Kadiri Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా..కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మొదలైన ‘మాటల యుద్ధం’ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? ఇరు నేతల మధ్య సాగుతున్న ఆరోపణల పర్వం ఏంటి?
సత్యసాయి జిల్లా కదిరి….ఇక్కడ కూటమి గెలిచినప్పటికీ, ఆ గెలుపు మాదంటే మాదని బీజేపీ, టీడీపీ నేతలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీరుపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సాక్షిగా ఇరువురి మధ్య బహిరంగ చిచ్చు పెట్టింది…రథోత్సవం సందర్భంగా నన్ను రథం ఎక్కేందుకు వెళ్తున్న క్రమంలో టీడీపీ MLA కందికుంట వెంకటప్రసాద్ తనను అడ్డుకొనే ప్రయత్నం చేశారని, పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించారని ఆరోపిస్తున్నారు. కదిరిలో ఎమ్మెల్యే కందికుంట నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, మిత్రపక్షం అన్న గౌరవం ఇవ్వడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పటిది కాదని 2024 ఎన్నికల ముందు నుంచి కూడా ఇద్దరి మధ్య పోరు నడుస్తోందంటున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు విష్ణు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఒక సీటు బిజెపికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం, ధర్మవరం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడంతో విష్ణువర్ధన్ రెడ్డికి టీకెట్ దక్కలేదని ఆయన వర్గం వాదిస్తోంది. కదిరిలో టీడీపీ విజయం వెనుక నా పాత్ర కూడా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నారు.
Also Read: Smart Cooker: ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ భలే స్మార్ట్.. ఒకేసారి అన్నం, పప్పు, కూర వండేయొచ్చు
ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. విష్ణువర్ధన్ రెడ్డి చేసే విమర్శలపై కందికుంట వర్గం కూడా ధీటుగానే స్పందిస్తోంది. గెలిచింది మేం.. కష్టపడింది మేం.. ఇప్పుడు పెత్తనం చేస్తామంటే కుదరదన్నది తమ్ముళ్ల వాదన…అసలు విష్ణు వర్ధన్ రెడ్డి కి కదిరి కి ఏం సంబంధం లేదని కదిరి బీజేపీ ఇంచార్జి MS పార్థసారథి అని ఆయనకు ఎక్కడ గౌరవం తగ్గకుండా చూసుకుంటున్నామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు విష్ణు ఎవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అంటుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో విష్ణు ప్రచారానికి వస్తే తనకు టికెట్ కూడా అక్కర్లేదని టీడీపీ అధిష్టానానికి చెప్పానని, విష్ణు వర్ధన్ రెడ్డి వల్ల కూటమి ఓట్లు పెరగకపోగా ఇంకా తగ్గిపోతాయని స్పష్టం చేశానని ఎమ్మెల్యే అంటున్నారు. విష్ణు లాంటి వ్యక్తి తమతో కలిసి ప్రచారం చేస్తే కూటమికి ఇంకా చెడ్డ పేరు వస్తుందని, అసలు ఆయనను బీజేపీ కూడా ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని, విష్ణు వైసీపీ కోవర్ట్ అని కందికుంట వర్గీయుల వాదన… అసలు తనకు తెలియని వ్యక్తి గురించి ఇంత చర్చ అవసరం లేదని కందికుంట వెంకటప్రసాద్ ఆ ఇష్యూని లైట్ తీసుకుంటున్నారు. మీడియాలో తప్ప విష్ణు వర్ధన్ రెడ్డి ఎక్కడా బయట కనపడరని, అలాంటి వ్యక్తి గురించి ఆలోచించే సమయం తమకు లేదని కందికుంట స్పష్టం చేశారు.
అటు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, “కూటమి ధర్మం పాటించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఇకపై కదిరిలో కందికుంట దౌర్జన్యాలను సహించబోనని, కందికుంట చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తానని తెలిపారు. ఇకపై కందికుంటకు వ్యతిరేకంగా కదిరి లో నిలబడతానని తన అనుచరులతో తెలిపారట… అయితే ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికి ఆయన ఫ్లైట్ ఎక్కి కేరళ వెళ్లిపోవడం, కనీసం కదిరి రథోత్సవం లో గాయపడ్డ వారిని పరామర్శించకుండా వెళ్లడం విమర్శలకు తావిస్తోంది… కదిరి రథోత్సవం కొనసాగుతుండగానే ఆయన కదిరి విడిచి వెళ్లిపోవడం చూస్తూ ఉంటే ఆయన కదిరి పాలిటిక్స్ పట్ల సీరియస్ గా లేడని తెలుస్తోందని బీజేపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ అంతర్గత పోరు వల్ల కదిరిలో కూటమి ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రెండు పార్టీల పెద్దలు జోక్యం చేసుకుని ఈ ఇద్దరు నేతలకు సర్ది చెబుతారా? లేక ఈ మాటల యుద్ధం మరింత ముదిరి, కదిరి కూటమి రాజకీయాల్లో మరింత ముసలం రేపుతుందా? అనేది ఆయా పార్టీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోందంట.
Story By Apparao, Big TV
Also Read: Telugu Movie Memes: గ్యాస్ కొరత.. ఈ ఫన్నీ సినిమా టైటిల్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు!