BigTV English

Vivek Ramaswamy: లీడ్‌లో వివేక్ రామస్వామి.. అమెరికాను ఏలేస్తాడా? మనోడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Vivek Ramaswamy: లీడ్‌లో వివేక్ రామస్వామి.. అమెరికాను ఏలేస్తాడా? మనోడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
vivek ramaswamy

Vivek Ramaswamy: వివేక్ రామస్వామి. అమెరికాలో మారుమోగుతున్న పేరు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. కేండిడేట్ సెలక్షన్ కోసం జరిగిన మొదటి చర్చలో తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. ఆ చర్చలో మిగిలిన ఆరుగురు సహచరుల కంటే వివేక్ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపారు.


రిపబ్లికన్‌ పార్టీ తరపున మొత్తం 8మంది అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. ట్రంప్ ప్రస్తుతం అందుబాటులో లేరు. తాజాగా జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో ఆరుగురు పార్టిసిపేట్ చేశారు. అందులో ఇద్దరు ఇండియా మూలాలున్నవారే. ఒకరు నిక్కీ హేలీ, ఇంకొకరు వివేక్ రామస్వామి. చర్చలో అందరికంటే వివేక్‌దే పైచేయి అయింది. ఆయనకు విరాళాలు ఒక్కసారిగా పెరిగాయి. చర్చ తర్వాత చేసిన సర్వేలోనూ 28శాతం ఓటింగ్‌తో ఆయనే లీడ్‌లో ఉన్నట్టు తేలింది. ఇలా పలుదఫాల చర్చల అనంతరం.. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని ప్రకటిస్తారు.

ఇటీవలే ఎలాన్ మస్క్ సైతం వివేక్ రామస్వామి గురించి గొప్పగా మాట్లాడారు. ఇలా అందరి అటెన్షన్ డ్రా చేస్తున్న వివేక్ ఎవరు? అంటే.. 37 ఏళ్ల బయోటెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి. రిపబ్లికన్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న అగ్ర పోటీదారుల్లో ఒకరు. 2024 ఎన్నికల కోసం ప్రెసిడెంట్ రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా సవాలు చేసిన యువకుడు. తన హిందూ మత విశ్వాసాన్ని బహిరంగంగానే ప్రకటించే వ్యక్తి రామస్వామి.


వివేక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
భారతదేశం నుండి అమెరికా వలస వెళ్లిన తల్లిదండ్రులకు వివేక్ రామస్వామి ఒహియోలోని సిన్సినాటిలో జన్మించాడు. తమిళం మాట్లాడే బ్రాహ్మణుల కుటుంబం వీరిది. వీరి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. రామస్వామి తమిళ భాషను, భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా హిందూ ఆచార వ్యవహారాల్లో లీనమై, రోజూ దైవప్రార్థనలు చేస్తూ, గుళ్లుగోపురాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే హిందూవాది. అంతేకాదు, వృత్తిరిత్యా వైద్యురాలైన రామస్వామి భార్య అపూర్వ కూడా అదే తోవలో నడిచే వ్యక్తి. వారి ఇద్దరు కొడుకులనను హిందువులుగానే పెంచాలని రామస్వామి దంపతులు స్ట్రిక్ట్‌గా ప్లాన్ చేస్తున్నవాళ్లు.

రెండోతరం భారతీయ అమెరికన్ అయిన రామస్వామి 2014లో రోవాంట్ సైన్సెస్‌ అనే కంపెనీని స్థాపించాడు. 2015, 2016లో అతిపెద్ద బయోటెక్ IPOలకు నాయకత్వం వహించాడు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్‌లో గొంతు సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అపూర్వను వివాహం చేసుకున్న రామస్వామి పలు వైద్య కేంద్రాలను నిర్వహించాడు.

రామస్వామి వ్యాపారవేత్త మాత్రమే కాదు. పాపులర్ రచయిత కూడా. అమెరికా దేశభక్తిపైన పుస్తకాలు రాసి ప్రముఖ ప్రచురణల ద్వారా పబ్లిష్ చేశాడు. అమెరికన్ బిజినెస్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రముఖ వ్యక్తి అయిన రామస్వామి, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయితగా గుర్తింపు పొందాడు. ది న్యూయార్కర్ “ది C.E.O. ఆఫ్ యాంటీ-వోక్” అని పిలిచారు. 2022లో రామస్వామి, స్ట్రైవ్ అనే ఓహియో-ఆధారిత అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించాడు. ఇది బ్లాక్‌రాక్, స్టేట్ స్ట్రీట్, వాన్‌గార్డ్, వంటి ప్రముఖ కంపెనీలతో నేరుగా పోటీపడింది. రామస్వామి, హెల్త్‌కేర్, టెక్నాలజీ కంపెనీలను కూడా స్థాపించాడు. 2020 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికాడు. అంతకుమించి, అటు డెమొక్రాట్‌లకు, ఇటు రిపబ్లికన్‌లకు మద్దతు ఇస్తూ రాజకీయ రచనలు చేశాడు. ఈ క్రమంలో 2020 నుండి 2023 వరకు, అతను ఒహియో రిపబ్లికన్ పార్టీకి మొత్తం 30,000 డాలర్లను చందాగా ఇచ్చాడు. 2016లో, కాంగ్రెస్ సీటు కోసం పోటీ చేస్తున్న ఫ్లోరిడా డెమొక్రాట్ అయిన దేనా గ్రేసన్‌ ప్రచారానికి 2,700 డాలర్లు విరాళం ఇచ్చాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో వివేక్ రామస్వామి అమెరికాలో తన పేరు మోగేటట్లు చేసుకున్నాడు. ఇప్పుడు రిపబ్లికన్ల నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు వివేక్ రామస్వామి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×