E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి

Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి

Hyderabad: హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్‌ లోని 5వ అంతస్తులో నివసిస్తున్న నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (5) మధురానగర్‌లోని శ్రీనిధి స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్‌లో 5వ అంతస్తుకు వచ్చాడు. అనంతరం లిఫ్ట్ లో కిందకు దిగుతున్న క్రమంలో 4, 5 అంతస్తుల మధ్య లిఫ్ట్‌లో బాలుడు ఇరుక్కుపోయాడు. బాలుడిని బయటకు తీయగా, అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడిని వెంటనే బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. అపార్ట్మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సీసీ కెమెరాల పరిశీలన

ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అపార్ట్మెంట్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు ఐశ్వర్య, నరుసు నాయుడు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. సంఘటనా స్థలిని మధురానగర్ సీఐ ప్రభాకర్ పరిశీలించారు. పంచనామా నిర్వహించారు.

ఈ ఏడాది మార్చిలో ఇలాంటి ఘటనే

హైదరాబాద్ లో ఈ ఏడాది మార్చిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆడుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ అందులో చిక్కుకున్నాడు. ఎవరూ గమనించకపోవడంతో చిన్నారి లిఫ్ట్ లో నరకయాతన అనుభవించాడు. తీవ్రగాయాలతో బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు. మార్చి నెలలో ఆసిఫ్ నగర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ఈ ఘోరం జరిగింది. సంతోష్‌నగర్‌ కాలనీలోని ముజ్తాబా అపార్ట్మెంట్‌ లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. నేపాల్ కు చెందిన శామ్ బహదూర్ అపార్ట్మెంట్ కు వాచ్ మన్ గా పనిచేస్తున్నారు. అతడు భార్యాబిడ్డలతో అపార్ట్మెంట్ లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో నివసిస్తున్నాడు.

శామ్ బహదూర్ కొడుకు సురేందర్ (4) ఆడుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్లి ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుకున్నాడు. కాసేపటికి కొడుకు కనిపించడం లేదని బయటకు వచ్చిన తల్లిదండ్రులకు లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడు కనిపించాడు. హాస్టల్ లో ఉన్న వారు పోలీసులకు ఫోన్ చేయడంతో…అక్కడికి చేరుకుని బాలుడిని బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు స్పృహ కోల్పోయాడు. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. చిన్న పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×