BigTV English

Actor Srikanth @ Rave Party: రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్.. క్లారిటీ వచ్చేసింది..!

Actor Srikanth @ Rave Party: రేవ్ పార్టీలో హీరో  శ్రీకాంత్..  క్లారిటీ వచ్చేసింది..!

Clarity on Srikanth is in Rave Party or Not: బెంగుళూరు రేవ్ పార్టీ రచ్చ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. తెలుగు నటులు అందులో దొరికారుఅంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో నటి హేమ ఉందని కన్ఫర్మ్ అయ్యింది. ఆమెతో పాటు హీరో శ్రీకాంత్, కొరియాగ్రాఫర్ జానీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే జానీ మాస్టర్.. ట్విట్టర్ ద్వారా తానూ ఈ రేవ్ పార్టీలో లేను అని.. ఆ చేతుల మధ్యలో ముఖం దాచుకొని వస్తున్న మనిషిని తాను కాదని చెప్పుకొచ్చాడు.


“నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది” అని జానీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.

నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.ఈ వివరణ కూడా వాళ్ళకోసం కాదు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళకోసం అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఇంకోపక్క శ్రీకాంత్ సైతం ఆ మనిషిని నేను కూడా కాదు అంటూ వీడియో ద్వారా తెలిపాడు.


Also Read: Karate Kalyani: నన్నుపేకాట ఆడానని చెప్పింది.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి

“ఇది మా ఇల్లునే కదా.. నేను మా ఇంట్లోనే ఉన్నాను. నిన్నటి నుంచి నాకు కూడా కాల్స్ వస్తున్నాయి. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి.. అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు. అంతకుముందు నా భార్యకు విడాకులు ఇచ్చాను అని రాశారు.. ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికెను అంటున్నారు. దయచేసి నిజాలు తెలుసుకొని రాయండి.. తప్పుడు కథనాలను నమ్మకండి” అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీకాంత్ అంటే మేము కూడా నమ్మం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×