Nokia Launching Lumia Smartphone Series Soon: ప్రముఖ టెక్ కంపెనీ నోకియా తన బ్రాండ్ ఫోన్లను హెచ్‌ఎమ్‌డీ నుండి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక వేరియంట్లను హెచ్ఎమ్‌డీ నుండి విడుదల చేసింది. ఈ క్రమంలోనే నోకియా లూమియా సిరీస్‌ని విస్తరింపజేయాలని భావిస్తోంది. త్వరలో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఈ ఫోన్ గురించి ఒక పోస్ట్‌ను విడుదల చేశారు. రాబోయే ఫోన్ సాధ్యమయ్యే ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన సమాచారం పోస్ట్‌లో వివరిచారు. దాని ప్రకారం నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD గ్లోబల్ ఈ రోజుల్లో నోకియా లూమియా సిరీస్ ఫోన్‌లపై పని చేస్తోంది. రాబోయే ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: వివో నుంచి రెండు స్టన్నింగ్ ఫోన్లు లాంచ్.. కేక పుట్టిస్తున్న ఫీచర్లు!
టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఫోన్ స్పెసిఫికేషన్‌లతో పాటు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం ఫోన్ క్లాసిక్ Lumia “Fabula” డిజైన్‌తో ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో రావచ్చు. ఫోన్ FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం టిప్‌స్టర్ ఫోన్ RAM, స్టోరేజ్ గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.
నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 108MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. 2MP సెకండరీ కెమెరా సెన్సార్ కూడా పొందవచ్చు. సెల్ఫీల కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ఫోన్ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వస్తుంది. ఫోన్‌లో ఆడియో అనుభవం కోసం కంపెనీ డ్యూయల్ స్పీకర్ల సెటప్‌ను కూడా అందించబోతోంది. దీనిలో PureView, OZO ఆడియోకు సపోర్ట్ ఉంటుంది.
Also Read: బ్యాంక్ ఆఫర్.. నెలకి రూ. 679లు చెల్లిస్తే చాలు.. OPPO A59 5G 5G స్మార్ట్‌ఫోన్ మీ సొంతం అవుతుంది!
Nokia Lumia సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టవిటీ కోసం బ్లూటూత్ 5.2, NFC ఫీచర్ ఉండవచ్చు. ఫోన్‌లో పవర్ కోసం శక్తివంతమైన 4900mAh బ్యాటరీని ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక అధునాతన ఫీచర్లను తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బెస్ట్ కాంపిటీటర్‌గా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. త్వరలోనే ఫోన్ భారతీయ మార్కెట్‌లో లాంచ్ అయే అవకాశం ఉంది.