E-Paper
Advertisement

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?
Advertisement

తెలంగాణలో జ‌నసేన త‌న పొలిటిక‌ల్ గ్రాండ్ ఎంట్రీకి గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకుంటున్న‌దా…? బీజేపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం ద్వారా ఇక్క‌డి యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్ ఎంత ఉందో తెలియ‌జేసేందుకు ఖమ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తుందా? అంటే అవున‌నే చెప్పాలి. అంద‌రికంటే ముందు ఇక్క‌డ అభ్యర్థిని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుడే కార్య‌రంగంలోకి దిగి గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తుండ‌టం పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

గ‌డ‌ల శ్రీ‌నివాస్ ఎంపిక‌తో చ‌ర్చ‌..

ఖ‌మ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి గ‌డ‌ల శ్రీ‌నివాస్‌ను అభ్య‌ర్థిగా ఖ‌రారు చేసింది జ‌న సేన పార్టీ. పార్టీ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న శ్రీ‌నివాస్‌.. గ‌తంలో హెల్త్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అనుభవం ఉంది. క‌రోనా స‌మ‌యంలో కూడా అత‌ను స‌ర్వీసులో ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలోని యువ‌త‌, ప్ర‌జ‌ల‌తో ఉన్న సంబంధాలు పార్టీకి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అధిష్టానం భావిస్తోంది.

బీజేపీతో పొత్తుకు ప్ర‌య‌త్నం..

Advertisement

తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని బీజేపీ భావించింది. కానీ ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్ల బీజేపీ వెన‌క్కి త‌గ్గింది. తెలంగాణ‌లో త‌న‌ను అడుగు పెట్ట‌నీయ‌కుండా చేస్తున్నారని, మీ య‌బ్బ జాగీరా అనే అనుచిత వ్యాఖ్య‌లు ఆ పార్టీకి మేలు చేసేవిగా కాకుండా మ‌రింత గ్యాప్‌నే పెంచాల‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయంగా తీసుకున్న పాల‌సీ మ్యాట‌ర్‌లో భాగంగా ఒంట‌రి పోరుకే ముందుకు పోతామ‌ని ప్ర‌క‌టించడంతో .. ప‌వ‌న్ సైతం ఒంట‌రిగా బరిలోకి దిగాడు. గ్రాడ్యుయేష‌న్ ఎన్నిక‌ల ద్వారా యువ‌త‌లో ఉన్న క్రేజ్‌ను అందిపుచ్చుకుని త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారాయ‌న‌.

Also Read: తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

ఎమ్మెల్యే టికెట్ కోసం బీఆరెస్‌లో చేరి..

Advertisement

జ‌న‌సేన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన గ‌డ‌ల శ్రీ‌నివాస్ గ‌తంలో బీఆరెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్త‌గూడెం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆ త‌రువాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ యాక్టివ్ కానుంద‌నే సంకేతాలు అందుకున్న ఆయ‌న ప‌వ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మిస్తూ ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీ‌నివాస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌నే వ్యూహంతోనే జ‌న‌సేన‌లో చేరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆయ‌న ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇది ఇరువురికి ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారింది.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×