E-Paper
Advertisement

అప్పుల ఉచ్చులో..చిక్కుకున్నారా? ఈ 7 తెలివైన మార్గాలతో ఈజీగా బయటపడండి

అప్పుల ఉచ్చులో..చిక్కుకున్నారా? ఈ 7 తెలివైన మార్గాలతో ఈజీగా బయటపడండి
Advertisement

How to become debt free: ఈ కాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్లు, ఈఎంఐల రూపంలో..అప్పుల ఉచ్చులో చిక్కుకోవడం చాలా సాధారణమైపోయింది. ప్రతి నెలా సంపాదించేదంతా.. వడ్డీలు కట్టడానికే సరి పోతుంటే మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి పోతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి, ప్రశాంత మైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అప్పుల ఊబి నుంచి వేగంగా బయట పడటానికి సహాయపడే ఆ 7 తెలివైన మార్గాలేంటో ఇప్పుడు చూసేద్దాం!

1. అప్పుల లిస్ట్ :

Advertisement

అప్పుల నుంచి బయట పడటానికి మొదటి అడుగు మీ పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవడం. మీకు ఎక్కడెక్కడ, ఎవరికి ఎంత బాకీ ఉన్నారో.. ఒక పేపర్ మీద రాయండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్లు, ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న అప్పులు అన్నింటినీ ఒక లిస్ట్ తయారు చేసుకోండి. దీని వల్ల మీకు అసలు ఎంత అప్పు ఉందనే స్పష్టత వస్తుంది.

2. బడ్జెట్ ప్లాన్ చేసుకోండి:

అప్పులు తీర్చాలనుకునే.. వారు ముందుగా తమ అనవసర ఖర్చులకు బ్రేక్ వేయాలి. రెస్టారెంట్లు, షాపింగ్‌లు, ట్రిప్‌ల వంటి వాటిని తాత్కాలికంగా ఆపేయండి. మీ నెల వారీ ఆదాయంలో ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతుందో ట్రాక్ చేయండి. ఆదా చేసిన ప్రతి చిన్న మొత్తాన్ని మీ అప్పులు తీర్చడానికి ఉపయోగించండి.

3. డెబ్ట్ స్నోబాల్ :

Advertisement

అప్పులు తీర్చడానికి ఆర్థిక నిపుణులు.. రెండు అద్భుత మైన పద్ధతులను సూచిస్తారు. మొదటిది ‘డెబ్ట్ స్నోబాల్’, ఇందులో.. అతి తక్కువ మొత్తం ఉన్న అప్పును ముందుగా తీర్చివేయాలి. రెండవది ‘డెబ్ట్ అవలాంచ్’, ఇందులో ఎక్కువ వడ్డీ పడుతున్న క్రెడిట్ కార్డ్ లేదా లోన్‌ను ముందుగా క్లోజ్ చేయాలి. మీ ఈజీగా బట్టి వీటిలో ఒక పద్ధతిని ఫాలో అవ్వండి.

4.అధిక వడ్డీ:

క్రెడిట్ కార్డ్ లోన్స్, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అలాగే వదిలేస్తే.. వడ్డీ విపరీతంగా పెరిగి పోతుంది. కాబట్టి మీ దగ్గర కొద్దిగా.. డబ్బు ఉన్నా లేదా.. వేరే మార్గం ద్వారా వీలైనంత త్వరగా హై-ఇంట్రెస్ట్ లోన్లను ముందుగా తీర్చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

5.అదనపు ఆదాయం :

కేవలం వచ్చే జీతం సరి పోకపోతే.. పార్ట్‌ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ లేదా మీలోని ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించడానికి ప్రయత్నించండి. ఈ ఎక్స్ట్రా మనీ మొత్తాన్ని కేవలం అప్పులు తీర్చడానికే వాడితే.. మీరు ఊహించిన దాని కంటే చాలా త్వరగా అప్పుల నుంచి బయట పడొచ్చు.

6.కొత్త అప్పులు :

అప్పుల నుంచి బయట పడాలంటే.. మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని కొత్త క్రెడిట్ కార్డులను వాడటం మానేయడం. “ఇది ఇప్పుడే.. కొనేసి తర్వాత కట్టొచ్చు” అనే అలవాటును పూర్తిగా మార్చుకోండి. మీ చేతిలో నగదు లేదా డెబిట్ కార్డులో ఉన్న డబ్బు పరిమితి లోనే షాపింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

Also Read: ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!

7. ఎమర్జెన్సీ ఫండ్:

అప్పులు తీరుస్తున్న సమయంలోనే.. భవిష్యత్తు కోసం ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోండి. అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు మళ్లీ అప్పుల పాలు కాకుండా ఈ ఫండ్ మిమ్మల్ని రక్షిస్తుంది.

అప్పుల ఉచ్చు నుంచి బయట పడటం ఒక్కరోజులో.. జరిగే పని కాదు, దీనికి క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరం. పైన చెప్పిన 7 మార్గాలను క్రమం తప్పకుండా పాటిస్తే.. మీ అప్పుల బాధలన్నీ తొలగి పోయి ప్రశాంత మైన, ఆర్థికంగా బలమైన జీవితాన్ని సొంతం గడపొచ్చు!

Related News

సముద్రంపైనే అద్భుత వ్యవసాయం.. ఉప్పు నీటితో కూరగాయల సాగు.. అదరగొట్టేశారు కదయ్యా!

చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!

ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!

8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!

ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్

ట్రిపుల్ లేజర్‌తో మార్కెట్లోకి వచ్చేసిన 4K ప్రొజెక్టర్.. 6100 ISO ల్యూమెన్స్‌తో అదరగొడుతోంది!

Big Stories

Advertisement
×