BigTV English

Operation Asmita: కులాన్ని బట్టి రేటు! మత మార్పిడి సిండికేట్ ఎలా పనిచేస్తుందంటే! ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు

Operation Asmita: కులాన్ని బట్టి రేటు! మత మార్పిడి సిండికేట్ ఎలా పనిచేస్తుందంటే! ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు

ఇక్కడ కనిపిస్తున్న ఈ పది మంది గ్యాంగ్ చాలా డేంజరస్.
యుక్త వయసులో ఉన్న హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మతం మార్చడంలో వీళ్లు దిట్ట..
వీళ్లంతా ఒక సిండికేట్ లా పని చేస్తున్నారు..
మతం మార్చినందుకు వాళ్లకు డబ్బులు..
మతం మార్చుకున్నోళ్లకు ఫైనల్ గా తిప్పలు..
ఇదే కథ యూపీలో చాలా మంది యువతుల జీవితాలను నాశనం చేస్తోంది.

కదులుతున్న మతమార్పిడుల డొంక


చంగూర్ బాబా అరెస్ట్ అయ్యాక యూపీలో ఇలాంటి ముఠాల డొంక కదులుతోంది. ఈ మోడస్ ఆపరాండీ చాలా పకడ్బందీగా జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. చాలా చిన్న వయసు, లేదంటే యుక్తవయసులో ఉన్న హిందూ అమ్మాయిలను సెలక్ట్ చేసుకుంటారు. కొందరు ఫ్రెండ్షిప్ ముసుగులో వస్తారు. ఇంకొందరు దుబాయ్ లో మంచి జాబ్ ఇప్పిస్తామంటారు.. మరికొందరు స్కాలర్ షిప్స్ వస్తాయని నమ్మిస్తారు. ఇంకొదరు బెదిరిస్తారు.. దబాయిస్తారు.. బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు, వీడియోలతో భయపెడుతారు. అత్యాచారాలు చేస్తారు. బానిసలుగా మార్చుకుంటారు. ఉచ్చులోకి లాగుతారు. మన చుట్టూనే ఉంటారు. చిన్న చిన్న షాపుల్లో పని చేస్తారు.. ఒక్కసారి నమ్మితే నట్టేట ముంచేస్తారు. యూపీలో ఇదో భారీ రాకెట్ నడుస్తోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే యువతులు అదృశ్యమైన కేసులను పరిశీలిస్తే అసలు దందా మొత్తం బయటికొచ్చింది.

ఆగ్రా అక్కచెల్లెళ్ల మిస్సింగ్ కేసు కీలకం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మిషన్ అస్మితకు ఆర్డర్ వేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ ఆపరేషన్ అస్మిత కొనసాగుతోంది. ఆగ్రాకు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లు మిస్ అవడంతో ఈ ఆపరేషన్ షురువైంది. కాంటాక్ట్ ట్రేస్ చేస్తూ వెళ్లే కొద్దీ పోలీసులే షాక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. అసలు మిస్ అయిన వారిని దొరకబట్టడమే కష్టం. ఎందుకంటే వారిని మొత్తం మార్చేస్తారు. పేరు ఊరు అంతా ఫేక్. మార్ఫింగ్ ఐడీలతో సిమ్ కార్డులిప్పిస్తారు. వాళ్ల ఐడెంటిటీ ఎక్కడా రివీల్ కాకుండా రాష్ట్రాలన్నీ తిప్పుతారు. వారితో ఇంకింతమందిని లాగుతారు. ఒక్కసారి ఉచ్చులో చిక్కితే బయటపడడం కష్టం అన్నట్లుగా చేసేస్తారు.

ఆగ్రాలో జులై 19న 10 మంది ముఠా అరెస్ట్

యూపీలో అసలేం జరుగుతుందో మొన్నటికి మొన్న ఓ రాకెట్ బయటపడడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జులై 19న ఆగ్రాలో మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 రాష్ట్రాల నుంచి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలో ఇద్దరు అక్కా చెళ్లెళ్లు కనిపించకుండా పోయిన కేసులో దర్యాప్తు చేస్తే ఈ ముఠా బయటపడింది. ఆ ఇద్దర్ని జులై 18న కోల్ కత్తాలో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ ముఠాలో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. అంతా సిస్టమాటిక్ గా సాగుతుంటుంది. చిన్న వయస్సున్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. ఈ ముఠా కెనడా ఇతర దేశాల నుంచి నిధులు తీసుకుని తమ కార్యకలాపాలను నడుపుతోందని పోలీసులు గుర్తించారు.

గోవాలో అయేశా అలియాస్ SB కృష్ణ అరెస్ట్

అరెస్ట్ అయిన వారు కూడా రెండు మూడు మారు పేర్లతో తిరుగుతూ మత మార్పిడి, లవ్ జిహాద్ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. గోవాలో అయేశా అలియాస్ SB కృష్ణను అరెస్ట్ చేశారు. కోల్ కత్తాలో అలీ హసన్ అలియాస్ శేఖర్ రాయ్, రిత్వానిక్, ఒసామాను పట్టుకున్నారు. ఆగ్రాలో రెహ్మాన్ ఖురేషీ, ముజఫర్ నగర్ లో అబు తాలిబ్, డెహ్రాడూన్ లో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ రూపేంద్ర సింగ్ ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లో మహమ్మద్ అలీ, జునైద్ ఖురేషీని అలాగే ఢిల్లీలో ముస్తఫా అలియాస్ మనోజ్ ను పట్టుకుని ఈ మత మార్పిడి రాకెట్ ను బయటపెట్టారు. పట్టుబడ్డవాళ్లంతా… 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే ఉన్నారు. వీరు ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో, అలాగే వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. 11 టీములను బెంగాల్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్ పంపడంతో ఈ అరెస్టులు జరిగాయి.

లీగల్ హెల్ప్ అందించడం, కొత్త SIM కార్డ్‌లు ఇవ్వడం

వీరి పని నిధులు సేకరించడం, సీక్రెట్ ప్రాంతాల్లో ఉంచడం, మత మారేందుకు లీగల్ హెల్ప్ అందించడం, కొత్త ఫోన్‌లు SIM కార్డ్‌లను అందించడం, మతమార్పిడి కోసం పత్రాలు సిద్ధం చేయడం వంటి బాధ్యతలు చూసుకున్నారని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ మిషన్ అస్మితలో భాగంగా గతంలో మహమ్మద్ ఉమర్ గౌతం, జహంగీర్ అలం వంటి వారిని అరెస్ట్ చేశారు. వీళ్లందరికంటే డేంజర్ పర్సన్ జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా. ఇతడు ఇతడి అనుచరులను యూపీ బలరాంపూర్ లో ఇటీవలే అరెస్ట్ చేశారు. అతడైతే వేల మందిని ముస్లిం మతంలోకి మార్చినట్లు గుర్తించారు. తవ్వే కొద్దీ ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతుండడంతో పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్, యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ ను దర్యాప్తులో భాగంగా చేర్చారు.

ఇంతకీ మత మార్పిడి సిండికేట్ ముఠాల ఆస్తులెంతో తెలుసా?

ఉంగరాలు అమ్ముకునే వ్యక్తి రింగ్ మాస్టర్ గా మారి వందల కోట్ల ఆస్తులకు అధిపతి అవడం అంటే మాటలు కాదు. ఇదంతా తావీద్ మహిమ కాదు. మతం మార్చి డబ్బులు దండుకునే స్కెచ్. యూపీలో చంగూర్ బాబా అరెస్ట్ తర్వాత చాలా కథలు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడం.. అక్కడికి యుక్తవయసు పిల్లల్ని మతం మార్చి ఎగుమతి చేయడం ఇదే జరుగుతోంది. ఐసిస్ తరహాలో ఆపరేషన్ ఎలా నడిపిస్తున్నారు? ఇంతకీ మత మార్పిడి సిండికేట్ ముఠాల ఆస్తులెంతో తెలుసా?

జీరో టాలరెన్స్ తో ఆపరేషన్ అస్మిత

ఆపరేషన్ అస్మితను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలు పెట్టారు. మత మార్పిడులు, లవ్ జిహాద్ ను ఉపేక్షించొద్దన్న కారణంతో ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం బలవంతపు మతమార్పిడి, రాడికలైజేషన్, లవ్ జిహాద్ వంటి కార్యకలాపాలను అడ్డుకోవడం, జాతీయ భద్రతను కాపాడటం. 2021 నుంచి యూపీలో మౌలానా ఉమర్ గౌతం, మౌలానా కలీమ్ సిద్దిఖీ వంటి వ్యక్తుల సిండికేట్ ర్యాకెట్‌లు బయటపడడంతో ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లినట్లు తేలింది. అందుకే ఈ ఆపరేషన్ అస్మితను సీఎం యోగి చాలా సీరియస్ గా తీసుకున్నారు.

జులై 5న చంగూర్ బాబా అరెస్ట్

ఈ మత మార్పిడి ఆపరేషన్ లో లష్కరేతొయిబా, ISIS మాదిరి రాడికలైజేషన్ పద్ధతులను ఫాలో అయ్యారు. ఈ ముఠాలు యుఎస్, కెనడా, యూఏఈ, లండన్ నుంచి నిధులు తీసుకుని పనిచేస్తోందని దర్యాప్తులో తేలింది. యూపీలో హిందూ బాలికలు, యువతులను ప్రలోభ పెట్టి ఇస్లాంలోకి మార్చే కేటుగాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జులై 5న చంగూర్ బాబాను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేయడంతో అసలు తెరవెనుక ఎంత పెద్ద తతంగం నడుస్తోందో తేలింది. చంగూర్ తో పాటే అతడి ఫాలోవర్ నీతు అలియాస్ నస్రీన్ ను కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్ లో విదేశీ నిధులు, ఆస్తుల గురించి ప్రశ్నించారు.

జులై 17న చంగూర్ ఆస్తులపై ఈడీ దాడులు

చంగూర్ బాబా మొదట చేసిన పని గల్లీల్లో తిరుగుతూ ఉంగరాలు అమ్ముకోవడం. ఈ రింగులు అమ్ముకుంటే ఏమీ లాభం లేదనుకున్నాడో ఏమోగానీ రింగ్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఖతర్నాక్ స్కెచ్ ఫాలో అయ్యాడు. యువతుల్ని ఆకర్షించి వారికి డబ్బులు ఇతరత్రా ఆశలు చూపి నయానో భయానో ట్రాప్ చేసి మతం మార్చేశాడంటారు. ఈ పని చేసినందుకు చంగూర్ రింగ్ మాస్టర్ కు చాలానే గిట్టుబాటు అయింది. జులై 17న ఈడీ ఇతడి ఆస్తులపై ఎంక్వైరీ చేసింది. బలరాంపూర్ లో 12 చోట్ల, ముంబైలో రెండు చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో 100 కోట్లకు పైగా విదేశీ నిధులను గుర్తించింది. బలరాంపూర్ లో హై ఎండ్ కార్లు సీజ్ చేశారు. అంతే కాదు చంగూర్ పై మనీ లాండరింగ్, బలవంతపు మతమార్పిడి, జాతీయ భద్రతకు ముప్పు కేసులు నమోదు చేశారు.

చంగూర్ బాబాకు 40 బ్యాంకు ఖాతాలు

డబ్బు సహాయం చేస్తానని, బాధల నుంచి విముక్తి కల్పిస్తానని, హామీలు ఇవ్వడం ద్వారా అతను పేద, వెనుకబడిన ప్రాంతాల జనాన్ని ఆకర్షించేవాడు. హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశాడని అలాగే ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా నేపాల్ సరిహద్దు దుబాయ్ లోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. చంగూర్ బాబాకు 40 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తేలింది. మతం మార్చగా వచ్చిన డబ్బును లగ్జరీ ఇండ్లు, బంగ్లాలు, లగ్జరీ కార్లను కొనేందుకు వాడాడు. పేదరికంలో ఉన్న వారికి అరచేతిలో వైకుంఠం చూపించాడు. మెరుగైన జీవితం ఉంటుందని నమ్మించాడు. బ్రాహ్మణ, సిక్కు, క్షత్రియ యువతుల్ని మతమార్పిడి చేస్తే 15-16 లక్షలు, ఓబీసీలకు 10-12 లక్షలు, ఇతర కులాలకు 8-10 లక్షలుగా డిసైడ్ చేసి వ్యవహారం నడిపాడన్న ఆరోపణలున్నాయి. మతమార్పిడి, మోసాలే కాదు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ చంగూర్ బాబా పోటీ చేశాడు. తవ్వితే ఇతడి లీలలు ఇంకిన్ని బయటపడడం ఖాయం.

సైకాలజికల్ గ్రూమింగ్ ఎఫెక్ట్

చంగూర్ బాబా మాదిరి ఇతరులు కూడా ఈ మతమార్పిడి రాకెట్‌లలో గతంలో పని చేశారు. 2021లో అరెస్ట్‌ అయిన మౌలానా ఉమర్ గౌతం 100కు పైగా మందిని మతమార్పిడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. విదేశీ నిధులు రాబట్టడం, రాడికలైజేషన్ పద్ధతులను వాడినట్లు గుర్తించారు. అసలు హిందూ యువతులను రకరకాలుగా ట్రాప్ చేస్తున్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. ఫస్ట్ వన్… లవ్ జిహాద్. ఫేక్ హిందూ పేర్లు, ఐడీలతో ముస్లిం యువకులు అమ్మాయిలను ప్రేమలో పడేటట్లు చేసి, వివాహం కోసం ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం అలాగే సైకాలజికల్ గ్రూమింగ్ అంటే యూట్యూబ్ ఛానెళ్లు, సీక్రెట్ ఆన్‌లైన్ సెషన్‌ల ద్వారా మతపరమైన ప్రచారం చేసి, వారి మైండ్ ను ఏమార్చారు. ఆర్థిక ప్రలోభాల్లో భాగంగా స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు, విదేశాల్లో అవకాశాలు అని నమ్మబలకడం, ఉచ్చులోకి దింపడం. ఇక డిజిటల్ ఐసోలేషన్ అంటే తప్పుడు ఐడీ కార్డులు, మారు పేర్లు, కొత్త ఫోన్‌లు, కొత్త SIM కార్డ్‌లతో వారిని కుటుంబం నుంచి దూరం చేసి రాడికల్ చేయడం మరో టార్గెట్. చంగూర్ బాబా కేసులో బాధితులు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే.. కొంతమంది మహిళలపై గ్యాంగ్‌రేప్ లు చేసి బలవంతమైన పద్ధతుల్లో మత మార్పిడులు జరిగినట్లు తేలింది.

మిడిల్ ఈస్ట్ నుంచి రాకెట్ ఆపరేట్ చేస్తున్నదెవరు?

ఈ బలవంతపు మత మార్పిడుల కేసులో ఈ రాకెట్ ను మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరో ఒక కీ రోల్ క్యాండిడేట్ ఆపరేట్ చేస్తున్నాడన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అక్కడ కూర్చుకుని ఇక్కడ చక్రం తిప్పుతున్నారా అన్నది దర్యాప్తులో క్రమంగా బయటికొస్తోంది. ఎందుకంటే ఈ కేసుల్లో అంతర్జాతీయ లింకులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు అసలు సవాల్ ఏంటంటే.. ఈ నిధులు ఎలా వచ్చాయి.. ఎవరి ద్వారా వచ్చాయి.. ఎంతెంత వచ్చాయన్నది తెలుసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాస్టర్ మైండ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఒక్కడే చేశాడా.. మరింత మంది పెద్ద తలకాయలు ఉన్నాయా అన్నది తేల్చాలి. ఈ నెట్‌వర్క్ డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో నడిపిస్తున్నట్లు తేలింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×