BigTV English

Pakistan: పాక్ మారణహోమం.. ముగ్గురు క్రికెటర్ల మృతి.. తాలిబాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?

Pakistan: పాక్ మారణహోమం.. ముగ్గురు  క్రికెటర్ల మృతి.. తాలిబాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
Advertisement

Pakistan: పాక్-అఫ్గాన్ మధ్య వార్ ముదురుతోంది. ఘర్షణలు పెరుగుతున్నాయి. ఉద్రిక్తతలు చల్లార్చుకునేందుకు కాల్పుల విరమణ పాటిద్దామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పాకిస్తాన్ గీత దాటింది. అప్ఘాన్ ను వెన్నుపోటు పొడిచింది. ఎయిర్ స్ట్రైక్స్ చేసి పదుల సంఖ్యలో జనాన్ని బలి తీసుకుంది. ఇందులో ముగ్గురు వర్ధమాన అఫ్ఘాన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అసలు ఏంటి పాకిస్తాన్ దుర్బుద్ధి? తాలిబాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?


పాక్-ఆఫ్ఘాన్ మధ్య తీవ్రమవుతున్న ఘర్షణలు
అఫ్ఘానిస్తాన్ – పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాల దాడుల్లో రెండు వైపులా మరణాలు జరుగుతున్నాయి. ఇవి రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. అయితే ఈ రెండు దేశాల ఘర్షణ మంచిది కాదంటూ కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు ఇద్దరినీ కూల్ చేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే 48 గంటల కాల్పుల విరమణ కుదిరింది. దాడులు చేసుకోవద్దని డిసైడ్ అయ్యారు. అయితే ఇంతలోనే పాకిస్తాన్ తన దొంగ బుద్ధి చాటుకుంది. అఫ్ఘాన్ రిలాక్స్ గా ఉన్నప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో అఫ్ఘాన్ పౌరులు చనిపోయారు. ఆసిమ్ మునీర్ ఈ గేమ్ ప్లానర్.

చనిపోయిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా హరూన్
పాక్-అఫ్ఘాన్ సరిహద్దుల్లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. పాక్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ సైన్యం జ‌రిపిన బాంబు దాడిలో ముగ్గురు అఫ్గాన్‌ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది. ప్లేయర్స్ తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. చనిపోయిన క్రికెటర్లను కబీర్‌, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైనం దారుణానికి బలైపోయారు. ఇదే ఎటాక్ లో క్రికెటర్లతో మరో ఐదుగురు అఫ్గాన్‌ పౌరులు కూడా చనిపోయారు. ఈ ఎటాక్ కు నిరసనగా నవంబర్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌తో జరిగాల్సిన ట్రై సిరీస్‌ నుంచి అఫ్గానిస్తాన్‌ తప్పుకొంది.


అక్టోబర్ 11 నుంచి ఉద్రిక్త పరిస్థితులు
నిజానికి అక్టోబర్ 15న 48 గంటల సీజ్‌ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. దోహాలో చర్చల కోసం ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కానీ అక్టోబర్ 17 రాత్రి దాడి చేసింది పాకిస్తాన్. పాక్ కు ఇలా వయొలేషన్ చేయడం కామనే. మన సరిహద్దుల్లోనూ పాక్ ఆర్మీ ఇలాగే కవ్వింపులకు దిగుతుంటుంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్ అని పాక్ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా చూస్తే.. క్రికెట్ రిలేషన్స్ ను బ్యాడ్ చేసేందుకే పాక్ ఇలా కావాలనే చేస్తుందన్న డౌట్లు పెరుగుతున్నాయి. అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా.. ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో ఎటాక్ చేశారు. ఇరువైపులా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఇంతలోనే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది.

నిజానికి ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు దిగింది. డ్యూరాండ్‌ లైన్‌ వెంట ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ కు తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ అంటే నచ్చదు. ఈ గ్రూప్ ను టార్గెట్ చేసుకోవాలి. కానీ పాక్ ఎయిర్ ఫోర్స్ కు అంత సీన్ లేదు. బాంబులు పడెయ్.. ఎవరు పోతే మనకేంటి అనుకున్నారు. సాధారణ పౌరులను బలి తీసుకున్నారు. పాక్‌ సైన్యం ఆప్ఘనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. పాక్‌ సైన్యం ఓవరాక్షన్‌కు ఇది పరాకాష్ట. పాక్‌ చర్యలపై తాలిబాన్ సీరియస్ గా రియాక్ట్ అయింది. మూడు జిల్లాలపై పాక్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని, ఈ చర్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు ఖతార్ లో మీటింగ్ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ పాక్ ఇలా చేయడంతో ఈ చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలపై నమ్మకాలు ఉంటాయా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది.

అఫ్గాన్‌ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ – టీటీపీ ఉగ్రవాదులు.. పాక్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని ఓరక్‌జాయ్‌ జిల్లాలో ఇటీవల దాడులు చేయగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో పేలుళ్లు జరిగాయి. ఈ బ్లాస్టులకు పాకిస్థాన్‌ కారణమని తాలిబన్‌ ప్రభుత్వం ఆరోపించింది. అప్పుడు అఫ్గాన్ విదేశాంగమంత్రి భారత్‌ పర్యటనలో ఉన్నారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేసిన పాకిస్తాన్ పై అఫ్గాన్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ దాడుల్లో 58 మంది పాక్‌ సైనికులు మరణించారు. రెండు దేశాలూ ఎక్కడా తగ్గట్లేదు. భారత్ ఆదేశాలతోనే తమపై దాడులు జరుగుతున్నాయని పాక్‌ ఆరోపిస్తోంది. తప్పులు జరుగుతాయ్.. కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి కదా.. అఫ్ఘాన్ పాక్ మధ్య ఇదే జరగట్లేదు. పరస్పర నమ్మకం లేదు. మొన్నటిదాకా తాలిబాన్లకు మద్దతు ఇచ్చిన పాకిస్తానే ఇప్పుడు వారిపైనే గురి పెడుతోంది. దొంగ దెబ్బ తీస్తోంది. మరి అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? భవిష్యత్ లో జరగబోయేదేంటి?

టీటీపీ వ్యతిరేక కార్యకలాపాల ముసుగులో అమాయక అఫ్ఘాన్ పౌరులను పాకిస్తాన్ చంపుతోంది. పైగా వీటికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో గేమ్ నడుపుతోంది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్న పాక్.. ఒక్క టీటీపీ సంస్థ సభ్యుడి పేరు ఎందుకు చూపట్లేదు.. చివరికి ఆఫ్ఘన్ శిశువులను కూడా దారుణంగా చంపేస్తున్నారంటున్నారు అఫ్ఘాన్ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు ఫలిస్తాయా.. ఒకవేళ శాంతికి అడుగులు పడ్డా.. అందులో అనుమానపు మేఘాలు ఎన్నో ఉంటాయి. అటు అఫ్ఘాన్ పాక్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణలకు అంగీకరించినప్పటికీ వెనక్కు తగ్గుతామని ఒప్పుకునేందుకు ఈ రెండు దేశాలకు మనసు ఒప్పడం లేదు. అదే సమయంలో వెనక్కు తగ్గితే అవతలి దేశం ముందు బలహీనం అవుతామనుకుంటున్నాయి. అందుకే మధ్యవర్తి దేశం చెప్పిన మాటలకు ఓకే చెబుతూనే.. పాక్ దొంగ దెబ్బ తీసే ప్రణాళికలు ఇంకా చాలా రచించి పెట్టుకుందన్న అనుమానాలు వస్తున్నాయి.

తాలిబన్లు TTPకి వ్యతిరేకంగా చర్య తీసుకోకపోతే ఆఫ్ఘన్ భూభాగాల్లో దాడులు కొనసాగుతాయని పాక్ వార్నింగ్ లు ఇస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే, పాకిస్తాన్ వద్ద శక్తివంతమైన సైనిక, సాంకేతికంగా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు దేశాల్లో రాజకీయ పరపతి కూడా ఉంది. అంతే కాదు 1980ల నుంచి పాక్ లక్షలాది మంది ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. వీరిలో ఒకతరం విద్యావంతులు పాకిస్తాన్ సిటీల్లో జీవనోపాధి చూసుకున్నారు. పాకిస్తాన్ నాయకులు కొందరు ప్రజాభిప్రాయం ప్రకారం, ఆఫ్ఘన్లు పాకిస్తాన్ పట్ల సద్భావనతో ఉండాలంటున్నారు. ఆఫ్ఘన్ శరణార్థులను బలవంతంగా బయటకు పంపితే మీ పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు.

పాకిస్తాన్ నాయకులు తమ దేశాన్ని బలమైన దేశం అనుకుంటారు. అటు అమెరికా, ఇటు చైనా తమకే సపోర్ట్ ఇస్తాయని, ఇలాంటి పొత్తులతో తామే పవర్ ఫుల్ అన్న భ్రమల్లో ఉంటారు. అందుకే అఫ్ఘానిస్తాన్ తాము చెప్పినట్లు వినాలనుకుంటున్నారు. ఇటు చూస్తే తాలిబాన్లు ఏమీ తక్కువ తినలేదు. తమను తాము ప్రపంచ అగ్రరాజ్యం ఆక్రమణకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం చేసిన యోధులుగా అనుకుంటారు. అందుకే పాకిస్తాన్ కవ్వింపులు, హెచ్చరికలను లైట్ తీసుకుంటుంటారు. అందుకే బండి ముందుకు కదలడం లేదు.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండూ సరిహద్దు దేశాలు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కీలక వాణిజ్య మార్గాలూ ఉన్నాయి. అయితే ఆ రూట్లు ఇప్పుడు ఉద్రిక్తతల కారణంగా మూసివేశారు. దీంతో రెండు వైపులా వ్యాపారులకు పెద్ద నష్టాలు వస్తున్నాయి. పాకిస్తాన్ డ్రోన్లు జెట్‌ల చొరబాట్లను ఎదుర్కోవడానికి తాలిబాన్ ప్రభుత్వానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, ఆధునిక ఆయుధాలు లేవు. ఓవైపు పాకిస్తాన్ సైన్యం TTPపై తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆ సాయుధ సంస్థకు ఢిల్లీ మద్దతు ఉందని ఆధారాలు లేకుండానే పాక్ ఆరోపించింది. తాలిబన్లు TTP నుంచి దూరం జరిగి, ఇస్లామాబాద్‌తో పొత్తు పెట్టుకోవాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. అయితే తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ కు తాలిబన్లకు దీర్ఘకాలిక స్నేహం ఉంది. ఐడియాలజీ ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ సైనికపరంగా బలంగా ఉన్నప్పటికీ, తాలిబన్ల వద్ద ఇస్లామాబాద్‌కు హాని కలిగించే సొంత సోర్సులు చాలా ఉన్నాయ్. అందుకే ఇది తీవ్రంగా మారకముందే ఆగిపోవాలని మిడిల్ ఈస్ట్ దేశాలు అనుకుంటున్నాయి.

పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ రాజకీయ గ్రూపులు కూడా తాలిబాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి సపోర్ట్ ఇవ్వవు. ఆఫ్ఘనిస్తాన్‌పై నిరంతరంగా పాక్ దాడులు చేస్తే… ప్రస్తుత తాలిబాన్ పాలనకు దేశీయంగా సపోర్ట్ మరింత పెరుగుతుంది. అఫ్ఘాన్ లో తాలిబాన్లపై ఆగ్రహం ఉన్నప్పటికీ పాక్ చర్యలతో వారిపై సానుకూలత పెరుగుతుంది. సో సమస్యల పరిష్కారం జరగాలంటే శాంతి కుదరాలి. ఆ పని చేయాలంటే ఈ రెండు దేశాలకూ నమ్మకమైన దేశాలు మధ్యవర్తిత్వం వహించి చర్చలు జరిపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన పాక్, అఫ్ఘాన్ రెండింటికీ ఫ్రెండ్లీ కంట్రీస్ ఖతార్, సౌదీ అరేబియా ఉన్నాయి. నిజానికి గత వారం ఖతార్, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత తాలిబన్లు పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులను నిలిపివేసినట్లు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీ పర్యటనలోనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ గీత దాటడంతో కథ మారింది. మరోసారి అనుమానాల మధ్యే శాంతి చర్చలు జరపాల్సి వస్తోంది.

ఈ చర్చలు ఫలించాలంటే ముందుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నాయకులకు శాంతి కోసం నిజమైన కోరిక ఉండాలి. కానీ అదే జరగడం లేదు. అందుకే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం తమకు భారీగా నష్టం కలిగిస్తుందని రెండు దేశాలకు స్పష్టంగా తెలుసు. భౌగోళికపరంగా చూసినా, చారిత్రకంగా చూసినా అఫ్ఘానీలు, పాకిస్థానీలు పరస్పరం ఆధారపడి ఉన్నారు. ఇలాంటి ఘర్షణలు పెరిగితే రెండువైపులా నష్టం. ప్రపంచానికి ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ రూపంలో మరో యుద్ధం అవసరం లేదు. శాంతి కంటే పెద్ద ముందడుగు ఏదీ లేదు. తాజాగా జరిగే చర్చలు వారి విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంటాయి. అఫ్ఘాన్ కు చెందిన ముగ్గురు క్రికెటర్లను పాక్ చంపడంపై రషీద్ ఖాన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఈదాడి దారుణం, అనైతికం అన్నాడు.

Also Read: షాకైన కస్టమర్.. మైసూర్ బోండాలో పురుగులు.

ఓవైపు పాకిస్తాన్ కాల్పుల విరమణ మాటున అఫ్ఘాన్ పై చెలరేగిపోతోంది. మరి అమెరికా ట్రంప్ ఇప్పుడు ఏం చేయాలి. పాకిస్తాన్ ను నిలువరించారు. అది తప్పు అని చెప్పాలి. కానీ అలా జరగడం లేదు. పాకిస్తాన్ దూకుడును తమాషా చూసినట్లు చూస్తోంది అమెరికా. పైగా ట్రంప్ కు ఇటీవలి కాలంలో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైంది. అఫ్గాన్‌పై పాక్‌ దాడి చేసిందనే విషయం తనకు అర్థమైందంటూనే.. ఈ సంఘర్షణను పరిష్కరించాల్సి వస్తే.. అది తనకు చాలా ఈజీ అంటున్నారు. అదే సమయంలో తాను యూఎస్‌ను పాలించాల్సి ఉందని, అయినప్పటికీ.. యుద్ధాలను ఆపడం అంటే తనకు చాలా ఇష్టం అంటూ సెల్ఫ్ ప్రొజెక్షన్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఆపడం తనకు నచ్చుతుందంటున్నారు. తాను 8 యుద్ధాలు కొనసాగకుండా ముగించానన్నారు. భారత్‌- పాక్‌ ఘర్షణలను కూడా తానే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. ఎన్ని ఆపినా తనకు నోబెల్‌ పురస్కారం రావడం లేదంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే సొంత డబ్బా కొట్టుకునేందుకే ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు తప్ప మరొకటి కనిపించడం లేదు.

Story By Vidya Sagar, Bigtv

Related News

Telangana Politics: కవ్వంపల్లి VS రసమయి.. రచ్చ రేపుతున్న మానకొండూరు రాజకీయం

Sisters Politics: చెల్లెళ్ల వారసత్వ రాజకీయం.. కుటుంబ సభ్యుల మధ్య పోటీ..

Jubilee Hills By Poll: 40 మంది ప్రచార రథ సారథులు.. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా..!

AP Politics: సీనియర్లకు వారసుల బెంగ.. ఆ నాయకులు ఎవరంటే..!

Jubilee Bypoll: జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరుపై ఉత్కంఠ..! గెలిచేదెవరు..?

Bihar Elections: వ్యూహకర్త వ్యూహం వర్కవుట్ అవుతుందా?

Nellore Janasena: నెల్లూరులో గ్లాసు పగులుతుందా? అజయ్ కుమార్ తీరుపై జన సైనికుల మండిపాటు

Big Stories

×