BigTV English

Drones: శభాష్.. ఇది కదా డ్రోన్లను వాడే పద్ధతి..

Drones: శభాష్.. ఇది కదా డ్రోన్లను వాడే పద్ధతి..

Drones in Floods: డ్రోన్స్.. ఇప్పుడు పెళ్లి వీడియోల నుంచి యుద్ధాల వరకు అన్నింటిలో వాడుతున్నారు. ఇప్పుడు మనం ప్రిడేటర్.. అటాక్ డ్రోన్ల గురించి కాదు కానీ.. అత్యవసర సమయంలో చిక్కుల్లో ఉన్నవారిని చింత తీర్చేందుకు కూడా ఈ డ్రోన్లు చాలా ఉపయోగడపడుతున్నాయి. ఈ విజయం ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయ్యింది.


ఇప్పటి వరకు ప్రమాదాన్ని అంచనా వేయడానికి.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ డ్రోన్స్‌ను వాడేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించేందుకు కూడా ఉపయోగడపతున్నాయి డ్రోన్స్. ఖమ్మంలోని మున్నేరు వాగుపై చిక్కుకుపోయిన వారికి ఆహారం డ్రోన్ సాయంతో అందించారు అధికారులు.

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. చాలా ప్రాంతాల్లో ఇలానే డ్రోన్‌తో సేవలు అందిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డ్రోన్‌తో వరద బాధితులకు సాయం అందించడం చాలా ఏళ్లుగా సాగుతుంది. కానీ గతంలో అక్కడక్కడ మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉండేవి. కానీ.. ఇప్పుడు డ్రోన్లను వినియోగించడం చాలానే పెరిగిందని చెప్పాలి. రెస్క్యూ టీమ్స్‌ చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్స్‌ ఈజీగా వెళ్లిపోతున్నాయి. ఫుడ్‌ ప్యాకెట్స్, లైఫ్ జాకెట్స్, అవసరమైన తాళ్లు, మందులు, మంచినీరు.. ఇలా పని ఏదైనా క్షణాల్లో చేసేస్తున్నాయి డ్రోన్స్.


నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. అందుకే ఇలాంటి సమయంలో వీటిని ఉపయోగించడం చాలా ఈజీగా మారుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడీ ట్రైనింగ్ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

Also Read: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం.. ఇంతటి ఉపద్రవానికి కారణమేంటి ?

రెస్క్యూ ఆపరేషన్స్‌లో మాత్రమే కాదు.. పరిస్థితిని అంచనా వేయడానికి కూడా డ్రోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. వరదలు రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వచ్చాక పరిస్థితి ఎలా ఉంది? ఇలా క్రూషియల్ డేటాను కలెక్ట్‌ చేసేందుకు డ్రోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీడియోగ్రఫీ కంటే డ్రోన్ సర్వేనే బెస్ట్ అంటున్నారు. అంతేకాదు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గోనడమే కాదు.. రెస్క్యూ ఆపరేషన్స్‌ పర్యవేక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి డ్రోన్స్. పరిస్థితిని అంచనా వేయడానికి.. అబ్జర్వేషన్ డ్రోన్స్, సహాయం అందించడానికి.. రెస్క్యూ డ్రోన్స్, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కోసం గాలింపులో పాల్గొనడానికి.. రాడార్ డ్రోన్స్. ఇలా పేరు ఏదైనా అవి చేసే పని ఒకటే.. మనుషులకు సహాయపడటం.

మనుషులు చేయలేని డర్టీ, డేంజరెస్ వర్క్స్ ఈ డ్రోన్స్‌ చేసేస్తున్నాయి. దట్టమైన అడవిలో ఉన్నా.. శిథిలాల కింద ఉన్నా.. మంచుకోండల్లో ఉన్నా.. వరదల్లో ఉన్నా.. ఇలా టెరైన్ ఏదైనా.. డ్రోన్స్ అక్కడ వాలిపోతున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం యూపీలో ఆపరేషన్‌ బేడియా కోసం థర్మల్‌ ఇమేజ్‌ టెక్నాలజీ ఉన్న డ్రోన్స్‌ వాడుతున్నారు. వయనాడ్‌లో శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించడానికి రాడార్ డ్రోన్స్‌ను వాడారు.

విజయవాడలో వాన విలయం చూపించింది ఈ డ్రోన్సే. ఖమ్మం ఎలా జలదిగ్బంధంలో చిక్కుకుందో తెలిపింది ఈ డ్రోన్సే. ప్రస్తుతం మనుషులు ఏ చోటుకైనా వెళ్తుంది.. ఈ డ్రోన్సే. ప్రస్తుతం వరదల్లో శక్తి వంచన లేకుండా పని చేస్తున్న వారిలో ఈ డ్రోన్స్‌ కూడా వచ్చి చేరాయి. కానీ.. ఇది మాత్రమే సరిపోతుందా? అంటే దానికి సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ డ్రోన్స్‌ను మరింత డెవలప్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవన్ని చాలా చిన్న డ్రోన్స్. కొన్ని కంట్రీస్‌లో డ్రోన్స్‌తో ఏకంగా మనుషులను ఎయిర్‌ లిఫ్ట్ చేస్తున్నారు. మనం ఈ విషయంలో కాస్త వెనకపడే ఉన్నాం. ఈ మాత్రం అవగాహన మన అధికారుల్లో పెరగడం కాస్త సంతోషాన్నిచ్చే విషయమనే చెప్పాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×