BigTV English

Heavy to Heavy Rains: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం.. ఇంతటి ఉపద్రవానికి కారణమేంటి ?

Heavy to Heavy Rains: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం.. ఇంతటి ఉపద్రవానికి కారణమేంటి ?

Heavy to Heavy Rains: భారీ వర్షాలు.. ఎంతటి భారీ వర్షాలు అంటే.. చెరువేదో.. ఇళ్లేవో.. కాలువేదో.. రోడ్డేదో.. ఏదేంటో తెలియని పరిస్థితి. నడుము లోతు నీటిలో అడుగులు వేయాల్సి వస్తుంది. వీధుల్లో బోట్లలో తిరగాల్సి వస్తుంది. ఇంతకీ ఇంతటి ఉపద్రవానికి కారణమేంటి? రికార్డులను బ్రేక్‌ చేసేలా వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి?


వర్షాకాలం.. వర్షాలు కురవకపోతే.. ఎండలు దంచికొడతాయా? అని అనొద్దు. ఈసారి కురిసింది మామూలు వర్షాలు కాదు. మాములుగా అయితే వర్షపాతం 20 సెంటీమీటర్లు దాటితే అది అతి భారీ వర్షం కింద లెక్క. భారీ వర్షం కాదు.. అతి భారీ వర్షం. 1989లో గన్నవరంలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదే ఇప్పటి వరకున్న రికార్డ్. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఏరియాల్లో ఎప్పుడూ అంతటి వాన పడలేదు. కానీ ఇప్పుడా రికార్డ్ బద్ధలైంది. విజయవాడ పరిసరాల్లో ఏకంగా 32.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

తిరువూరు, అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకంగా 62 ప్రాంతాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇవేవీ నార్మల్‌ నెంబర్స్‌ కాదు.. వీటిని ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే తెలుస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. అసలు వరదలు ఈ స్థాయిలో రావడానికి మరో కారణం ఏంటో తెలుసా.. ? ఏపీలో వర్షపాతం నమోదు చేయడానికి అనేక స్టేషన్స్ ఉన్నాయి. మాములుగా కొన్ని ఏరియాల్లో వర్షం పడితే.. మరికొన్ని ఏరియాల్లో పడదు. కానీ 75 శాతం ఏరియాల్లో వర్షాలు నమోదయ్యాయి. అంటే స్టేట్‌వైడ్‌గా క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ఇదే ఇప్పుడు వరదలు ఉప్పొంగడానికి కారణమైంది.


Also Read: రైతన్నకు.. తీరని శోకం

ఇక 30 సెంటీమీటర్ల వర్షం కురిసిన విజయవాడ పరిస్థితే అలా ఉంటే.. ఖమ్మం జిల్లాలో ఏకంగా 8 ప్రాంతాలలో 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆ ప్రాంతంలో పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇదే మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చేందుకు కారణమైంది. ఊర్లు, ఏర్లు ఏకమయ్యయాయి. పలు చోట్ల కాల్వలకు గండ్లు పడటం మరింత ఎఫెక్ట్ చూపించింది. నాట్ ఓన్లీ మున్నేరు.. కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. అయితే ఈ బుడమేరు నీరు కృష్ణా నదిలో కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ నీరంతా ఊర్లలోకి వచ్చి చేరింది. తెలంగాణలో 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

వర్షకాలం వానలు పడటం నార్మలే కానీ.. ఈ స్థాయిలో ఎందుకు కురుస్తున్నాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న. కొత్త కొత్త రికార్డులు ఎందుకు నమోదవుతున్నాయి? క్లౌడ్ బరస్ట్‌లు కంటిన్యూస్‌గా ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నడూ చూడని ఉపద్రవాలు ఎందుకు చూడాల్సి వస్తుంది? దీనంతటికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు అంటున్నారు పర్యావరణవేత్తలు.
నిజానికి 1901 నుంచి 1910 మధ్య ఉన్న పర్యావరణానికి.. 2011 తర్వాత ఉన్న ఎన్విరాన్‌మెంట్‌కు మధ్య చాలా మార్పులు వచ్చాయి. టెంపరేచర్ 0.65 డిగ్రీలు పెరిగింది. ఒక డిగ్రీ కూడా లేదు.. ఎందుకంత కంగారు అనకండి. ఆ మాత్రం చాలు మన జీవితాలు తలకిందులు కావడానికి.

Also Read: రైతుల సొమ్ము.. రాబందుల పాలు.. వ్యవసాయ సొసైటీల్లో అవినీతి తిమింగలాలు

వాతావరణం వేడేక్కడం ఏంటి? దాని వల్ల వర్షాలు కురవడమేంటి? అస్సలు సంబంధం లేకుండా చెప్తున్నారనుకుంటున్నారా? కానీ లాజిక్ ఉంది.. దీనికి సైంటిఫిక్‌ రీజన్ కూడా ఉంది. నిజానికి చల్లటిగాలిలో కన్నా.. వేడి గాలిలో తేమ ఎక్కువ. వేడిగాలి తేమ వల్ల అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. దీంతో వర్షాలు కురుస్తాయి.. ఇప్పుడది రీపిటెడ్‌గా జరుగుతోంది. దీన్నే సైక్లోన్ సర్క్యూలేషన్‌ అంటారు.. ఇప్పుడది ఎక్కువగా జరుగుతోంది. అదే ఈ ఉపద్రవాలకు కారణమవుతుంది. మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ముందు ముందు ఇలాంటి ఘటనలు మనం రీపిటేడ్‌గా చూడబోతున్నామని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఎండకాలంలో దంచికొట్టే ఎండలు.. వర్షకాలంలో అతి భారీ వర్షాలు.. ఇకపై రొటీన్ గా మారుతాయంటున్నారు. ఇకపై అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి. కాబట్టి.. బ్రేస్‌ ఫర్ ఇంపాక్ట్.. అంటే మనం చూసింది కొంతే.. చూడాల్సింది ఇంకా చాలా ఉంది. రానున్న ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×