E-Paper
Advertisement

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?
Advertisement

Raghuveera: అప్పుడు ఆయ‌న కింగ్‌. ప‌రిస్థితులు తారుమారైనా కింగ్ మేక‌ర్‌గా త‌న స‌త్తా చాటుకుంటున్నారు. ఏపీ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉన్నా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆ సీనియ‌ర్ నేత తన ప‌ట్టును కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ కాంగ్రెస్ బ‌రిలో ఉంటే చాలు.. ఎవ‌రి కొంప ముంచుతుందా? అని ప్ర‌త్య‌ర్థులు హ‌డ‌లిపోతారు.. ఎవ‌రా నేతా..? ఏమా క‌థా..??

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నీల‌కంఠాపురం ర‌ఘువీరారెడ్డి పొలిటిక‌ల్ ట్రాక్ రికార్డ్ కొంచెం డిఫ‌రెంట్‌. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉత్థాన‌ప‌త‌నాలు చూశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి ప‌ద‌వులు అలంక‌రించారు. పార్టీ ప‌రిస్థితి దారుణంగా ప‌డిపోయిన‌ప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైనా.. అక్కడ త‌న ప్రభావాన్ని చాటుకుని పార్టీ బ‌లాన్ని కొన‌సాగిస్తున్నారు.

మ‌డ‌క‌శిర‌లో కాంగ్రెస్ బ‌రిలో ఉంటే హ‌డ‌లు..

Advertisement

స‌త్యసాయి జిల్లా మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘువీరారెడ్డి రాజ‌కీయ‌మే న‌డిచేది. వ‌రుస‌గా ఆయ‌న అక్కడ్నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కీల‌క మంత్రి ప‌ద‌వులు కూడా చేశారు. ఆ త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఎస్సీ రిజ‌ర్వ్ కోటా కింద మార‌డంతో ప‌క్కనే ఉన్న క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసినా.. ఆయ‌న ప‌ట్టంతా మ‌డ‌క‌శిర‌లోనే ఉంది. అక్క‌డ త‌నకున్న ప‌ట్టును నిలుపుకుంటూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వ‌స్తున్నారు.

Also Read: వైసీపీకి విజయసాయిరెడ్డి సంచలన లేఖ.. సజ్జల నాపై దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు!

రాజ‌కీయాల్లో మ‌ళ్లీ ర‌ఘు యాక్టివ్ మోడ్‌..

Advertisement

మ‌డ‌క‌శిర‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఘ‌న‌నీయ‌మైన ఓట్లు సాధిచ‌డం వ‌ల్ల టీడీపీ, వైసీపీల గెలుపోట‌ముల‌పై ప్రభావం చూపుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతోంది కాంగ్రెస్‌. ఈ ప‌రిణామం గ‌తంలో టీడీపి మెజారిటీని భారీగా త‌గ్గించింది. ఇప్పుడు వైసీపీ గెలుపు అవ‌కాశాల‌కు కూడా గండి కొట్టేలా ఉందంటున్నారు విశ్లేష‌కులు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ ఉనికి చాటుకునేలా ఉందంటున్నారు. ర‌ఘువీరా కూడా ఇప్పుడు రాజ‌కీయాల్లో మ‌రింత యాక్టివ్ అయ్యారు. ఆయ‌న‌ను అధిష్టానం సీడ‌బ్ల్యూసీ మెంబ‌ర్‌గా నియ‌మించడంతో మ‌రింత బాధ్యత మరింత పెరిగింది పార్టీలో. మరి రఘువీరా పార్టీకి పూర్వ వైభవం తెస్తారో లేదో చూడాలి.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×