BigTV English

HHVM Bookings : అసలు మైత్రీ సమస్య ఏంటి ? అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు వీరమల్లు

HHVM Bookings : అసలు మైత్రీ సమస్య ఏంటి ? అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు వీరమల్లు


Hari Hara Veera Mallu Bookings: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటి. రవి శంకర్, నవీన్ యర్నేనీలు ఈ బ్యానర్ అధినేతలు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పాన్ చిత్రాలు మాత్రమే చేస్తోంది. పుష్ప నుంచి ఈ బ్యానర్ లో అని భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలో రూపొందుతున్నాయి. తెలుగులోనే కాదు ఇతర భాష చిత్రాలను సైతం మైత్రీ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ చక్రం తిప్పుతున్న సంస్థ ఇది. ఇటీవల మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ అంటూ ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. దీంతో సినిమాలు నిర్మించడమే కాదు.. డిస్ట్రిబ్యూటట్ కూడా చేస్తోంది.

వీరమల్లుకే ఏంటీ ఈ సమస్యలు..


ఇప్పుడ హరి హర వీరమల్లును నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్సే. మొన్నటి వరకు సినిమాను కొనేందుకు ముందుకు రానీ ఈ సంస్థ పవన్ ఎంట్రీతో వెనక్కి తగ్గింది. నైజాం రైట్స్ ని రూ. 40 కోట్లకు దక్కించుకుంది. అది కూడా వాయిదాల పద్దతిలో. అడ్వాన్డ్స్ గా కొంత డబ్బు ఇచ్చి ఆ తర్వాత కొంత పే చేసేల ఒప్పందం చేసుకుంది. దీంతో హరి హర వీరమల్లు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మేకర్స్ రంగంలోకి దిగారు. ఇక సినిమా రిలీజ్ కు ఒక్క రోజు ఉందనగా.. ఈ సంస్థ థియేటర్లతో డీల్ కు దిగినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ముందున్న కంటే ఎక్కువ పర్సంటైజ్ కి అయితేనే అమ్ముతామంటూ ఏషియన్ సినిమాస్ తో చర్చలు జరుపుతున్నారట.

ఏషియాన్ సినిమాస్ తో మైత్రీ బేరాలు

కానీ, ఏషియన్ సినిమాస్ మాత్రం ముందున్న పర్సంటైజ్ ప్రకారమే చెల్లిస్తామని అంటున్నారు. కానీ, మైత్రీ మూవీ మేకర్స్ కుదరదని నిక్కచ్చిగా చెబుతున్నారట. దీంతో ఇప్పుడు వీరమల్లు రిలీజ్ కు అన్ని అడ్డుంకులు తొలిగిన.. ఇప్పుడ థియేటర్ల సమస్య తలెత్తేలా ఉంది. దీంతో కొత్త రిలీజ్ ప్రతిసారి ఈ మైత్రీ తీరు థియేటర్లకు తలనొప్పిగా మారుతోంది. కాగా పుష్ప 2 రిలీజ్ విషయంలోనూ వీరు అచ్చం అలాగే చేశారు. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు థియేటర్ల పర్సంటైజ్ విషయంలో మొండిగా వైఖరి చూపించింది. ప్రసాద్స్ ఐమ్యాక్స్ పర్సంటైజ్ డీల్ కు దిగింది. తాము అడిగినంత ఇస్తేనే మూవీని అమ్ముతామంటూ కండిషన్ పెట్టింది. 

అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు వీరమల్లు..

కానీ, ప్రసాద్స్ వాళ్లు తాము తగ్గదేలే అని కూర్చున్నారు. పుష్ప 2 చిత్రాన్ని తమ థియేటర్లలో విడుదల చేయడం లేదని ప్రకటన కూడా ఇచ్చారు. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా వెనక్కి ఇస్తామని ప్రకటించింది. దీంతో మైత్రీ మేకర్స్ దిగొచ్చి ముందున్న పర్సంటైజ్ ప్రకారమే మూవీని అమ్మారు. దీంతో ప్రసాద్ ఐమ్యాక్స్ లో యదావిధిగా పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఐమ్యాక్స్ లో బెనిఫిట్ షోస్, ఫస్ట్ షోస్ పడలేదనే విషయం తెలిసిందే. ఇప్పుడు హరి హర వీరమల్లు విషయంలో మైత్రీ మేకర్స్ అదే తీరు చూపిస్తోంది. ఏషియన్ సినిమాస్ తో పర్సంటైజ్ చర్చలకు దిగింది. దీంతో హరి హర వీరమల్లుకు కూడా పుష్ప 2 పరిస్థితే వచ్చేలా ఉందని ఇండస్ట్రీలో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈసారి మైత్రీ మేకర్స్ తగ్గుతారా? ఏషియన్ సినిమాస్ తగ్గుతుందా? చూడాలి అంటున్నారు. లేకపోతే పనవ్ ఈ విషయంలో కలగజేసుకుని సమస్య పరిష్కరిస్తారా? చూడాలి.

Related News

Allu Arjun : బాలీవుడ్ బడా హీరోతో బన్నీ మూవీ..బాక్సాఫీస్ పరిస్థితి ఏంటబ్బా..?

PVNS Rohit: మొన్న నేషనల్ అవార్డు.. నేడు నిశ్చితార్థం.. జోరు పెంచిన బేబీ సింగర్!

Rajinikanth : రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..

Actor Shot dead:కాల్పుల్లో హీరో మృతి… సాయం చేయడానికి వెళ్లి పరలోకానికి

Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. అసలేమైందంటే?

Pushpa 2 Stampede: పుష్ప 2 ఘటన పై NHRC సీరియస్‌.. పరిహారం చెల్లించాల్సిందే..!

Big Stories

×