E-Paper
Advertisement

వెంకీమామ ఫాన్స్ కు నిరాశే.. వాయిదాపడిన ఆదర్శ కుటుంబం?

వెంకీమామ ఫాన్స్ కు నిరాశే.. వాయిదాపడిన ఆదర్శ కుటుంబం?
Advertisement

AK 47 Movie: విక్టరీ వెంకటేష్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో పాత్రలో నటించిన ఈయన త్వరలోనే ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా విడుదల కావడానికి సిద్ధమైంది.

వాయిదా పడిన ఆదర్శ కుటుంబం..

ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర బృందం గత కొద్ది రోజుల క్రితం అధికారకంగా ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్లను నిర్వహించని నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న విధంగానే అక్టోబర్ రెండో తేదీ విడుదల అవుతుందా? లేదంటే వాయిదా పడుతుందా? అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ వాయిదా పడుతోందని ఇండస్ట్రీ సమాచారం.

ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదేనా..

Advertisement

గాంధీ జయంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ నుంచి వాయిదా పడుతూ అక్టోబర్ 9వ తేదీ లేదా 15, 16 తేదీలలో విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల అయితే కచ్చితంగా అదే రోజు విడుదల కావాల్సిన రణబాలి సినిమా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సినిమా యధావిధిగా విడుదల అయితే వెంకటేష్ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9 వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఈ విషయాల పట్ల చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు.

నిరాశలో వెంకీ ఫ్యాన్స్..

ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఇలాంటి గందరగోల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వెంకీ మామ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయం గురించి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిట్టిబాబు అనే పాత్రలో కనిపించబోతున్నారు. వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి స్వర్ణ అనే పాత్రలో సందడి చేయనున్నారు. మరో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వెన్నెల కిషోర్ రఘు బాబు, సత్య వంటి తదితరులు కీలకపాత్రలలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన ఈషా రెబ్బా .. వైరల్ అవుతున్న ఫోటోలు!

Related News

కోర్టు ఫేం హర్ష రోషన్ “తెల్ల కాగితం” రిలీజ్ డేట్ ఫిక్స్..ఇలా కలిసొచ్చిందా?

యెష నాగుల పాటకు నేషనల్ అవార్డ్ పక్కా.. కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో!

ఫోక్ స్టార్ కిట్టు పవన్ మూవీ లాంచ్..కెమెరా స్విచ్ ఆన్ చేసి విషెస్ తెలిపిన బిగ్ టీవీ చైర్మన్!

గుడ్ న్యూస్ చెప్పిన ఈషా రెబ్బా .. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!

తెలుగు ప్రేక్షకులపై విషం కక్కుతున్న కన్నడ కన్నయ్యలు.. తప్పు బ్రో!

సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

Big Stories

Advertisement
×