగుల కోసం డబ్బులు తీసుకున్న చరిత్ర నీది, నాకు నచ్చిన సిఐకి పొస్టింగ్ ఇవ్వలేదని అప్పటి సిపినే బదిలిచేయించా.. మేము డబ్బులు తీసుకుంటే మా వాయిస్ ఉండదు.. మేము పారదర్శక పాలన చేస్తున్నాం.. నువ్వు కమిషన్ల కొసం కక్కుర్తి పడ్డావు.. అంటూ కవ్వంపల్లి తీవ్రస్థాయిలో రసమయి బాలకిషన్‌పై విరుచుకుపడుతున్నారు. దానికిరసమయి బాలకిషన్ తాను చదువుకునే రోజులలోనే లగ్జరీ లైఫ్ అనుభవించానని.. టీచర్ ఉద్యోగం చేస్తూ ఉద్యమం లో తన పాటతో ఉర్రూతలూగించానని, అప్పుడు నువ్వు ఎక్జడున్నావని బూతు పూరణం ఎత్తుకున్న ఆఢియో ఇప్పుడు వైరల్ అవుతోంది..
Story By Apparao, Bigtv