Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఏమేం నష్టం జరిగింది ? ఈ విషయంలో భారత్ సాధించిన విజయాలేంటి? ఇందులో పాక్ కి జరిగిన నష్టాల విలువ ఏ పాటిది? దీని తాలూకూ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? ఒక సారి చూద్దాం.
9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చేసిన భీకర దాడికి పాక్ కి ఎలాంటి నష్టాలు జరిగాయో చూస్తే.. లాస్ నెంబర్ వన్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు.. ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని.. తొమ్మిది ఉగ్రవాద స్తావరాలను భారత్ ధ్వంసం చేసి అపార నష్టం కలిగించింది.
ఇందులో లష్కరే, జైషే, హిజ్బుల్ ఉగ్ర శిబిరాలు
ఇందులో లష్కరే తోయిబా, జేషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లకు చెందిన ఉగ్రవాద స్థావరాలున్నాయి. ఈ ఉగ్ర శిబిరాలు భారత్ పై ఉగ్రదాడులు పథక రచన చేయడంలో అత్యంత కీలకంగా పని చేశాయి. ఇక్కడి నుంచే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తాలూకూ ధ్వంస రచన కొనసాగించేది. ఈ ప్రాంతాలపై అనేక విధాలుగా నిఘా ఉంచిన భారత్ వీటి వివరాలను సేకరించింది. అందులో భాగంగా బాహావల్పూర్, ముజఫరాబాద్ లో జరిగిన దాడుల్లో ఉగ్ర వాదులు భారీ ఎత్తున నష్టపోయినట్టు తెలుస్తోంది. బహావల్పూర్ లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఆయన సోదరి, సోదరుడితో సహా.. పలువురు కుటుంబ సభ్యులు హతమయ్యారు.
అజర్.. సోదరి, సోదరుడతో సహా పలువురు కుటుంబ సభ్యులు హతం
ఇదిలా ఉంటే, ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు సైతం చనిపోయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చూస్తే.. జేషేకి చెందిన మొహమ్మద్ యూసఫ్ అజార్, హఫీజ్ మొహమ్మద్ జమీల్ చనిపోగా.. వీరు జైషే చీఫ్ అజార్ కి బావమరుదులు. ఇక లష్కరేకి చెందిన ముదస్సర్ ఖదియాన్ ఖాస్ సైతం చనిపోయాడు. ఈ వార్త తెలిసిన పాక్ సైన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది, ఇతడి అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది.
లష్కరేకి చెందిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతం
లష్కరేకి చెందిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూ లోని పలు ఉగ్రదాడులతో ఇతడికి ప్రత్యక్ష సంబంధముంది. జైషేకి చెందిన మరో కీలక ఉగ్రవాది మొహమ్మద్ హసన్ ఖాన్ సైతం ఆపరేషన్ సిందూర్ లో చనిపోయాడు. ఇతడు పీవోజేకే జైషే ఉగ్ర స్థావర నిర్వహణ బాధ్యతలు చూసుకునేవాడు. బహావల్పూర్ వంటి సున్నిత ఉగ్రవాద ప్రాంతాల్లోకి కనీసం అమెరికా డ్రోన్లు పంపడానికి కూడా సాహసించేది కాదు అలాంటిది. ఆ ప్రాంతాల్లోకి మన సైన్యం దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది.
వందల కిలోమీటర్ల మేర పాక్ భూభాగం పై దాడులు
రెండో నష్టమేంటని చూస్తే.. పాకిస్థాన్ ప్రధాన భూభాగంల తీవ్రమైన దాడులు జరిగాయి. పీవోజేకేలోనే కాకుండా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఈ దాడులు జరిగాయి. పాకిస్థాన్ ప్రధాన సైనిక స్థావరమైన పంజాబ్ ప్రావిన్స్ లోని ఆర్మీ బేస్ సైతం ధ్వంసమైంది.
పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైనా దాడి
లాస్ నెంబర్ త్రీ.. పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంని భారత దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. 23 నిమిషాల వ్యవధిలో నిర్వహించిన ఈ దాడుల్లో పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థలపై దాడులు చేసింది.
SCALP క్షిపణులు, HAMMER బాంబులతో..
SCALP క్షిపణులు, HAMMER బాంబులతో కూడిన భారత రాఫెల్ జెట్‌లతో పాకిస్థాన్ ని భారత్ బెంబేలెత్తించింది. భారత హైఎండ్ వార్ ఫేర్ రేంజ్ ఏంటో పాకిస్థాన్ కి రుచి చూపించింది. ఆపరేషన్ సిందూర్ ఫస్ట్ పార్ట్ లో ప్రధానంగా చేసిన దాడులు సైనిక పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకోలేదు. కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాయి.
కరాచీ పోర్టుపై విరుచుకుపడ్డ భారత నేవీ
ఆపరేషన్ సిందూర్ 2 విషయానికి వస్తే.. భారత త్రివిధ దళాలు.. ఆర్మీ- నేవీ- ఎయిర్ ఫోర్స్.. సమన్వయంతో దాడులు జరిపాయి. ఇది భారత సర్వ సైనిక శక్తికి నిదర్శనంగా నిలిచింది. మరీ ముఖ్యంగా కరాచీ పోర్టుపై మన నావికా దళం విరుచుకుపడింది. పాకిస్థాన్ కి చెందిన పన్నెండు నావలను ధ్వంసం చేసింది. ఇది కూడా పాక్ కి కోలుకోలేని దెబ్బ. 1971 తర్వాత కరాచీపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి.
లాహోర్ లోని పలు సైనిక స్థావరాలపై దాడులు
పాక్ కి ఆయువు పట్టులాంటి కరాచీతో పాటు.. లాహోర్ లోని పలు సైనిక స్థావరాలపై దాడులు చేసింది. పెషావర్ లోనూ భారీ పేలుళ్లు సంవించాయి. పంజాబ్ ప్రావిన్స్ గగన తల నిఘా విమానాన్ని సైతం భారత్ కూల్చివేసింది.
వీటన్నటి ద్వారా పాక్‌కి కోలుకోలేని దెబ్బ
వీటన్నటి ద్వారా పాక్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎంత శక్తిమంతమైనవో.. కేవలం పాక్ కి మాత్రమే కాదు.. ఈ ప్రపంచానికి తెలియ వచ్చింది. అంతే కాదు.. భారత దేశ ప్రజలను రక్షించుకోడానికి.. ఒకరి అనుమతి అవసరం లేదని.. అదే సమయంలో ఒకరి అవసరం కూడా లేదని.. భారత్ సర్వసత్తాక సైనిక సామర్ద్యం అంతులేని శక్తియుక్తులను కలిగి ఉందని చాటి చెప్పింది. సరిగ్గా అదే సమయంలో ఉగ్రవాదులు వారి సూత్రధారులు ఎక్కడ తలదాచుకున్నా తాము వదిలేది లేదని స్పష్టమైన ప్రకటన చేసింది.
వీరి మరణాన్ని జాతి వీరుల మరణంతో సమానంగా పాక్ ట్రీట్
ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్థాన్ కి జరిగిన ఆస్తి నష్టం ప్రాణ నష్టం విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ వందకు పైగా ఉగ్రవాదులను హతమార్చింది భారత్. ఇదే పాకిస్థాన్ కి సంబంధించి అతి పెద్ద నష్టం. కారణం ఉగ్రవాదులే వారి ఆస్తిపాస్తులు, ఆదాయ వనరులు. వీరి మరణం పాక్ కి తీరని లోటు. ఇప్పటి వరకూ చనిపోయిన ఉగ్రవాదులంతా గతంలో పలు ఉగ్రదాడుల్లో కీలక భాగస్వాములు. వీరి మరణాన్ని జాతి వీరుల మరణంతో సమానంగా పాక్ ట్రీట్ చేస్తోందంటే.. ఈ దాడుల ద్వారా జరిగిన నష్టం ఏ మేరకో ఊహించుకోవచ్చు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే
ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు. మోడీ సైతం ఈ అంశంపై స్పందించారు. ఉగ్రవాదుల అప్పగింత, పీవోజేకే తిరిగి స్వాధీనం చేయడానికి మాత్రమే చర్చలు చేయాల్సి ఉంటుంది.. తప్ప.. ఇందులో మరో మాటకు తావు లేదన్నారు. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం ఉండబోదని తేల్చి చెప్పారు.
లాస్ట్ మినిట్స్ లో పాక్ చవి చూసిన హెవీ లాస్ ఏపాటిది?
పాకిస్థాన్ లొంగిపోవడానికి అసలు కారణమేంటి? పాకిస్తాన్ ఏ నష్టం కారణంగా హ్యాండ్సప్ అన్నది? లాస్ట్ మినిట్స్ లో పాక్ చవి చూసిన హెవీ లాస్ ఏపాటిది? ఫైనల్ గా పాక్ స్టాక్ మార్కెట్లు ఎలాంటి నష్టాన్ని చవి చూశాయ్? దెబ్బ తిన్న సైనిక స్థావరాలు, పౌర నివాసాల ఆస్తి నష్టం ఎంత మేరకు? ఉగ్ర నష్టం అంచనాలు ఎలాంటివి?
మే 10 నాటి 90 ని. ల భారత దాడి కీలకం
పాక్ ఉగ్ర నష్టం ఇప్పట్లో పూడ్చలేనిది పాకిస్తాన్ లొంగిపోవడానికి అసలు కారణం మే 10న జరిగిన 90 నిమిషాల యుద్ధంగా చెబుతారు. భారత వైమానిక దళం చేసిన ఈ మెరుపు దాడులే ప్రధాన కారణం అంటారు. ఏకంగా 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో భారత్ తన స్వదేశీ అస్త్రమైన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది, ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని అంటున్నారు.
రహీం యార్ ఖాన్, నూర్ ఖాన్, రఫీకుల్ బేస్..
రహీం యార్ ఖాన్, రావల్పిండిలోని నూర్ ఖాన్, జాంగ్‌లోని రఫీకుల్ బేస్, షోర్కోట్, చక్వాల్‌లోని మురీద్ బేస్‌లతో భారత్ విధ్వంసం సృష్టించింది. దీంతో పాటు POJKలోని.. స్కార్దు, జాకోబాబాద్‌లోని మూడు కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయినట్టు తెలుస్తోంది. ఈ స్కార్దు స్థావరం నియంత్రణ రేఖకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడి పాకిస్తాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది.
నియంత్రణ రేఖకు 35 కి. మీ దూరంలోని స్కార్ధు స్థావరం
ఇక్కడే అసలు ట్విస్ట్ నమోదయ్యింది. అమెరికా, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలుంచిన సర్గోధ వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేల మట్టమయ్యింది. అంతే కాదు, సర్గోధ దగ్గర్లోని కార్నీ పర్వతాల్లో పాకిస్తాన్ రహస్యంగా నిర్మించిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల తర్వాత, పాకిస్తాన్ తమ వద్ద ఆయుధాలు నిండుకున్నాయని, కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపింది. భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ పేలుళ్ల కారణంగా లోపలున్న అణ్వాయుధాలు వేడికి లీకై ఉండొచ్చని భావిస్తున్నారు.
కార్నీ పర్వతాల్లోని అణ్వాయుధాలపైనా భారత్ గురి?
భారత్ ఈ దాడి చేయడంతో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు తేలిపోతున్నాయన్న ఆందోళన మరో వైపు అగ్రదేశాన్ని గడగడలాడించింది. తమ ఆయుధ మార్కెట్ పడి పోతుందనే ఆందోళన.. అమెరికాను కలవపాటుకు గురిచేసినట్టు భావిస్తున్నారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అమెరికా.. కాల్పులను ఆపడానికి ప్రయత్నించిందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, భారత్ బలూచిస్తాన్‌లోని బోలారి వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు, కేవలం ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులు ఈ లక్ష్యాలను ఛేదించాయి.
40 మంది పాక్ సైనికులు చనిపోయారు- ఇండియన్ ఆర్మీ
ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన 40 మంది సైనికులు మరణించినట్లు ప్రకటించారు మన ఆర్మీ అధికారులు. అంతే కాకుండా, అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బ తిన్నాయి. మొత్తం మీద, అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత సైతం ప్రశ్నార్థకమైంది. భారతదేశం ఎవరి సహాయం లేకుండా, కేవలం తన సొంత శక్తితో ఈ దాడులను విజయవంతంగా నిర్వహించడం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని పంపింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్‌ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నించినట్టు భావిస్తున్నారు. అంటే ఇది కేవలం పాకిస్థాన్ కి మాత్రమే కాకుండా అమెరికాను సైతం నష్టం కలిగించినట్టుగా తెలుస్తోంది.
రూ. 80 వేల కోట్ల మేర లాస్?
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే కాకుండా భారత్ చేపట్టిన.. ఆపరేషన్ సిందూర్ పాక్ స్టాక్ మార్కెట్ ను సైతం అతలాకుతలం చేసింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 80 వేల కోట్ల మేర నష్టపోయినట్టు తెలుస్తోంది. ఐఎంఎఫ్.. పాకిస్థాన్ కి 2 బిలియన్ డాలర్ల ను బెయిలౌట్ ప్యాకేజ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో ఒక బిలియన్ వెంటనే ఇస్తారు. కానీ పాక్ స్టాక్ మార్కెట్ నష్టం చూస్తే.. 2. 85 డాలర్లుగా ఉంది. దీన్ని బట్టీ చూస్తే ఐంఎఎఫ్ ప్యాకేజీ ద్వారా కూడా పాక్.. కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
సైనిక పౌర సంబంధిత ఆస్తులు సైతం ధ్వంసం
ఇవన్నీ ఇలాగుంటే.. ఇటు సైనిక ఆస్తులతో పాటు, అటు పౌరసంబంధిత ఆస్తులు సైతం దెబ్బ తిన్నాయి. ఈ నష్టపరిహారం సైతం.. పాక్ కొంత వరకూ ఖర్చు చేయాల్సి రావచ్చు. వీటన్నిటిని బట్టీ చూస్తుంటే.. పాకిస్థాన్ కి భారీ ఎత్తున ఆర్ధిక నష్టం కలిగినట్టు తెలుస్తోంది. అందుకే పాక్ జాతీయులు.. రోడ్ల మీదకొచ్చి.. భారత్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థానీయుల నిరసన
టోటల్ గా పాక్ కి జరిగిన నష్టం విలువ ఇదీ అని.. ఇప్పట్లో అంచనా వేయడానికి వీల్లేనిది. ఇంకా యుద్ధం కొనసాగుతుందన్న సంకేతాలు అందుతుండగా.. ఈ మొత్తం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే. పాకిస్థాన్ కి జరిగిన ఉగ్ర నష్టం ఒక అంతులేనిది. ఈ నష్టం వారు ఇప్పట్లో పూడ్చుకోలేనిది. ఎవరూ వెలకట్టలేనిదని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.